👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను బహిరంగంగా బెదిరించిన జగన్..
వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన జగన్..
తిరిగి వెళ్తుండగా డీఎస్పీపై వైసీపీ నేతల ఫిర్యాదు
తన వద్దకు పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చిన జగన్
‘రెండు లేదంటే నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోవచ్చు. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను బెదిరించారు. జగన్ బంధువు వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియల అనంతరం తిరిగి వెళ్తూ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్ అక్కడ ఈ హెచ్చరిక చేశారు.
విచారణలో డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలు జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీని జగన్ తన వద్దకు పిలిచారు. ఆయన ఇద్దరు సీఐలతో కలిసి జగన్ వద్దకు వెళ్లారు. మురళీ నాయక్‌ను చూడగానే జగన్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వం రెండు లేదంటే నాలుగు నెలల్లో మారిపోవచ్చని, అప్పుడు మీ పని ఉంటుందని హెచ్చరించారు.డీఎస్పీ మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డిని విచారిస్తున్నది డీఎస్పీ మురళీ నాయకే. ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ హెచ్చరించినట్టు తెలిసింది. అందరి ముందు జగన్ ఆయనను బెదిరించడం చర్చనీయాంశమైంది.

👉దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు 😱😱😱
జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న మాజీ మంత్రి రోజాపై కూటమి నేతలు మండిపడుతున్నారు. శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని రోజా బెంజి కారు కొనుగోలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ఘటనపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం జగన్ తిరుపతి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఇక ఆ పార్టీ తరఫున అధికార ప్రతినిధి ఆర్కే రోజా నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రేంజులో ఫైర్ అయ్యారు. ఆదివారం తాడిపత్రిలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేశారు.*రోజా మంత్రిగా ఉండగా తిరుమల దర్శనాలకు వందల మందిని వెంట తీసుకుని వెళ్లి వారి నుంచి వేలాది రూపాయలు దండుకునేవారని ఆరోపించారు. అంతేకాకుండా శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని ఆ డబ్బుతో బెంజి కారు కొనుగోలు చేసిందని విమర్శలు గుప్పించారు.
*అనంతపురంలో రోజాపై చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాట్లాడే ముందు రోజా వాస్తవాలు గమనించాలని కోరారు. మాజీ మంత్రి రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలపై వైసీపీ విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టిన జేసీ.. వైసీపీ అధికారంలో ఉండగా, జరిగిన ప్రమాదాలపై ఓ ప్లెక్సీ ప్రింట్ చేసి ప్రదర్శించారు.ఆ ప్లెక్సీలో వైసీపీ హయాంలో జరిగిన ప్రమాదాలు చోటుచేసుకున్న నష్టం వివరించారు.

👉 ప్రముఖ సినీ రచయిత ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రచురించిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత కొరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. ఈ పవిత్రమైన కార్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని ఆయన ఫరూక్ షిబ్లీని కోరారు.
అలాగే ఇంతమంది స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలతో కాలమానాన్ని తీసుకురావటం అభినందనీయం అని అన్నారు. మాతృ భూమి కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వారు ఇంత మంది ఉన్న ముస్లిం సమాజంలో వారి త్యాగాలు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.
కాబట్టి 10మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ తయారు చేసి వారి రుణాన్ని తీర్చుకుందామని అన్నారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ ముస్లిం స్వాతంత్ర సమరయోధుల వెబ్ సిరీస్ తయారు చేస్తే యావత్తు ముస్లిం సమాజం మీకు రుణపడి ఉంటుంది అని, మీకు ధన్యవాదాలు తెలియచేయటానికి మాటలు సరిపోవు అని ఆయన అన్నారు.
* హైదరాబాద్‌: మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు
నేను ఏది మాట్లాడినా సంచలనం అవుతుంది
ఫార్ములా-ఈ రేస్‌తో HYD ఇమేజ్‌ పెరిగింది
కానీ అవినీతి అవ్వలేదని చెప్పలేదు-దానం
నేనేమీ కేటీఆర్‌కు క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు
ఈ కార్‌ రేస్‌పై కేటీఆర్‌ నా సలహా తీసుకున్నారు
నా అభిప్రాయం మాత్రమే అప్పుడు చెప్పా
నేను ఫైటర్‌ను ఉప ఎన్నిక వచ్చినా భయపడను-దానం
హైడ్రాపై కూడా నా వ్యా్ఖ్యల్లో మార్పు లేదు
హైడ్రాపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి-దానం
మూసీపై బీజేపీ నేతలు ఒక్క రోజు నిద్ర చేశారు
మూసీ నిద్రకు ముందే ఏసీలు పెట్టించుకుని వెళ్లారు
నిర్వాసితుల ఇళ్లలో కాకుండా..
బయట నుంచి తెచ్చిన టిఫిన్‌ కిషన్‌రెడ్డి తిన్నారు
కంటితుడుపుగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేశారు-దానం

*నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*
నెల్లూరు రామలింగాపురం రైల్వే ట్రాక్ సమీపంలో స్థావరం…ఏక కాలంలో నెల్లూరు తో పాటు కోవూరు, పార్సెల్ సర్వీస్ పై విజిలెన్స్ దాడులు….
నెల్లూరులో సుమారు రెండు కోట్లు రూపాయలు కోవూరులో సుమారు 38 లక్షల రూపాయలతో నకిలీ సిగరెట్ల పట్టివేత….గత కొంతకాలంగా కోట్ల రూపాయల డూప్లికేట్ సిగరెట్లు వ్యాపారం…నిర్వాహకులపై చర్యలకు సిద్ధమవుతున్న విజిలెన్స్ అధికారులు..

*డాక్టర్ సంజయ్ హోదాతో మాట్లాడాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్..కరీంనగర్ జిల్లా ..
కెసిఆర్ బిక్షతో ఎమ్మెల్యే అయ్యుండు.
కాంగ్రెస్ కు అమ్ముడు పోయిండు.అమ్ముడుపోయిన 10 మంది ఎమ్మెల్యేలను ఎక్కడపడితే అక్కడ అడ్డుకుంటా.. నిలదీస్తాం..దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలువాలి..మగాడయితే రాజీనామా చేసి గెలిచి రావాలి.

👉కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీసిన హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి.
ఇద్దరు మధ్య వాగ్వాదం తోపులాట.
సమీక్షా సమావేశం రసాభాస.
ముగ్గురు మంత్రుల సాక్షిగా ఇద్దరు ఎమ్మెల్యేల గొడవ.
పాడి కౌశిక్ రెడ్డిని బయటికి లాకెళ్లిన పోలీసులు.

👉అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన ..రావినూతల క్రికెట్ స్టేడియం భవనాలను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి ..రూ.98 లక్షల తో రావినూతల స్టేడియాన్ని అభివృద్ది చేసిన మంత్రి గొట్టిపాటి
పట్టణ ప్రాంత స్టేడియాలకు ధీటుగా రావినూతల క్రికెట్ స్టేడియం అభివృద్ధి..గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామనీ,స్పోర్ట్స్ పాలసీని తీసుకుని వచ్చిన ఘనత కేవలం సీఎం చంద్రబాబుకు మాత్రమే దక్కిందన్నారు.

*తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి).ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు.
-చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, మధ్యహ్నం తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలన భవనం నందు ఇన్చార్జి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమల రావు, చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలును ఇన్‌ఛార్జ్ టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించారు.

*ఆన్‌లైన్‌ బెట్టింగ్.. మరో యువకుడు బలి*
*వరంగల్ – వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌లలో సుమారు 30లక్షలు కోల్పోయి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రాజ్ కుమార్ అనే యువకుడు.. *ఆన్లైన్ బెట్టింగ్ ఇలాంటి ఆట అత్యంత ప్రమాదకరం నీకే కాదు మీ కుటుంబానికి కూడా దయచేసి ఆపండి..*ఇలాంటి ఆటలు ఎవరైనా ఆడుతుంటే ఆపండి దయచేసి ఈ ప్రాణాంతకమైన ఆటలు మీ ప్రాణాలను బలి తీసుకోవద్దు.*మీ కుటుంబాలను అనాధలుగా మిగిల్చవద్దు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ బాగా డబ్బులు వస్తాయని అత్యాశ చూపిస్తారు దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు**
*గాలిపటం ఎగరేస్తున్న సమయంలో విద్యుత్ తీగ చేతికి తలగడం వల్ల అక్కడికక్కడే మృతి* హైదరాబాద్ లో సంక్రాంతి సెలవులలో తమ తమ పిల్లలను జాగ్రత గా చూసుకోండి. గాలి పటం ఎగర వేసేటప్పుడు దాబాల పైన గాని మరి ఎత్తు ప్రదేశంలో పిల్లలు ఎక్కుతున్నారు దానివల్ల విద్యుత్ తీగల కు తగిలి మరియు ఎత్తు ప్రదేశం నుంచి జారిపడి అనేకమంది పిల్లల ప్రాణాలు బలి కావడం జరుగుతుంది. ఈ దృశ్యంలో ఈరోజు హైదరాబాదులో గాలిపటం ఎగరేస్తున్న సమయంలో విద్యుత్ తీగ చేతికి తలగడం వల్ల అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తమ తమ పిల్లలు చాలా విలువైన ఆస్తిగా భావించాలి వారిపట్ల నిర్లక్ష్యం చేయరాదు.

7k network
Recent Posts

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.