సంక్షేమ పథకాల నిధులను అడ్డుకున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసన..అమ్మకానికి హైదరాబాద్ మెట్రో !?ఏపీలో నోటుకు ఓటు లెక్క మారుతోంది..మాగుంట,ముత్తుముల సమక్షంలో టిడిపిలోకి భారీ చేరికలు

సంక్షేమ పథకాల నిధులను అడ్డుకున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ మహిళలు నిరసన..మహిళా వ్యతిరేక పార్టీ టీడీపీకి జీవితకాలం గుణపాఠం చెబుతామని ప్రతిజ్ఞ చేసిన లబ్ధిదారులు*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లగా వైయస్ఆర్ సీపీ అమలు చేస్తున్న వైఎస్ఆర్ చేయూత, ఆసరా, కళ్యాణమస్తు/షాదీ తోఫా సహా 6 సంక్షేమ పథకాల కింద రూ.14,000 కోట్ల నిధులు నిలిచిపోవటానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.👉చంద్రబాబు, అతని అనుచరులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినందునే పంపిణీ నిలిచిపోయిందని,లక్షలాది మంది లబ్ధిదారులని ఈ చర్య ప్రభావం చేస్తుందని గుర్తుంచుకోండి.ఇటీవల కాలంలో వైయస్ఆర్ సీపీ మహిళ నాయకులు హోంమంత్రి తానేటి వనిత, మాచర్ల ఎమ్మెల్యే సతీమణి పి.రమాదేవి సహా వైఎస్‌ఆర్‌సిపి మహిళా నేతలపై జరిగిన దాడి, వేధింపులు, హింసాత్మక ఘటనలపై కూడా రాష్ట్ర మహిళల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఈరోజు తుని, తణుకు, సత్యవీడు, నెల్లూరు సిటీ, విజయవాడ వెస్ట్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టారు.ఇందులో మహిళా లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, మహిళలు బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.ప్లకార్డులు ఎత్తి, చంద్రబాబు, టీడీపీ పేదల వ్యతిరేకి,మహిళా వ్యతిరేకులు అని నినదించారు. విజయవాడలో మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, మాజీ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో దాదాపు 2000 మంది పైనే మహిళలు పాల్గొన్నారు.సత్యవేడులో తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధ్విరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన, తునిలో ఏసీ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ ఆధ్వర్యంలో 1400 మందికి పైగా మహిళలు ర్యాలీ నిర్వహించారు.”చంద్రబాబు మొదట వాలంటీర్ వ్యవస్థను నిలిపివేశారు.ఆతర్వాత బాబు ఫిర్యాదు చేసి ఇంటింటికీ పింఛన్ పంపిణీని నిలిపివేశారు.చేయూత, ఆసరా, రైతు ఇన్‌పుట్ సబ్సిడీ వంటి ఆరు పథకాలకు రూ. 14 వేల కోట్ల నిధులను విడుదల చేయనివ్వకుండా బాబు ఫిర్యాదు చేసి అడ్డుపడ్డాడు.అయితే సీఎం జగన్  కోర్టులో పోరాడి చెల్లింపులకు అనుమతులు తీసుకున్నారు, కానీ చంద్రబాబు మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి నిధుల విడుదలను నిలిపివేశారు. నవతరం పార్టీ ద్వారా పరోక్షంగా ఈ పథకాలను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశాడు.”అని వాసి రెడ్డి పద్మ దుయ్యబట్టారు.”టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ మహిళా సాధికారత కోసం కనీసం ఆలోచన చేయలేదు, పథకాలు కూడా ప్రవేశపెట్టలేదు, ఇప్పుడు సీఎం జగన్‌ మనకోసం ఎంతో చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మన మహిళలకు సాధికారత కల్పిస్తుంటే టీడీపీ అన్నింటికీ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది! మేం సంతోషంగా ఉండటం టీడీపీ తట్టుకోలేపోతుంది. టీడీపీ ఎప్పుడూ మహిళల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది, వారికి చేసిందేమీ లేదు. మహిళలకు పెద్ద పీఠ వేసిన సీఎం జగన్‌కు మా మద్దతు తెలియజేస్తున్నాం” అని సత్యవేడులో తిరుపతి జిల్లా మహిళ ప్రెసిడెంట్ బొర్రా మాధవి రెడ్డి పేర్కొన్నారు

👉ఎంపీల జీతభత్యాలు..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తికి ప్రతినెల లక్ష రూపాయల జీతం వస్తుంది అదనంగా అలవెన్స్ లు రూ.1.30 లక్షలు లభిస్తాయి.ఇక ఎంపిక గెలిచిన వ్యక్తికి, ఆయన భార్యకు ప్రతి ఏటా 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం. అది కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో. రోడ్డు రవాణా అయితే కిలోమీటర్ కు 16 రూపాయలు చొప్పున అందుతుంది. 👉పాథలాజికల్ లాబరేటరీ, ఈసీజీ, డెంటల్, చర్మ కంటి ఆరోగ్య సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. ఢిల్లీలో ప్రత్యేకమైన భవనంలో నివాస వసతి కూడా కల్పిస్తారు.ఇక ఎంపీగా గెలిచిన వ్యక్తి మూడు టెలిఫోన్లను వాడుకోవచ్చు. ఏడాదిలో 50వేల కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.  ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత ఇక ప్రతి నెల 50 వేల రూపాయల పింఛన్ అందుతుంది.

👉అమ్మకానికి హైదరాబాద్ మెట్రో !? మహిళలకు ఉచిత బస్ పథకం ఎఫెక్ట్ హైదారాబాద్ మెట్రో రైల్ కు తగిలింది. మహిళలకు ఉచిత బస్ పథకం ఎఫెక్ట్ హైదారాబాద్ మెట్రో రైల్ కు తగిలింది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో మెట్రోను అమ్మకానికి పెట్టాలని ఎల్ & టి సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. మే 1 నాటికి 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి కొత్త చరిత్ర లిఖించిన హైదరాబాద్ మెట్రో రైల్ అంతలోనే అమ్మకానికి సిద్దంకావడం ప్రయాణికులకు మింగుడుపడడం లేదు. దేశంలోనే మూడో అతి పొడవైన మెట్రో వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది.

👉ఏపీలో నోటుకు ఓటు లెక్క మారుతోంది! ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంది! ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో ప్రచారాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంది! ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో ప్రచారాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ సమయంలో ఓటుకు నోటు అంశం హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం ప్రకారం… ఏపీలో ఎన్నికల్లో డబ్బు పంపిణీ కనీసం రూ.1000 గా ఉందని.. గరిష్టం ప్రస్తుతానికి రూ.5000 కు చేరిందని అంటున్నారు. దీంతో… ఏపీలో అన్ని విషయాల్లోనూ టఫ్ ఫైట్ నెలకొందని తెలుస్తుంది. – ప్రాంతీయ పార్టీలతో స్నేహం అందుకేనా? అవును… ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి చివరి అంకానికి చేరుకుంది. శనివారం మైకులు మూగబోవడం.. ఆదివారం నేతల మౌనవ్రతం అనంతరం.. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ ప్రక్రియ కూడా చివరి దశకు చేరిందని అంటున్నారు. వాస్తవానికి గతంలో పోలింగ్ కు ముందు రోజు రాత్రి డబ్బుల పంపిణీ చేపట్టేవారని చెబుతుంటారు. అయితే ఈసారి ఆ విషయంలోనూ ట్రెండ్ మార్చారు నేతలు! ఇందులో భాగంగా… పోలింగ్ కు నాలుగు రోజుల ముందే పంపిణీ ప్రారంభమైందని తెలుస్తుంది. ఇక ఈ పంపిణీ విషయంలో కూడా నేతల మధ్య అవగాహన ఉందని.. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలూ ఒక మాట అనుకుని.. ఇద్దరూ సమానంగా డబ్బులు పంచి.. నిర్ణయాన్ని ప్రజలకు వదిలేస్తున్నారని అంటున్నారు. ఇద్దరు నేతలూ ఒక మాట అనుకుని.. ఒక్కొక్కరూ వెయ్యి నుంచి పదిహేను వందల మేరకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో విపక్షాల కంటే అధికార పార్టీ నేతలు ఒక ‘నోటు’ ఎక్కువగానే పంచుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఉదాహరణకు జనసేనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజోలు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి రూ.1000 పంచుతుంటే.. వైసీపీ అభ్యర్థి రూ.1500 వరకూ పంచుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రకాశంం జిల్లా మార్కాపురం, గిద్దలూరు పరిసర నియోజకవర్గాలలో పోటుకు రూ 2000 ఇస్తుండగా టిడిపి రూ 1500 రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. జగన్ కోనసీమ జిల్లాలోని ఆల్ మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు.ఇదే సమయంలో రాజమండ్రి రూరల్ లో వైసీపీ ఇప్పటికే రూ.1500 పంచిపెట్టగా.. టీడీపీ రూ.1000 పంచిపెడుతుందని ప్రచారం జరుగుతుంది.రాజమండ్రి విషయానికొస్తే…అక్కడ ఓ ‘రెండు నోట్లు’ ఎక్కువగానే పంచుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… రాజమండ్రి సిటీలో వైసీపీ రూ.2500 రూపాయలు పంచుతుంటే.. టీడీపీ అభ్యర్థి రూ.2000 ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో.. సిటీ ఓట్లు కాస్ట్లీగురూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇక రాజానగరం విషయానికొస్తే… అక్కడ వైసీపీ ఇప్పటికే రూ.2000 పంచిపెట్టగా..జనసేన అభ్యర్థి ఇంకా చేయి విదల్చడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది! ఇక ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో.. పరిస్థితి డూ ఆర్ డై అనేలా ఉన్న స్థానాల్లో.. ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వరకూ ఇస్తున్నారనే చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. వీటికి చీరలు,వెండి కుంకుమ బరిణెలు మొదలైనవి అదనం అనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా…ఈ ఎన్నికల్లో నోట్ల ప్రవాహం పీక్స్ కి చేరిందని అంటున్నారు పరిశీలకులు.. అక్కడక్కడ పట్టుబడుతున్న నగదు అందుకు చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు.👉అయితే ఈసారి మాత్రం పోటీ చేస్తున్న అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసే సమయంలో మధ్యలో దళారులు కాజేయకుండా  తమకు నమ్మకస్తులైన వారిని నియమించినట్లు సమాచారం.. దీంతో ఎన్నికల సమయంలో డబ్బు సంపాదించుకోవచ్చచు అనిఆశపడిన వారి ఆశలు  అడియాసలు అయ్యాయని  పలువురు వాపోతున్నట్లు సమాచారం.

👉నేడు మార్కాపురం లోని మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి  మరియు మార్కాపురం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తర్లుపాడు మండలం కారుమానుపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు నేడు వెన్నా పోలిరెడ్డి ఆధ్వర్యం లో వై. యస్. ఆర్. సి. పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది.

👉తాటిచెర్ల మోటు గ్రామంలో ముత్తుముల తనయుడు ప్రచారం..కొమరోలు మండలం మోటు గ్రామంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి గారు శుక్రవారం ఉదయం మోటు గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*👉 గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామం లోని ఆర్యవైశ్య నాయకులు ఆరవీటి శీను (జిలకర)ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక..గిద్దలూరు మండలంలో వైసీపీకి షాక్..ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు..గిద్దలూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ముండ్లపాడు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు ఆరవీటి శ్రీను (జిలకర శీను) గ్రామంలోని 150 కుటుంబాలతో సహా వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!