*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు*
ఏపీ సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
▪️2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..▪️కోటి రూపాయలతో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమిపూజ చేశారు..▪️నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
▪️మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరకులు అందనున్నాయి..▪️నారావారిపల్లెలో మహిళలకు చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.
▪️అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.
▪️8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.
*పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం*
ఏలూరు జిల్లా .. పోలీసు ఉద్యోగులకి ఒక సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న జనవరి-2024 కు సంబంధించిన అడిషనల్ సరెండర్ లీవ్ శాలరీ బకాయిలు, జూన్ 2024 వరకు సప్లమెంటరీ సరెండర్ లీవ్ శాలరీ బిల్స్, జి.పి.ఎఫ్ , సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను వెంటనే మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* ఆం.ప్ర.పోలీసు అధికారుల సంఘం, ఏలూరు జిల్లా, ఏలూరు సిబ్బంది మరియు వారి కుటుంబాల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఆర్. నాగేశ్వరరావు,
ప్రెసిడెంట్, ఆం. ప్ర. పోలీసు అధికారుల సంఘము, ఏలూరు జిల్లా. ఏలూరు.
👉సజ్జలపై పవన్ దండయాత్ర అటవీ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం కన్నెర్ర సంక్రాంతి తర్వాత ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్న పవన్ సీకే దిన్నె మండలంలోని సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణల్లో ఉన్న భూములను పరిశీలిస్తారని అంటున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ నెంబర్ టు సజ్జల రామక్రిష్ణారెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దండయాత్ర ప్రకటించనున్నారు. సంక్రాంతి తర్వాత ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్న పవన్ సీకే దిన్నె మండలంలోని సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణల్లో ఉన్న భూములను పరిశీలిస్తారని అంటున్నారు. ఇప్పటికే తన పర్యటనపై అధికారులకు మౌఖికంగా సమాచారం ఇచ్చారంటున్నారు. పండగ తర్వాత డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు కానుందని చెబుతున్నారు. వైసీపీ నేతల అక్రమాలు, ఆక్రమణలపై తొలి నుంచి మడమతిప్పని పోరాటం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన స్పీడ్ మరింత పెంచనున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతీ సిమెంట్ భూముల్లో ఆక్రమణలపై నోటీసులు జారీ చేయించిన పవన్ ఇప్పుడు వైసీపీ నెంబర్ టు లీడర్ సజ్జలను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. కడప జిల్లాలోని సీకే దిన్నె మండలంలో 42 ఎకరాల అటవీ భూములను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పవన్ నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
*సీకే దిన్నె మండలంలో సర్వే నెంబర్ 1629లో 11 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వీటి పక్కనే సజ్జల కుటుంబ సభ్యులకు 184 ఎకరాల ఎస్టేట్ ఉంది. ఈ ఎస్టేట్ చుట్టూ కంచె వేసిన సజ్జల ఫ్యామిలీ 42 ఎకరాలను ఆక్రమించుకున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సర్వే చేసి నివేదిక సమర్పించాల్సిందిగా రెవెన్యూ, అటవీ అధికారులను కలెక్టర్ సూచింస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. *సజ్జల ఎస్టేట్లో సంయుక్తంగా సర్వే చేసిన అధికారులు ఆ భూములు రెవెన్యూ శాఖవని అటవీ అధికారులు, కాదు అటవీ భూములే అని రెవెన్యూ అధికారులు వాదులాడుకుంటున్నారు. ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించినా అవి ఏ శాఖవని తేల్చకుండా కాలం గడిపేస్తున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం తానే నేరుగా రంగంలోకి దిగనున్నారు.
సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్న పవన్ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలని ముందుగా భావించారు. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన కీలక నేత ఆక్రమణలపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం, సజ్జలను కాపాడే ప్రయత్నం జరుగుతుండటంతో ఉప ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలును మార్చే అవకాశం ఉందంటున్నారు. కడప నుంచే క్షేత్రస్థాయి పర్యటలకు శ్రీకారం చుట్టి ముందుగా సజ్జలపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
*ఇప్పటికే పట్టిన పట్టువీడని నేతగా పవన్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అక్రమాలు వెలుగుచూసిన వెంటనే వాటిపై ఫోకస్ చేసి యాక్షన్ తీసుకునేలా చూస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగును అడ్డుకోడానికి పవన్ చాలా పోరాడారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వికృత ప్రచారంపై ఉక్కుపాదం మోపారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన ఏ సమస్యను టేకప్ చేసినా పరిష్కారమయ్యేంత వరకు పట్టువీడటం లేదు. దీంతో సజ్జల ఆక్రమణలపై పవన్ తీసుకోబోయే యాక్షన్ ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతతో నేరుగా తలపడేందుకు పవన్ బరిలోకి దిగుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
👉మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ భారీ స్కాం ను ఆధారాలతో సహా బయట పెట్టినందుకు ప్రముఖ రిపోర్టర్ ముఖేష్ చంద్రకరణ్ ను కొందరు దుండగులు హతమార్చడంతో… ఆయనకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టింది.
టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ట్విట్టర్ వేదికగా తన న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టింది. న్యాయ పోరాటమా? అసలు ఏమైంది? అని షాక్ అవుతున్నారా..
చత్తీస్గడ్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న ముఖేష్ చంద్రకర్ ఓ భారీ స్కాం ను ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో అతన్ని కొందరు దుండగులు చంపేశారు. లావణ్య త్రిపాఠి అతనికి న్యాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాను పెట్టిన పోస్టు హ్యాస్ ట్యాగ్ లో ముఖేష్ చంద్రకరణ్ పేరు పెట్టింది. ఈ ఘటనపై లావణ్య్ స్పందించటమే కాకుండా.. బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలకు స్పందించడం చాలా అరుదు. ఇప్పటివరకు ఏ సెలబ్రెటీ ఇలాంటి విషయాలపై స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని తెలపలేదు. కానీ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలబడింది.
*సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన కాంతులను,సంతోషాలను నింపాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్*
మన జీవన శైలితో ముడిపడిన సంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి పండుగను తెల్లవారుజామున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా సంప్రదాయ బద్ధంగా భోగిమంటలను వేసినారు.
తెలుగింట సంతోషంగా జరుపుకునే సంక్రాంతి మానవ సంబంధాలను పెంపొందిస్తుందని, పాత ఆలోచనలు, దుఃఖాన్ని వదిలివేసి సరికొత్త ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా సంక్రాంతి పండుగను జరుపుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ముఖ్యంగా రైతు కష్టానికి ప్రతిఫలంగా ధాన్యపు బస్తాలు వారి ఇంటికి చేరే ఈ పండుగతో వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలకు కూడా అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. ప్రకృతితో మమేకమయ్యే ఈ సంప్రదాయ పండుగను ప్రతి ఒక్కరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటేలా, తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా సుందరమైన, కళాత్మకమైన రంగవల్లులు తమ క్యాంప్ ఆఫీసు ముందు తీర్చిదిద్దినారు.
జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ముందుగా సంక్రాతి శుభాకాంక్షలు తెలియచేసినారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన కాంతులను, సంతోషాలను నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
*సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు,పేకాట వంటి జూదాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా మరియు సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ హెచ్చరించారు. సాంప్రదాయం క్రీడలు నిర్వహించుకోవాలని సూచించారు.
⭐ ప్రకాశం జిల్లా…గిద్దలూరు పట్టణం చిన్న మసీద్ కాంప్లెక్స్ నందు గిద్దలూరు మైనారిటీ ప్రముఖుల చేతుల మీదుగా *మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* జరిగింది. ముఖ్యఅతిథిగా టిడిపి పట్టణ అధ్యక్షుడు సయ్యద్ వలి జమాయత్ పెద్దలు ఖదీర్ భాష, అక్బర్ అలీ పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు. పి వై.ఖాన్. ఇబ్రహీం ఖలీల్,మదర్ బాషా,ము జాహీద్, దావూద్, ఫిరోజ్ ఖాన్, సయ్యద్ పలువురు సభ్యులు పాల్గొన్నారు.
*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి*
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామంలో టి పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటుచేసిన టి పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్లో గ్రామ యువతతో కలిసి క్రికెట్ గవర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు
అలాగే పండుగల సందర్భంగా గ్రామస్తులు అందరూ కలిసి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ టోర్నమెంట్స్ ఆటల పోటీలు నిర్వహించుకొనుటవలన మంచి బాంధవ్యాలు ఏర్పడతాయని ఇటువంటి కార్యక్రమాలు చుస్తూ ఉంటే తన చిన్ననాటి జ్ఞాపకాల గుర్తుకు. వస్తున్నాయని గ్రామస్తులను ఎస్ ఐ రవీంద్ర రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆవుల విశ్వనాథ్ రెడ్డి ఆవుల శ్రీనివాసరెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
*తిరుమలలో మరో అపశృతి
తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం
నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు
47 వ నెంబరు కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది
కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన యుపిఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు…
: తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం
తిరుమలలో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘట్ రోడ్డు వద్ద బస్సు అదుపుత్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురి భక్తులకు గాయాలయ్యాయి. క్రాష్ బారియర్ గట్టిగా ఉండటంతో బస్సు రోడ్డుపై నిలిచింది. లేదంటే లోయలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు తెలిపారు. ఈ ప్రమాదంతో కొంత మేరా ట్రాఫిక్ అయింది. పూర్తి వివవరాలు తెలియాల్సి ఉంది.
⭐⭐ రేపటి నుండి పీపుల్స్ వాయిస్ పేరుతో రాబోతున్న ఆంధ్ర మిర్రర్⭐⭐
పాఠకులు దయచేసి ఆదరించవలసిందిగా ప్రార్థన 🙏🙏🙏