రూ.31,532 కోట్ల పెట్టుబడులు..ద.కొరియా కు సీఎం రేవంత్..అమెరికాపై బంగ్లాదేశ్ ప్రధాని హసీనా సంచలన వ్యాఖ్యలు..టీడీపీతోనే మైనార్టీల సంక్షేమo-మంత్రి ఫరూక్..బిజెపి విధానాలపై ధ్వజమెత్తిన ఆవాజ్ నాయకులు..వీఆర్ ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. అక్రమ కట్టడాలపై పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉక్కుపాదం..

👉 రూ.31,532 కోట్ల పెట్టుబడులు..** దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు..** 19 కంపెనీలతో సంప్రదింపులు..ఒప్పందాలు..** విజయవంతంగా ముగిసిన అమెరికా పర్యటన..దక్షిణకొరియాకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది.అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3వ తేదీన అమెరికా పర్యటనకు బయల్దేరింది. ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్, మూడు రౌండ్ మీటింగ్లలో పాల్గొంది. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి.ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలు రాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని ముఖ్యమంత్రి దక్షిణ కొరియాకు బయల్దేరారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ.. తమ బృందం అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు.స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకమని అన్నారు.అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటిచెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తటంతో పాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 కడప ..అరాఫత్ , రాబిన్ శాంతి ఒప్పందంతో పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రజాస్వామ్య , లౌకిక దేశాలుగా 1994 లోనే ఏర్పడ్డాయి.*అరాఫత్, రాబిన్లు మతోన్మాదుల చేతుల్లో హత్యలతో ఇజ్రాయిల్, పాలస్తీనా లలో 39 లక్షల మంది మరణించారు.*ఇజ్రాయిల్ మారునాయుధాల ప్రయోగశాలగా”పాలిస్తీనా”ను ఎంచుకున్నది. *పాలస్తీనీయులకు అన్నం, పానీయాలు అందకుండా చేస్తున్న ఇజ్రాయిల్ టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలి.*పాలస్తీనాను ఆక్రమిస్తున్న ఇజ్రాయిల్ ను భారత్ బలపరచకూడదు.*ఇజ్రాయిల్ జియోనిజం లాగా హిందూయిజాన్ని బిజెపి మార్చే ప్రయత్నం చేస్తుంది.
ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.అబ్దుల్ సుభాన్.,
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్..

కడప స్థానిక బాలాజీ నగర్ లోని ఉపాధ్యాయ భవనం నందు, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏ.ఐ.పి.ఎస్.ఓ.)., “ఆవాజ్” జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఆవాజ్ అధ్యక్షులు పి.చాంద్ బాషా అధ్యక్షతన “పాలస్తీనా సంఘీభావ సదస్సు” జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి “ఆవాజ్ ” రాష్ట్ర అధ్యక్షులు ఎస్.అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ… ఐక్యరాజ్యసమితి (యు.ఎన్.ఓ.) గుర్తించిన సభ్య దేశమైన “పాలస్తీనా”లోని 90% భూభాగాన్ని అమెరికా అండదండలతో, ఇజ్రాయిల్ ఆక్రమించేసిందని, 39 లక్షల మంది పాలసీనియన్లను వారి మారునాయుధాలతో హత్య చేసిందన్నారు. స్థానిక పాలస్తీనీయన్లు వారి దేశ స్వాతంత్య్రం కోసం, పోరాడుతున్నారని వారు తెలిపారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్( పి.ఎల్.ఓ. ) అధ్యక్షులుగా “అసర్ అరాఫత్”, ఇజ్రాయిల్ ప్రధాని గా “యాజాక్ రాబిన్” లు 1994లో శాంతి ఒప్పందం చేసుకొని పాలస్తీనా, ఇజ్రాయిల్ రెండు ప్రజాస్వామ్య , లౌకిక దేశాలుగానూ మనుగడ కొనసాగించాలని నిర్ణయించుకున్నారన్నారు. అనంతరం 2006లో, 2017లో ఇరుదేశాల్లోనూ కూడా ఎన్నికలు యు.ఎన్.ఓ. పర్యవేక్షణలో జరిగాయని, నూతన ప్రజాస్వామ్య, లౌకిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఇరుదేశాల్లోని మత మౌడ్యం తో ఏర్పడిన సంస్థలు “హమాస్” వర్సెస్ “మొస్సాద్” ఇజ్రాయిల్ ప్రేరేపిత ఉగ్రవాద మిలిటరీ ఆపరేషన్ లో పాలస్తీనాలోనిగాజా,” హమాస్ “అజ్ఞాత అధ్యక్షులు ” ఇస్మాయిల్ హనియే”ను, 2024 జులై 31వ తేదీన ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రారంభోత్సవానికి అతిథిగా ఇరాన్లోని టెహ్రాన్కు వెళ్లినప్పుడు, ఇజ్రాయిల్ గూడచారి సంస్థ “మొస్సాద్” శత్రువు పరిస్థితిని సమర్థవంతంగా ఉపయోగించుకుని, ఇరాన్లోని కిరాయి హంతకులను ఉపయోగించుకొని హత్య చేశారన్నారు.అందువల్ల, హనియే హత్యతో, పరిస్థితి ఇప్పుడు పశ్చిమ ఆసియా మొత్తాన్ని పేలుడు ప్రభావాలతో, చుట్టుముట్టిన యుద్ధంలో, తీవ్రతరం అయ్యే అంచున ఉందని. మొత్తం గల్ఫ్ దేశాలలో పాలస్తీనా విముక్తిని సమర్థించే సారూప్య శక్తులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ఒక చోటికి చేరి అనేక దేశాలలో ప్రజాస్వామ్య, లౌకిక సంస్థలు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి,ఉద్యమిస్తున్నాయన్నారు. పశ్చిమ ఆసియా సామ్రాజ్యవాదాన్నితరిమికొట్టడానికి ప్రజాస్వామ్య , లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు రావడానికి ఇది సరైన సమయం అన్నారు. పాలస్తీనా విముక్తి పోరాటానికి సంఘీభావంగా,లౌకిక, ప్రజాస్వామ్య పాలస్తీనా ఏర్పడాలని, వారి దీర్ఘకాలం జీవన్మరణ పోరాటం విజయం సాధించాలని , నియో-ఫాసిజం మరియు సామ్రాజ్యవాదం పై ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పోరాడాలన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో నూటికి 90% మారనాయధాల తయారీ పరిశ్రమలు అమెరికా, ఇజ్రాయిల్ లోనే ఉన్నాయని వారి మారునాయుధాల ప్రయోగశాలగా పాలిస్తేనాను ఎంచుకున్నాయని విమర్శించారు. పాలస్తీనియులకు అన్నం, పానీయాలు, విద్యుత్తు, మందులు, అందకుండా స్కూలు ఆసుపత్రులు శరణార్థ శిబిరాలపై బాంబులు వేస్తూ, ఇజ్రాయిల్ సజీవ దహనం చేస్తుందని తెలియజేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ…పాలస్తీనాను ఆక్రమిస్తున్న ఇజ్రాయిల్ ను భారత్ ప్రభుత్వం బలపరచకూడదని వారు తెలిపారు. ఇజ్రాయిల్ జియోనిజం లాగా హిందూయిజాన్ని బిజెపి మార్చే ప్రయత్నం చేస్తుందని, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పార్లమెంటులో “వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లు” బిజెపి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దానిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి, తర్వాత సబ్ కమిటీకి, రాజ్యసభకు, పంపించి నిపునులచే సలహాలు, సూచనలు తీసుకున్నాక, సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉండగా, ఏకపక్షంగా సవరణలు చేయడం అనేక అనుమానాలకు దారితీస్తోందని వారు అన్నారు. దేశంలోని మైనార్టీ ప్రజల హక్కులు, భద్రత, భారత దేశ రాజ్యాంగం ఫెడరల్, లౌకిక వ్యవస్థ లక్ష్మన్నారు. దానికి భిన్నంగా బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తే దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని హితవు పలికారు. 2024 లో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మెజార్టీ ఇవ్వకుండా ప్రజలు తీర్పు ఇచ్చిన బిజెపి ఆలోచన విధానంలో మార్పు రాలేదన్నారు. ముస్లిం జేఏసీ నాయకులు బాబు భాయ్ మాట్లాడుతూ… భారతదేశంలో 9 లక్షల 40,000 ఎకరాల వక్ఫ బోర్డ్ భూములు ఉన్నాయని, దేశంలో నావి, రైల్వే తర్వాత

👉 బంగ్లాదేశ్ పై అమెరికా కుట్ర !!! .. అమెరికాపై బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!.. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం హింసాకాండకు దారి తీయడంతో అక్కడ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయి, చివరకు ఆమె భారత్ లో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.  అవును… బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ లో నేటి పరిస్థితికి, తమ ప్రభుత్వ పతనానికి కారణం అమెరికా అని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె బంగ్లాదేశ్ పౌరులకు పలు విషయాలు వెల్లడిస్తూ, విజ్ఞప్తులు చేశారు! ఈ సందర్భంగా నాడు తాను ఇంకా దేశంలో ఉండి ఉంటే మరింత మంది ప్రాణాలు పోయేవని.. మరిన్ని ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యేవని ఆమె వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్నందువల్లే తాను నాయకురాలిని అయ్యయని.. తన బలం బంగ్లా ప్రజలే అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు హత్యలకు గురవ్వడంపైనా ఆమె స్పందించారు. ఇందులో భాగంగా… తన పార్టీ అవామీ లీగ్ కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురవ్వగా, కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని.. ఈ సందర్భంగా వారి ఇళ్లను తగులబెట్టారని, వారి అస్తులు ధ్వంసం చేశారని.. ఇలాంటి ఘటనలతో ప్రసారమవుతున్న వార్తలు చూసి తన గుండే రోదిస్తుందని షేక్ హసీనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా పట్టేశారు ఇందులో భాగంగా… సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి గనుక ఇచ్చి ఉంటే.. తాను నిక్షేపంగా అధికారంలో ఉండగలిగేదాన్నని.. కానీ తాను అందుకు అనుమతించలేదని.. ఈ మేరకు ప్రజలు గ్రహించాలని అభ్యర్థిస్తున్నట్లు షేక్ హసీనా తెలిపారు. విద్యార్థుల మృతదేహాలపై అధికారంలోకి రావాలని కొంతమంది కోరుకున్నారని అన్నారు.
👉ఏపీ మైనార్టీ సంక్షేమ,న్యాయ శాఖమంత్రి ఎన్ఎండి ఫరూక్ ,అమరావతి..*టీడీపీ తోనే మైనార్టీల సంక్షేమo*
*జగన్ ప్రభుత్వంలో మైనార్టీ పథకాలు నిర్వీర్యం*
*మైనార్టీల హక్కులు,ప్రయోజనాల పరిరక్షణ కు చిత్తశుద్ధి తో కృషి..*చంద్రబాబు కృషి తోనే వక్ఫ్ చట్ట0 పార్లమెంటరీ జేఏసీ పరిశీలనకు.ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్*
*ప్రొద్దుటూరు ఆగస్టు 11…*రాష్ట్రం లో టీడీపీ ప్రభుత్వంతోనే మైనార్టీల సంక్షేమం కు పెద్దపీట వేయడం జరిగిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనార్టీ ల సంక్షేమంకు బృహత్తర పథకాలు కు శ్రీకారం చుట్టారని ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ అన్నారు. ఆదివారం పొద్దుటూరు అంజుమన్ ఆహాలే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్,స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు హాజరైన వందలాదిమంది ముస్లిం మైనార్టీ సోదరులను ఉద్దేశించి మంత్రి ఫరూక్ ప్రసంగించారు.రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో మైనార్టీల సంక్షేమం కు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014-2019 టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేసి మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలి వేసిందని విమర్శించారు. రాష్ట్రం లో ముస్లింలు 36.18 లక్షలు ఉన్నారని,వీరి సంక్షేమం కోసం వైసీపీ నిలిపి వేసిన పథకాలు అన్నింటిని తిరిగి ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం మైనార్టీ లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, అండగా నిలుస్తామని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం సవరణ ల బిల్లు ను పార్లమెంటులో ప్రవేశం పెట్టడం జరిగిందన్నారు.వక్ఫ్ ఛట్టం సవరణలు,చట్టం పై మైనార్టీల్లో తీవ్ర ఆందోళన, అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితులను సియం చంద్రబాబు కు మైనార్టీ సంఘాల తరపున వివరించామని ఫరూక్ పేర్కొన్నారు. చంద్రబాబు కృషి తోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ను పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలనకు కేంద్రం పంపిందన్నారు.మైనార్టీలకు సంభందించిన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం,అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఫరూక్ పేర్కొన్నారు.*రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన జగన్ కు, జనం తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ది రాలేదని అన్నారు.*రాజ్యాంగం కల్పించిన హక్కులను, వ్యవస్థలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని,పేదల భూములను వైసీపీ నాయకులు ఆక్రమించారని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని, లక్షల కోట్లు అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టి జగన్ చరిత్ర హీనుడిగా మారాడని మండిపడ్డారు.*వై సిపి నాయకులు భూ దందాలు, ఆక్రమణలు వెలుగులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టి పేదల కు న్యాయం చేసెందుకు చర్యలు చేపట్టమని ఫరూక్ పేర్కొన్నారు.*అసెంబ్లీ సమావేశాలకు రాకుండా కేవలం కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న జగన్ కు, 980 మంది తో తనకు రక్షణ కావాలని కోర్టుకు వెళ్లడం చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటూ నవ్వుకుంటున్నారని ఏద్దేవా చేసారు.*2014-2019 టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం విశేష కృషి.. ఫరూక్..*టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం,సిఎస్ఎస్ కింద 60:40 భాగస్వామ్యంలో భాగంగా రూ. 447.06 కోట్లు మంజూరు కాగా,రూ. 93.67 కోట్లతో 77 ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో 10 జూనియర్ కళాశాలలు, 9 ఐటిఐ కళాశాలలు, 5 పాలిటెక్నిక్ కళాశాలలు, 18 రెసిడెన్షియల్ పాఠశాలలు, 35 హాస్టలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 16 ప్రాజెక్టులు పూర్తయ్యాయని,13 నిర్మాణంలో ఉన్నాయని 43 ప్రారంభం కాలేదు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనుల పూర్తిని గాలికి వదిలేసి,పనులన్నింటినీ నిలిపి వేశారని ద్వజమెత్తారు..*విజయవాడలో రూ.80 కోట్లతో టిడిపి ప్రభుత్వం హజ్ భవనాన్ని మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం హజ్ భవన నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. *ఉర్దూ భవనాలు, షాది ఖానాల నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం 342 ప్రాజెక్టులు మంజూరు చేశామని, 196 పూర్తయ్యాయని,146 ప్రారంభం కాలేదని,రూ. 83.15 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వైసిపి ప్రభుత్వం కేవలం 46 ప్రాజెక్ట్లను మంజూరు చేసి, 2 ను మాత్రమే పూర్తి చేయడం మైనారిటీల పట్ల ఆ పార్టీకి ఉన్న వైఖరి స్పష్టం అవుతుందని అన్నారు..*కడపలో హజ్ భవనం నిర్మాణం కోసం రూ. 24 కోట్లు మంజూరు చేసామని,రూ. 15 కోట్లతో 80 శాతం పనులు పూర్తి అయినప్పటికీ, టిడిపి ప్రభుత్వం చేపట్టిందన్న ఒకే ఒక కారణంతో సీఎంగా తన సొంత జిల్లా కేంద్రంలో జగన్ హజ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం, డిప్యూటీ సియమ్ అంజాద్ బాషా కరివేపాకు లాగా పట్టించుకోలేదని, జగన్ సైకో పాలనకు కడప హజ్ భవనం ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు.
*రాష్ట్రంలో 648 వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ. 57.58 కోట్లతో పనులు చేపట్టి 60 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మూడు షాపింగ్ కాంప్లెక్స్ లను రూ. 1.65 కోట్లతో చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ స్కీంల పనులన్నింటినీ వైసిపి ప్రభుత్వం పూర్తిగా డిస్కంటిన్యూ చేసిందని ఫరూక్ విమర్శించారు.*మైనార్టీలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రాయితీతో కూడిన వివిధ స్కీములను టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టి 48892 మంది లబ్ధిదారులకు రూ.278.44 కోట్ల లబ్ధి చేకూర్చడం జరిగిందని, మైనార్టీలకు శిక్షణ ఉపాధి కల్పన కింద 41088 మందిలబ్ధిదారులకు రూ.53.89 కోట్లు ఖర్చు చేశామని,ఈ స్కీములన్నింటినీ కూడా దుర్మార్గపు వైసిపి ప్రభుత్వం డిస్కంటిన్యూ చేసిందని అన్నారు.*
*రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.*
*ఐదేళ్ల వైసీపీ పాలనలో, సైకో జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోనే మైనార్టీ లందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, మైనార్టీ సంక్షేమ పథకాలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం, అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అమలు కోసం వడివడిగా టిడిపి -జనసేన -బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు.
*రాష్ట్రంలో ఆరాచక పాలన సాగించిన జగన్ కు ఇంకా బుద్ది రాలేదని ఎం ఎల్ ఏ వరదరాజుల రెడ్డి అన్నారు. మైనారిటీల ఆస్తులు మసీదు లు, ఈద్గాల అభివృద్ధి కే నని అన్నారు. ఆక్రమణలు పై చర్యలు తీసుకుని మైనార్టీ ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.*కార్యక్రమం లో ప్రొద్దుటూరు టీడీపీ పరిశీలకుడు ఏవీ ఆర్ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మెన్ ముక్తియార్,మాజీ వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షులు జాకీర్ అహమ్మద్,ముస్లింసంఘాల ప్రతినిధులు,భారీసంఖ్యలోముస్లింసోదరులుపాల్గొన్నారు.

👉 అక్రమ కట్టడాలపై పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉక్కు పాదం..!!! హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఉక్కుపాదం మోపుతు న్నారు. తాజాగా చందానగర్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేడు కూల్చివే స్తున్నారు.వైశాలినగర్ లోని ప్రభుత్వ భూమిలో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా… భారీ బిల్డింగ్ లను జేసిబి లతో నేలమట్టం చేస్తోంది.నిన్నటి ఉదయం నుంచి మొదలైన కూల్చివేత లు..ఇవాళ సైతం కొనసా గుతున్నాయి. కూల్చివేత టైమ్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. కాగా , దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బూమ్రు ఖుద్దీన్‌ దవాళ్‌ చెరువులో అధికారుల నిర్లక్ష్యంతో బఫర్‌ జోన్లలో నిర్మాణాలు జోరందుకున్నాయి. దాదాపు 10 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసినట్లు గుర్తించారు.రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. మొత్తం 20 ప్రహరీలు, 6 నిర్మాణాలను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేప ట్టారు. బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబిన్‌ కూల్చి వేతలను నిలిపివేయాలని హైడ్రా సిబ్బందిని అడ్డుకోగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు
👉పర్వతగిరి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ తో పాటు వి. ఆర్ ఎస్. ఐ ని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.*
ఓ కేసు విషయంలో పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ . ఇ శ్రీనివాస్ నాయక్ తోపాటు అప్పటి పర్వతగిరి ఎస్.ఐగా విధులు నిర్వహించిన జి. అనిల్ కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో దీనిపై పోలీస్ కమిషనర్ విచారణ కు ఆదేశాలు ఇవ్వడంతో ఈ అవినీతి వ్యవహారం పై అధికారులు ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా అవినీతికి పాల్పడిన ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసారు.పెద్ద సంఖ్యలో వక్ బోర్డు భూములు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో 70 వేల ఎకరాలు భూములు ఉన్నాయని అందులో 32వేల ఎకరాల భూములు కబ్జాల అన్నారు. రాయలసీమ జిల్లాలలో 41 వేల 570 ఒక బోర్డు భూములు ఉన్నాయని, కడప జిల్లాలో రెండు వేల ఎకరాల వక్బోర్డు భూములు ఉన్నాయని జిల్లాలోని గత అధికార ప్రభుత్వాలు పాలకులు 315 ఎకరాలు కబ్జాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వోలామా అయ్యమ్మ కమిటీ మౌలానా అక్బర్ అలీ, జమియా ఉలామా కమిటీ ఎస్ నిజాముద్దీన్, ముస్లిం ఫెడరేషన్ ఎస్ నజీర్ హుస్సేన్, ఎంహెచ్పిఎస్ ఎస్ నాజర్ భాష, సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్, న్యాయవాది యస్.మహమ్మద్ అలీ ఖాన్, ఎస్ డి పి ఐ పి అలీ ఖాన్, విద్యాసాధన గ్రూప్స్ ఆఫ్ కాలేజీలు రెస్పాండెంట్ పి.మనస్సురాలి ఖాన్, జనతా మెడికల్ స్టోర్స్ ఎస్ రియాజ్, ప్రొఫెసర్ ఎస్.ఎం. ఫరూక్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బి.గురుమూర్తి, లోక్సత్తా నాయకులు కృష్ణ, ఆవాజ్ నాయకులు ఎస్ ఏ సత్తార్ అన్వర్ భాష మహబూబ్ బాషా షరీఫ్ సదస్సులో ప్రసంగించారు

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం