ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం అక్రమం..ఎస్బి ఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది.. పీసీసీ చీఫ్ షర్మిల.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందంటూ ప్రజలను మోసం చేశారు.. గిద్దలూరు టిడిపి ఇన్చార్జి ముత్తుముల.. ముత్తుముల సమక్షంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు!!!

👉విజయవాడ లోని గాంధీనగర్ ఎస్ బి ఐ బ్యాంక్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరసన..

సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుంది.. బాండ్స్ ను బయట పెట్టాలని కోర్టు చెప్పింది..
ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం ప్రవేశ పెట్టింది బీజేపీ..
ఇది సక్రమం కాదు…అక్రమం..ఎవరు ఎంత ఇచ్చారో తెలియని పరిస్థితి..బీజేపీ ఎక్కువ లబ్ధి కోసమే ఈ బాండ్స్..ఇది బీజేపీ క్విడ్ ప్రోకో
అక్రమ డబ్బు కోసమే ఈ పథకం.. ఇవ్వాళ ఎస్బి ఐ ను బలి చేస్తున్నారు.ఎస్బి ఐ ఒక ప్రజల బ్యాంక్..కానీ ఎస్బి ఐ
మోడీ బ్యాంకు గా వ్యవహరిస్తుంది..ఎస్బి ఐ
ప్రజల సంస్థ కాదు..మోడీ సంస్థ.. మోడీ అధీనంలో తీసుకున్న సంస్థ అని పీసీసీ చీఫ్ షర్మిల
ఆరోపించారు.విజయవాడ లోని గాంధీనగర్ ఎస్ బి ఐ బ్యాంక్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
బాండ్స్ బయట పెట్టాలంటే 10 నిమిషాల పని అని ఎస్బి ఐ కి మోడీ మీద ఇంత భక్తి కరెక్ట్ కాదని,వెంటనే ఎస్బి ఐ అన్ని వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బాండ్స్ బయటకు వస్తె బీజేపీ ఇరుక్కుంటుందని బాబు,జగన్ బయట పడతారు అని భయం అని,కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి భయం లేదన్నారు.దొంగతనంగా దోచుకోవాల్సిన అవసరం లేదని,మోడీని కాపాడేందుకు ఎస్బి ఐ తాత్సారం చేస్తుందని,ఎస్బి ఐ చెప్తున్న సమాధానం హాస్యాస్పదంగా ఉందని,బీజేపీకి ధైర్యం ఉంటే బాండ్స్ బయట పెట్టమని అడగాలని ప్రజలకు నిజాలు తెలియాలని డిమాండ్ చేశారు.

👉అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టును, పూర్తయింది అంటూ జాతికి అంకితం అని ఆర్భాటాలు చేసి, జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు..10వేల మంది నిర్వాసితులను రోడ్డున పడేసి పైలాన్ ఆవిష్కరించారు..గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల.

దోర్నాల మండలంలోని
వెలుగొండ ప్రాజెక్టు వద్ద నిన్న జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాం అంటూ చేసిన ఆర్భాటం ప్రజలను మభ్యపెట్టడమేనంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ముత్తుముల అశోక్ రెడ్డి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజలు, రైతుల ఓట్లు దండుకోవడం కోసమే జగన్నాటకం ఆడుతున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు ఇవ్వకుండా ఎలా పూర్తయిందంటూ వ్యాఖ్యానించారని, నిన్న జరిగిన కార్యక్రమం కేవలం ఒక బూటకం అన్నారు.ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తి అయితే నీళ్లు ఇచ్చి జాతికి అంకితం చేస్తారని కానీ ఈ బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి పూర్తికాని ప్రాజెక్టు, పూర్తికాని కాలువలు ఉన్న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాననడం విడ్డూరం ఉందన్నారు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, వైసిపి మాయమాటలు నమ్మి పరిస్థితిలో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించి జగన్ నాటకానికి తెర దింపుతారని తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*
👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 100 మైనార్టీ కుటుంబాలు*


ప్రకాశం జిల్లా, కంభం మండలం, తురిమెళ్ళ గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో స్థానిక సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ, షేక్ రసూల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 100 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్ధం పూచ్చుకున్నారు. ఈ సందర్బంగా వారికీ అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులంతా టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో
జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబా,
స్థానిక టీడీపీ నాయకులు పాల్గోన్నారు.
*👉ఖాసీం పీరాను పరామర్శించిన ముత్తుముల* ఇటీవల ఆటో బోల్తా పడిన ఘటనలో కాలు ఫ్రాక్చర్ అయ్యి గిద్దలూరు పట్టణంలోని డి జి ఆర్ వైద్యాశాలలో గత చికిత్స పొందుతున్న బెస్తవారిపేట పట్టణానికి చెందిన షేక్ ఖాసీం పీరాను గిద్దలూరు టీడీపీ టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకొని, వారికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారితో పాటు బెస్తవారిపేటకు చెందిన షేక్ రషీద్, మొహమ్మద్ రహమత్ భేగ్ తదితరులు పాల్గోన్నారు..👉ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ అల్తాఫ్ .. ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని 12వ వార్డులో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్ షేక్ అల్తాఫ్ హుస్సేన్ ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులతో సహా వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స