ఈవీఎంలపై ‘ఇండియా’ పోరుబాట..R R R ను లాకప్ లో చంపడానికి కుట్ర, రిమాండ్ రిపోర్టులో బయటికి వస్తున్న నిజాలు..కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కన్న కొడుకులుమెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య(అనంతపురం)

👉ఈవీఎంలపై ‘ఇండియా’ పోరుబాట ✊.. మరో జోడోయాత్రలా ఉద్యమం ఇటీవలే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆ కూటమి ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఇటీవలే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆ కూటమి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ.. అనూహ్యంగా మహారాష్ట్రలో ఊహించని ఫలితాలు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. 288 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 235 సీట్లతో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. *ప్రతిపక్షంలోని అఘాడీ కూటమికి అతి కష్టమ్మీద 49 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇప్పుడు మహావికాస్ అఘాడీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగేందుకు సిద్ధమైంది. ఈ ఫలితాలు నమ్మశక్యంగా లేవని ఆరోపిస్తోంది.

*ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అందువల్లే తాము ఓడిపోయామని, లేదంటే తప్పకుండా తమ కూటమి అధికారంలోకి వచ్చేదే అని అంటున్నారు. మహావికాస్ అఘాడీ కూటమిలో భాగమైన కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటమి చెందిన స్థానాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు.ఇందుకు దేశ, రాష్ట్రస్థాయిలో లీగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాయి. అటు మహారాష్ట్ర ఎన్నికల ఫతిలాలపైనా కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు సిద్ధం అయ్యారు.* దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఎలా అయితే భారత్ జోడో యాత్ర జరిగిందో.. అదే తరహాలో దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు.. హర్యానా ఎన్నికల ఫలితాల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్ షేర్ లభించింది. దాంతో అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని నివేదికలు వెల్లడించారు. కానీ.. అక్కడ కాంగ్రెస్ బోల్తాపడింది. అక్కడ కూడా ఈవీఎం మిషిన్లను ముందుగానే హ్యాక్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్ని కూడా నిరాధార ఆరోపణలే అని కేంద్ర ఎన్నికల కమిషన్ కొట్టేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపి 86 స్థానాలలో పోటీ చేస్తే కేవలం పది సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. దాంతో ఈ ఫలితాల పట్ల శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థులను వీవీ ప్యాట్ స్లిప్స్ ధ్రువీకరణ చేయాలని సూచించారు. 101 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 16 సీట్లలోనే గెలుపొందింది. ఉద్ధవ్ శివసేన 95 సీట్లకు గాను 20 స్థానాల్లో గెలిచింది. ఈ క్రమంలో తమ పరాభావానికి ఈవీఎంలే కారణమని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందుకోసం కోర్టులో పోరాడేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, ఎస్ఎస్, యూబీటీ లీగల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కూటమి.. జార్ఖండ్‌లో విజయంపై మాత్రం ఎలాంటి సందేహాలు లేవని చెప్తుండడం గమనార్హం.
👉మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య!!!*అనంతపురం*
*అనంతపురం మెడికల్ కాలేజి హాస్టల్ లో మెడికల్ స్టూడెంట్ వీర రోహిత్ ఆత్మహత్య*
*హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య కి పాల్పడిన రోహిత్*
*MBBS నాల్గవ సంవత్సరం చదువుతున్న రోహిత్ స్వగ్రామం ఉరవకొండ*
👉తిరుపతిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు…
👉వన భోజన కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు.*
*గిద్దలూరు పట్టణంలోని ఎస్టీ బాలికల వసతి గృహ ప్రాంగణంలో కార్తీకమాసం సందర్బంగా ఉపాధ్యాయ సిబ్బంది వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి మరియు గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గోని వన భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధులను ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు శాలువా వేసి ఘనంగా సన్మానించారు.*
👉 కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కన్న కొడుకులు ..8 రోజులుగా స్మశాన వాటికలోనే తల్లి రాజవ్వ ను వదిలేసిన కొడుకులు..# జగిత్యాల #*
*కొడుకు రాజవ్వ ను పెన్షన్ డబ్బుల కోసం దారుణం గా కొట్టటం తో ఆమెకు కాలు విరిగి కదలలేని స్థితి లో వుంది*
*రాజవ్వ కు నలుగురు కొడుకులున్నా స్మశానం లో వదిలి వేయటం తో ఆమె పరిస్థితి చూసి స్థానికులు కన్నీళ్లు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు రాజవ్వ ను హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
👉R R R ను లాకప్ లో చంపడానికి కుట్ర, రిమాండ్ రిపోర్టులో బయటికి వస్తున్న నిజాలు**
గుంటూరు: వైసీపీ ప్రభుత్వంలో తనను పోలీస్ కస్టడీ లో హత్య చేయాలని చూశారని అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గతంలో ఆరోపించారు.
ఆయన మాటలు నిజమేనని తాజాగా తేలింది. రఘురామకు కస్టడీలో వేధింపుల కేసులో అరెస్టైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రఘురామను పోలీస్ కస్టడీలో విపరీతంగా కొట్టారని, ఆయనను లాకప్లో చంపడానికి కుట్ర జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
*విజయ్ పాల్కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు*
వైసీపీ ప్రభుత్వ సమయంలో ఎంపీగా ఉన్న రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించిన కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరైన ఆయనను దాదాపు 9 గంటలపాటు విచారించిన అనంతరం పోలీసులు విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. బుధవారం నాడు పోలీసులు గుంటూరు కోర్టులో విజయ్ పాల్ను హాజరుపరచారు. 18 పేజీల రిమాండ్ రిపోర్టులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన కోర్టు నిందితుడు విజయ్ పాల్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు.
విజయ్ పాల్ను ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని, ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రఘురామను లాకప్ తో చిత్రహింసలు పెట్టిన కేసులో అసలు సూత్రధారులు ఎవరు, ఎందుకు ఇవి చేశారనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. అసలు నిజాలు రాబట్టేందుకు విజయ్ పాల్ను తమ కస్టడీకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
*సీఐడీ ఆఫీసు నుంచి నడవలేని స్థితిలో రఘురామ వచ్చారు*
రఘురామను గతంలో పోలీస్ కస్టడీలో తీవ్రంగా వేధించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. సీఐడీ ఆఫీసుకు వెళ్లిన అప్పటి ఎంపీ రఘురామ కృష్ణరాజు నడవలేని స్థితిలో వచ్చారని.. ఆయన కాళ్లను తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారని తెలిపారు. కస్టడీలో రఘురామను చంపడానికి సైతం ప్రయత్నించారని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనపై జరిగిన దాడి, వేధింపులు, హత్యకు కుట్ర జరిగిన విషయాన్ని రఘురామ కృష్ణరాజు సైతం కోర్టులో చెప్పారు. రఘురామ కస్టడీలో వేధింపులు ఎదుర్కొన్న కేసులో నివేదిక ఇచ్చిన జీజీహెచ్ డాక్టర్లు సైతం నిందితులు అవుతారని పేర్కొన్నారు. గతంలో విచారణ చేపట్టిన అందర్నీ.. ఇప్పటి వరకు ఈ కేసులో 27 మందిని విచారించినట్లు తెలిపారు. తనను కస్టడీలో వేధించారని, తనను తీవ్రంగా కొట్టారని కాళ్లకు తాకిన దెబ్బల్ని సైతం రఘురామ ఆ సమయంలో వీడియో తీసి పోస్ట్ చేశారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. కేసు దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని, ప్రస్తుతానికి ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ అధికారికి విజయ్ పాల్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని చెప్పారు.
**కస్టడీలో లేపాయాలని చూశారని రఘురామ ఆరోపణలు**
గతంలో జైలు నుంచి వచ్చాక రఘురామ చెప్పిందే నిజమైంది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సైతం రఘురామ మాట్లాడుతూ.. కస్టడీలో ఉన్న సమయంలో తనను మూడుసార్లు లేపేయాలని ప్రయత్నం చేశారని సంచలన ఆరోపనలు చేయడం తెలిసిందే. జగన్ ఆదేశాలలో సీఐడీ తనను హత్య చేయాలని కుట్ర చేసిందని, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డానని రఘురామ వీడియోలో మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట సంచలనానికి తెరతీశారు.

7k network
Recent Posts

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.