👉 JIO కస్టమర్లకు షాక్😱😱😱
రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది. రూ.199 ప్లాన్‌పై ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299కే ఈ ప్లాన్ అమలులో ఉంటుందని జియో పేర్కొంది. పెంచిన ధరలు జనవరి 23 నుంచి అమలులోకి రానుందని తెలిపింది. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్‌గా రూ.299 ప్లాన్‌కు బదిలీ అవుతారు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, నెలకు 25 జీబీ డేటా వస్తుంది
👉 TVS బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్
దేశీయ టూ-వీలర్ తయారీ దిగ్గజం TVS మోటార్ కంపెనీ తన కొత్త త్రీ-వీలర్ ఈవీ ఆటోను విడుదల చేసింది. ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ ధర రూ.2.95 లక్షల (ఎక్స్ షోరూం)గా ఉండనుంది. ఈ వాహనం 51.2వీ లిథియం అయాన్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే తర్వాత 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఇది భారత మొట్టమొదటి బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అని కంపెనీ ప్రకటించింది.
👉 పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి ఉడాయించాడో దొంగబాబా. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో వెలుగుచూసిందీ మోసం. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1.75 లక్షల నగదు, మొబైల్ ఫోన్స్, ఒక కారు, పాత ఇత్తడి బిందెలు, బంగారం పూత వేసిన నాణేలు, స్ర్పేలు స్వాధీనం చేసుకున్నారు. ఆనందపురం పోలీసుస్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను సీఐ వాసునాయుడు వెల్లడించారు. ఆనందపురం మండలం బంటుపల్లివారి కల్లాలుకు చెందిన అప్పలరాజుకు రెండు నెలల క్రితం బంధువుల ద్వారా విశాఖ నగరం కంచరపాలెం బర్మాక్యాంపునకు చెందిన యోగేంద్రబాబా అలియాస్ పైడిపాటి వెంకటభార్గవ్ రాఘవ(35), అతడి బృందం పరిచయమయ్యారు. పూజలు చేస్తే లంకెబిందెలు లభ్యమవుతాయని వారు అప్పలరాజును నమ్మించారు. అందుకు రూ.లక్షలు ఖర్చు అవుతాయనడంతో అప్పలరాజు మరో ముగ్గురు స్నేహితులను కలుపుకున్నాడు. నలుగురూ కలిసి దఫదఫాలుగా యోగేంద్రబాబాకు రూ.28 లక్షలు ఇచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం యోగేంద్రబాబా ఆనందపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మండలంలోని గుడిలోవలో ఒకచోట రాళ్లతో నింపిన రెండు బిందెలను తన బృందంతో పాతిపెట్టించాడు. ఆ తరువాత అప్పలరాజు తదితరులను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించాడు. బిందెలు పాతిపెట్టించిన ప్రాంత ంలో వారితో తవ్వించి లంకె బిందెలు లభించాయని నమ్మించారు. వాటిని ఆనందపురంలో యోగేంద్రబాబా అద్దెకు తీసుకున్న ఇంటికి తరలించారు.లంకె బిందెలను మరోమారు పూజలు నిర్వహించిన తర్వాత తెరవాలని యోగేంద్రబాబా చెప్పాడు. అందుకు కొంత డబ్బు తీసుకురావాలని ఆ నలుగురికి సూచించాడు. పూజలు చేయకపోతే రక్తం కక్కుకుని చస్తారంటూ బెదిరించాడు. దీంతో మిగతా డబ్బులు ఇచ్చేందుకు అప్పలరాజు, అతని మిత్రులు సిద్ధపడ్డారు. అయితే ఫోన్ చేసినా యోగేంద్రబాబాతీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
👉జూరాల ప్రాజెక్ట్ నుంచి *వాటర్ లీక్..మహబూబ్‌నగర్: 12 క్రస్ట్ గేట్ల నుంచి లీక్ అవుతున్న నీరు. 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్. మరమ్మతులు లేక, తుప్పు పట్టి ఊడిన గేట్ల రబ్బర్లు. లీకేజీలతో వృధాగాపోతున్న నీరు, పట్టించుకోని అధికారులు. జూరాల ప్రాజెక్ట్ భద్రతపై అనుమానాలు.*
👉*ఉగ్రవాద కాల్పుల్లో జవాను వీరమరణం*..
*ఘన నివాళి అర్పించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ*..
చిత్తూరు జిల్లా, బంగారు పాళెం మండలం,రాగిమాని పెంట గ్రామానికి చెందిన వరదరాజు లు, సెల్వి దంపతుల పెద్ద కుమారుడు పంగల రాజేష్, సోమవారం కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందారు. వీర జవాన్ కు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఘన నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజేష్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పంగల రాజేష్ త్యాగం మరువలేదని, తెలుగు జాతి తరపున వీర జవానుకు జోహార్లు అర్పిస్తున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు తెలిపారు
👉నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవు.. RBI క్లారిటీ*
కొత్త ఏడాదిలో కొత్త రూల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం తప్పని, ఎలాంటి ఉత్తర్వులూ వెలువరించలేదని పేర్కొంది. చెక్కులపై రాతకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదని స్పష్టంచేసింది.
విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల నియామకంపై రాష్ట్ర గవర్నర్‌కే సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. తమిళనాట ఇప్పటివరకూ వైస్‌ఛాన్సలర్లను నియమించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్‌కమిటీ సిఫారసుల మేరకు, గవర్నర్ ఆమోదం పొందే పద్ధతి ఉండేదని పేర్కొన్నారు. యూజీసీ కొత్త నిబంధన ప్రకారం వీసీల నియామకం కోసం సెర్చ్‌కమిటీలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా గవర్నర్‌కే ఉంటుందని, రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఈ నిబంధనల్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఇదే విధమైన లేఖను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు కూడా పంపించారు.
*తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*
నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్ పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
*హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు..
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్ రాజు సహా ప్రముఖ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు జరిపింది ఐటీ శాఖ.
హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ పై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లతో పాటు దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డిలకు సంబంధించిన ఆస్తులపై ఐటి సోదాలు చేపట్టినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పలు నిర్మాతల ఇళ్లు, ఆఫీసులు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల దాదాపు 50 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
*వరుస ప్రమాదాలు….పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు*
అనకాపల్లి జిల్లా ..
పరవాడలోని మెట్రో కెం ఫార్మా కంపెనీలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
కార్మికులు షిఫ్ట్‌కు వెళ్తున్న క్రమంలో ఏటీపీ సాల్వెంట్స్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దాంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
కంపెనీలో వరుస ప్రమాదాలతో స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.
*గుంటూరులో 23 నుంచి నీటి సరఫరా బంద్..!*
ఈనెల 23 నుంచి 25 వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు…
3 వంతెనల వద్ద పైపు లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు…
పొత్తూరువారితోట, గుంటూరువారి తోట, రాజాగారితోట, రామిరెడ్డి తోట, ప్రకాశ్ నగర్, రైలుపేట, గణేశ్ రావుపేట, అహ్మద్ నగర్, లాలాపేట, శీలంవారివీధి, చౌత్రా సెంటర్, పట్నంబజార్, ఏటుకూరు రోడ్డుప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచి పోతుందని చెప్పారు.
👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? బొత్స ఫైర్ …
ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేశారని చెప్పాలి. సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా కూటమి సర్కారుపై నిప్పులుచెరిగారు. అంతేకాదు.. ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేశారని చెప్పాలి. ఇంతకూ ఆయన చేసిన వ్యాఖ్యను చూస్తే.. కాస్త గందరగోళానికి గురి చేసేలా ఉండటం గమనార్హం. ఇంతకూ బొత్స ఏమన్నారంటే.. ‘‘మూడేళ్ల క్రితం రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఏ2గా ఉన్న నిందితుడికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి రూ.5 లక్షలు ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు.. స్థానిక ఎమ్మెల్యే.. ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అక్కడితో ఆగని ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన జరిగినప్పుడు తమ ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్లుగా కూటమి సర్కారు బావిస్తే.. ఆ అంశాన్ని విచారణ జరపాలన్నారు. ఆ కేసును వెనక్కి తీసుకొని.. తప్పుడు కేసు పెట్టిన సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఒకవేళ అతను నిందితుడే కాదని చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడ్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు. నిందితుడికి డబ్బులు ఇవ్వటం మీ ఉద్దేశమా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
👉ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కానీ.. హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసుకునే బీజేపీలు ఏం చేస్తున్నాయి? వారెందుకు నోరు విప్పటం లేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఈ ఘటన జరిగినప్పుడు దేవుడి మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేశారు. ఇప్పుడు అదే కేసులో నిందితుడికి సాయం చేస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వంపై ఫోకస్ పెట్టాలన్న బొత్స.. హామీల్ని కచ్ఛితంగా నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
⭐ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. విజయవాడలో వరదలు.. తిరుమలలో తొక్కిసలాటలు.. ఇవన్నీ మానవ తప్పిదాలేనంటూ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ అర్భాటంగా ప్రచారం చేస్తున్నారని.. కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నట్లుగా అనుమానాల్ని వ్యక్తం చేశారు. మొత్తానికి సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్సకు సమాధానం ఇవ్వటం ద్వారా రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు అండ్ కో మీద పడిందని చెప్పకతప్పదు.
👉చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న?
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు దావోసులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గతంలో దావోస్ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారంటూ ప్రశ్నించిన వైసీపీ గతం గుర్తుందా? బాబూ అంటూ 2014-19 మధ్య దావోస్ పెట్టుబడుల ప్రకటనలను గుర్తు చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు దావోసులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పారిశ్రామిక పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
అయితే గతంలో ఎన్నోసార్లు దావోస్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తేలేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అన్నీ ఉత్తుత్తి ప్రకటనలేనంటూ ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు గత ప్రభుత్వంలో చేసిన ప్రకటనలను ఉటంకిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగుసార్లు, మంత్రి లోకేశ్ ఒకసారి దావోసులో పర్యటించినట్లు వైసీపీ గుర్తు చేసింది. ఈ సందర్భంగా 2015లో విశాఖకు మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ డేటా సెంటర్లు వస్తున్నాయని ప్రకటించారని తెలిపింది. అదేవిధంగా 2016లో మియర్ బర్గర్, ఫిస్లోం సోలార్ మాడ్యూల్ యూనిట్లు వస్తున్నాయని డప్పుకొట్టారని విమర్శించింది. 2017లో విశాఖలో యూకేకి చెందిన అంతర్జాతీయ హాస్పిటల్ నిర్మిస్తారని ప్రచారం చేశారని, 2018లో క్రిష్ణపట్నంలో సౌదీ ఆరామ్ చమురు శుద్ధి కర్మాగారం, 2019లో జేఎస్ డబ్ల్యూ రూ.3500 కోట్లు పెట్టుబడులు అంటూ చెప్పారని, ఇందులో ఒక్కటైనా వచ్చిందా? అంటూ ఆ పోస్టరులో నిలదీసింది. కాగా, ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వేట ఆడుతున్న చంద్రబాబు క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో విశాఖకు రూ.4 లక్షల పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది.ఇక దావోస్ సదస్సును సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పెట్టబడుల గమ్యస్థానంగా మార్చుతామని చెబుతోంది. ప్రభుత్వం ఒకవైపు, టీడీపీ మరోవైపు దావోస్ సదస్సుపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా,గతం గుర్తు చేస్తూ వైసీపీ పోస్టర్ రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ విమర్శలకు టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందా? అంటూ నెట్టింట అంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.