దేశంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది:- మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్

 

ఆంధ్ర మిర్రర్ , మహారాష్ట్ర – మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఒక జాతీయ సదస్సును *ఎ స్టెప్ టువార్డ్స్ ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్* అనే అంశంపై నిర్వహించింది. దేశంలో సమ్మిళిత అభివృద్ధి ప్రాముఖ్యత గురించి మరియు సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ప్రక్రియలో అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు నిర్వహించ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.తహ్రీక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మెహమూద్ ఖాన్ మాట్లాడుతూ.. దేశంలోని కొందరు తన డబ్బులతో కొనుక్కున్న బూట్లు ధరించడాని అవకాశం లేదని, నేటికీ ప్రజలు సమానత్వం కోసం తహతహలాడుతున్నారని, దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు విస్తృతంగా ఉన్నాయిఅని, దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలని ఆయన అన్నారు. మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ సదస్సు ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

ఎంపీజే విజన్ గురించి మహ్మద్ అనీస్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి వ్యక్తి గౌరవానికి రాజ్యాంగం హామీ ఇస్తుందని, ఇది చాలా ముఖ్యం అని,బాబా సాహెబ్ కలలుగన్న సామాజిక న్యాయం ఒక కలగానే మిగిలిపోయింది అని సామాజిక ప్రజాస్వామ్యం కోసం ప్రజలందరూ పోరాడవలసి ఉందని అన్నారు.అభివృద్ధి గురించి మాట్లాడి ప్రజలను మేల్కొలపాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంపీజే మహారాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ నేడు దేశంలో పురోగతి ఉందని, అయితే ఈ ప్రగతి ఫలాలు అందరికీ అందలేదన్నారు.నేడు, దేశం ఆకలి, వ్యాధులు, పోషకాహార లోపం మరియు నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది అని, శాంతి,న్యాయాన్ని నెలకొల్పడమే ఎంపీజే లక్ష్యమని, దేశంలో పేదలు మరింత పేదలుగా మారడం, ధనికులు మరింత ధనవంతులుగా మారడం చూస్తున్నాం. ఇదొక పెద్ద సమస్య మారిపోయిందన్నారు దీనికోసం ఎంపీజే ప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారు.

జమాతే ఇస్లామీ హింద్ మహారాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఇలియాస్ ఫలాహి మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా నాయకులు బాధ్యత వహించాలన్నారు.నేడు దేశంలో అభివృద్ధి ఉంది కానీ ప్రతి ఒక్కరికీ ఈ అభివృద్ధి ఫలాలు అందడం లేదనీ,భారతదేశం సంక్షేమ రాజ్యం, ఇది ప్రజా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ఉండాలి, కానీ నేడు దేశం కార్పొరేట్ సంక్షేమ రాజ్యంగా మారిందనీ, దీనికి నాయకులు బాధ్యత వహించాలనీ, దీనికి దేశ ప్రజలు గురుతర బాధ్యతను నిర్వర్తించవలసి ఉంటుందన్నారు.

జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు సలీమ్ ఇంజనీర్ మాట్లాడుతూ.. ఈరోజు విద్వేషాన్ని మరింత పెంచే వాడు పెద్ద జాతీయవాది అని, నేడు దుష్ట శక్తులు అధికారంలో ఉండి దేశీయ మీడియా అండదండలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.మతం మనిషిని, మనిషిని కలుపుతుంది, కానీ నేడు మతం పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసే పని జరుగుతోంది. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ ఆదర్శాలను అనుసరించి దేశాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..