తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

👉ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.నరెడ్కో, క్రెడాయ్‌ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు.
👉శుక్రవారం గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాల్సి ఉందన్నారు.

👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం*
*మంత్రి లోకేష్ ను కలిసి చెక్ అందజేసిన మాదాల శ్రీరామ్ భాస్కర్*..ఉండవల్లిః పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. గుంటూరుకు చెందిన మాదాల శ్రీరామ్ భాస్కర్ ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి అన్న క్యాంటీన్లకు రూ.10లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్ ను మంత్రి నారా లోకేష్ కు అందించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చిన శ్రీరామ్ భాస్కర్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

👉ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ MLA గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అయితే ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది తెలియాల్సి ఉంది.

👉*లక్ష్యసాధనకు అందరి సహకారం కావాలి*
*20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం*..పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు*
*దిశానిర్దేశం చేసిన మంత్రుల ఉపసంఘం ఛైర్మన్ నారా లోకేష్*
ఉండవల్లిః కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని, సమన్వయ లోపం లేకుండా లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రుల ఉపసంఘం ఛైర్మన్ నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సీఎస్ కే.విజయానంద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. అందులో తొలి హామీ ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పిన. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఒక నెంబర్ పెట్టి.. ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పలేదు. మేం చెప్పాం. దానికి కారణం నేను యువగళం పాదయాత్రలో భాగంగా గంగాధర నెల్లూరుకు వెళ్లినప్పుడు ఓ తల్లితో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని ఆ మహిళను అడిగినప్పుడు.. ఆమె ఒక్కటే చెప్పింది. భర్త తాగుబోతు చనిపోయాడు, కష్టపడి
తన ఇద్దరు బిడ్డలను చదివించానని, వారిద్దరికి ఉద్యోగాలు కల్పించాలని కోరింది. కూటమి మేనిఫెస్టో ఓ గదిలో కూర్చొని రూపొందించింది కాదు.. క్షేత్రస్థాయి అనుభవాలతో రూపొందించింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలి. ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతుంది. నెలలో ఒకసారి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటుచేసుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది.

*ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి*
గడచిన ఐదేళ్లలో ఏం జరిగిందో అందరం చూశాం. చెప్పుకునే స్థాయిలో పెట్టుబడులు రాలేదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. పెట్టుబడులు తీసుకురావడం అంత సులభం కాదు.. చాలా సమయం పడుతుంది. మళ్లీ జగన్ రెడ్డి రాడనే గ్యారంటీని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పీపీలను రద్దు చేశారు. పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. వారిని బతిమిలాడి రాష్ట్రానికి తీసుకువచ్చే పరిస్థితి. 1995-2004తో పోల్చుకుంటే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ ప్రభుత్వ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలి. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలి. కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుదాం. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరగాలి. ఉద్యోగాలు కల్పిస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి. నెలకు రూ.4వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తోంది. అందరం కలసి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషిచేద్దాం.

*అచ్చేదిన్ రోజులు మనకు వచ్చాయి*
కూటమి పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఈడీబీ వ్యవహరిస్తుంది. లక్ష్య సాధనకు అందరి సహకారం కావాలి. ఒక్క పెట్టుబడి కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి వీలులేదు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఉపాధి కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఐదేళ్లు రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అహర్నిశలు కృషిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. లక్ష్యసాధనకు తమవంతు బాధ్యత వహించాలని, శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, పరిశ్రమలు, ఆరోగ్యం, హోమ్, మానవ వనరులు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్(I&I), జీఎస్ డబ్ల్యూఎస్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కార్మిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్, సెర్ప్, పర్యాటకం, రవాణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*****
👉 *బంజారా హిల్స్ లో మాజీ మంత్రి KTR పై కేసు*
నిన్న విచారణ తరువాత ACB ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన KTR పోలీసుల పై దుర్భాషలాడి, న్యూసెన్స్ చేసి , ట్రాఫిక్ సమస్యకు కారణమైన ఘటన
ACB ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ వరకు అనుమతి లేకుండా ర్యాలీ తీసిన KTR, తో పాటు మరో 6 గురు పై కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు

👉 తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..తిరుపతి 2025, జనవరి 09
• భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠ ద్వార దర్శనం
10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనంపై ఆగమ శాస్త్రం ప్రకారం, టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంటుంది
రాజకీయాలు చేస్తే సహించను, భక్తితో సేవాభావంతో పనిచేయాలి..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, విచారం వ్యక్తం చేస్తున్నా..మృతి చెందిన 6 మందిలో ఒక్కోక్కరికి రూ.25 లక్షల పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం..ఆరోగ్యం సీరియస్ ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం..గాయపడ్డ 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి శుక్రవారం శ్రీవారి దర్శనం, వారందరిని వారివారి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే..నిర్లక్ష్యం వహించిన డిఎస్పీ రమణ కుమార్, టిటిడి గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిలను విధుల నుండి సస్పెండ్
టిటిడి జేఈవో ఎం. గౌతమి, టిటిడి సివిఎస్వో శ్రీధర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు లను బదిలీ ..ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశం
టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్. నాయుడు, టిటిడి ఈవో శ్రీ జే. శ్యామలరావు, టిటిడి పాలకమండలి సభ్యులు సమిష్టిగా సమన్వయంతో పనిచేసి భక్తులకు విశేష సేవలు అందించాలి.
ఎంతటి వారైనా వడ్డీకాసుల వాడీ లెక్కల నుండి తప్పించుకోలేరు.శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనార్థం ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు కోసం తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. టోకెన్లు జారీలో అలసత్వం వహించిన డీఎస్పీ రమణకుమార్, ఇన్‌చార్జి ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి లను సస్పెండ్ చేయగా, జేఈవో ఎం. గౌతమి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్‌లను బదిలీ చేశారు. మృతి చెందిన 6 మందిలో ఒక్కోక్కరికి రూ.25 లక్షల పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామన్నారు. ఆరోగ్యం సీరియస్ ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి వైకుంఠ ఏకాదశి రోజున (శుక్రవారం) శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వారందరిని వారివారి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రైస్తవులకు జెరూసలేం, ముస్లింలకు మక్కా లాగా, తిరుమల హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమని, జీవితకాలంలో ఒకసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. భక్తుల ఆశయాలకు తగ్గట్లు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడీ ఈవో జె. శ్యామల రావు, టిటిడి పాలక మండలి సభ్యులు సమిష్టిగా సమన్వయంతో భక్తితో సేవలు అందించాలని సూచించారు.
తిరుపతిలో టోకెన్లు జారీ చేయడంపై సీఎం స్పందిస్తూ, వైకుంఠ ఏకాదశి తొలిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తారని, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాడంగా విశ్వసిస్తారన్నారు. అయితే గత ఐదేళ్లలో తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి తిరుపతిలో టోకెన్లు ఇచ్చే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కొత్త సంస్కృతి ఆగమ శాస్త్రం ప్రకారం చేశారా అనేది తమకు తెలియదన్నారు. ఆగమ నిపుణలను సంప్రదించి టిటిడి బోర్డు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్న క్షత్రగాత్రులతో మాట్లాడితే తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వడం సరైంది కాదని భక్తులు చెప్పారన్నారు. తమ కూటమి ప్రభుత్వ వచ్చాక టిటిడిలో భక్తులకు మెరుగైన,నాణ్యమైన సేవలు అందించేందుకు ఒక్కోక్కటి మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే లడ్డూ ప్రసాదాలలో,అన్నప్రసాదాలలో నాణ్యతను పెంచామన్నారు. మరిన్ని మార్పులు చేసే క్రమంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు.టిటిడి బోర్డులో చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎవరైనా రాజకీయాలు చేస్తే శ్రీవారి లెక్కల నుంచి తప్పించుకో లేరన్నారు.
ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత,దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌరసరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, టిటిడి ఈవో జె. శ్యామల రావు,సీఎం కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్నా,జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,టిటిడి బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

👉 విజయవాడ పోలీస్ కమిషనర్ S.V రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈ సంక్రాంతికి కోడిపందాలు పేకాట గుండాట మరియు ఎటువంటి జూధాలు జరగకుండా నివారించుటకు గాను, నందిగామ డివిజన్ పరిధిలో నందిగామ ACP ,A.B.G తిలక్ ఒక .QRT team ను ఏర్పాటు చేసినారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా పేకాటలు, కోడిపందాలు జరిగినట్లయితే విస్తృతంగా దాడులు చేసి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించినారు. ప్రజలు సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ క్రీడలలో మాత్రమే పాల్గొని ఆనందించగలరని, జుదాలలో పాల్గొని నష్టపోవద్దని డివిజన్ పరిదిలోని ప్రజలకు ఈ సందర్భముగా తెలియజేసినారు.
👉 పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్‌ ..
పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్‌
పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో పుణె కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వి.డి సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్‌పై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
👉 గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ : మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కేసుల విచారణలో సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసుల్లో గత ఏడాది సెప్టెంబర్ 30న 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించినప్పటికీ, సీబీఐ విచారణ పూర్తికాలేదు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. విచారణను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది.

*ఏపీ కీ మరో 50 మంది ఎమ్మెల్యే లు…… కేంద్రం గ్రీన్ సిగ్నిల్!!*
ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది.
వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి. అయితే జన గణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండడంతో.. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమౌతోంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 5 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225 కు పెరగనున్నాయి. అదే జరిగితే రాజకీయ ఆశావహులకు కొంతవరకు అవకాశాలు మెరుగుపడినట్టే.
*విభజన చట్టంలో
2014లో రాష్ట్ర విభజన( state divide) జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. ఇక తెలంగాణకు సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంటు స్థానాలు మిగిలాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగడంతో.. పాలనా వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
*పార్లమెంట్ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్లు
ఏపీలో( Andhra Pradesh) 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన 175 స్థానాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో.. ప్రతి లోక్సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. కొద్ది రోజుల్లో జన గణనతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుంది. 2025లో జనగణను పూర్తిచేసి.. వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది.
* ఆశావహుల్లో ఆశలు
ప్రస్తుతం ఏపీలో( Andhra Pradesh) టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. టిడిపి కూటమిలో బిజెపి, జనసేన ఉంది. ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం వైసిపి. అదే సమయంలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని పార్టీల్లో నాయకులు ఆశావహులుగా ఉన్నారు. ప్రధానంగా టిడిపి కూటమి, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఒకవేళ పునర్విభజనతో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహులకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే ఏపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో సంతోషపడుతున్నారు.
👉సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ,ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని, అలాగే, వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12 వేల చొప్పున చెల్లించాలని, ఈ రెండు పథకాలు జనవరి 26 న రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయా పథకాల అమలులోని ప్రాధామ్యాలు, తీసుకోవలసిన చర్యలను ముఖ్యమంత్రి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు.
ఈ నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
“వ్యవసాయయోగ్యం కాని రియల్ ఎస్టేట్ భూములు, లే అవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలి.
ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్‌లను పరిశీలించడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధ్రువీకరించుకోవాలి.
వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
రైతు పంట వేసినా, వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో పెట్టుబడి సాయం అందించారు. అనర్హులకు ప్రయోజనం అందించకూడదు. అనర్హులను గుర్తించాల్సిన అవసరం ఉంది.
భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించాం. ఆ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందించాలి. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
రాష్ట్రంలో ‘వన్ స్టేట్ – వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నాం. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో బహిర్గతం చేయాలి. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలి.
గూడులేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించాం. అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశాం.
ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల జాబితాను ఇంచార్జీ మంత్రికి అందించాలి. ఇంచార్జీ మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలి.
సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తుంది. ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు కలెక్టర్లకు అభినందనలు.
కలెక్టర్ల పనితీరే ప్రభుత్వం పనితీరుకు కొలమానం. ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్లే ప్రజల్లోకి తీసుకెళాల్సి ఉంటుంది. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేయాలి.
ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలో ఆదేశాలిచ్చాం. కొంతమంది ఇంకా ఆఫీసులకే పరిమితమవుతున్నారు. జనవరి 26 తర్వాత స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవు” అని అన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు , తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ,పొన్నం ప్రభాకర్ , ధనసరి సీతక్క,ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదార్లు కే.కేశవరావు ,షబ్బీర్ అలీ , హర్కర వేణుగోపాల్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
👉 ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిసి మొత్తం ఆరుగురు ఉంటారు. 2500-3500 మందికి ఏడుగురు, 3501 నుంచి ఆపై జనాభాకు 8 మంది ఉండేలా సచివాలయ ఉద్యోగులను విభజిస్తారు. దీని ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది.

7k network
Recent Posts

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.

*పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి.. హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* .. *విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్* …రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ * ..*యూరప్ లో మోసపోయిన తెలుగు వారు …ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది_డా. జయప్రకాష్ నారాయణ .. లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ .. ఖమ్మం తిరుపతి జిల్లాలలో భారీగా గంజాయి పట్టివేత

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*