👉 కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది 😱😱😱.. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల..
YCP పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ?
*రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా ?
* రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ?
* ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ?
* సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే..
* కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు ?
* భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా ?
*5 ఏళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడు..
* ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. * పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్.
* రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్.
* మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు.
* 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే..
* 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిఇప్పుడు అండగా ఉంటాం. రూ.3లక్షల కోట్లు ఇస్తాం..
పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం…
*మీ వ్యాఖ్యలు మీద మీరు కట్టుబడి ఉంటే..
మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండని అమిత్ షా ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
👉 హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు..
ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు..
నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్న పోలీసులు..
కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో..
భారత్, అమెరికా మధ్య ఒప్పందం..
కేంద్రానికి నివేదిక పంపిన సీఐడీ..
అమెరికాకు నివేదిక పంపనున్న విదేశీ వ్యవహారాలశాఖ..
ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డ్ పొందిన ప్రభాకర్..
వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్న శ్రవణ్‌రావు..
రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్ పోలీసుల కసరత్తు..
👉 👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి
మలోల బిజీ బిజీ ..అనంతపురం ..
కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన పలు సంఘాలను పట్టించుకోకుండా రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయిన డీఆర్వో మలోల.
👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*
ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కనుపోలు ఉదయ్ కిరణ్ (32) పల్నాడు జిల్లా..
ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ లలో పది లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..కూరగాయలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నడు..పూర్తి వివరాలు తెలియలిసిఉంది
👉 అనంతపురం కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి నిర్వాకం.
రివ్యూ మీటింగ్ లోనే ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడిన DRO.
అనంతపురం: ఏపీలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు.
ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది.దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజ్ఞ మండిపడుతున్నారు.
👉 రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి *వైఎస్ఆర్ కడప జిల్లా*
కమలాపురం నియోజకవర్గ పరిధిలోని కొమ్మద్ధి గ్రామానికి చెందిన నిమ్మకాయల మధుసూదన్ రెడ్డిని రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
👉 “అదంతా అప్పుడండీ..నేనిప్పుడు మారిపోయాను..”
ఆర్జీవీ చెప్పిందేదీ నమ్మబుద్ధి కాదబ్బా..! ఆయన రాత్రి చెప్పిన మాట పొద్దున్నే మార్చేస్తుంటాడు.. ఆ జీవి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లే..! వర్మపై ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ ఇది. దాన్నిప్పుడు మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు వర్మ. రాజాలో వెంకటేష్‌లా అదంతా అప్పుడండీ.. ఇప్పుడు నేను మారిపోయానండీ అంటున్నాడు. మరి వర్మ నిజంగానే మారిపోయారా..?
నేనింతే.. అంతా నాయిష్టం.. మనల్నెవడ్రా ఆపేది.. ఇదిగో ఇలాంటి టైటిల్స్ అన్నీ రామ్ గోపాల్ వర్మకు బాగా సూట్ అవుతాయి. ఎవరేం చెప్పినా.. తాను అనుకున్నదే చేస్తుంటారు ఆర్జీవీ. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసారు ఈ దర్శకుడు. అలాంటిదిప్పుడు ఈయనలో మార్పు మొదలైంది.. ఇకపై మంచి సినిమాలే చేస్తా.. చేయకపోతే చంపేయండి అంటున్నారు..సత్య సినిమా 27 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమాను చూసిన వర్మ.. భావోధ్వేగానికి గురయ్యారు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ట్విట్టర్‌లో పెద్ద లేఖ రాసారు. సత్య, రంగీల తర్వాత తన కళ్లు నెత్తికెక్కాయని.. అంత గొప్ప సినిమాలు తీసిన తాను.. ఎంతో చెత్త కూడా తీసానని గుర్తొచ్చి కన్నీళ్లు ఆగట్లేదన్నారు RGV.
ఇకపై గౌరవాన్ని పెంచే సినిమాలు చేస్తానని మాటిచ్చారు వర్మ. బ్రాండ్ న్యూ వర్మను చూస్తారంటూ ప్రమాణం చేసారు. ఒకవేళ అలా చేయకపోతే.. తన తలలో పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయండంటున్నారు వర్మ. మరి ఈ దర్శకుడిలో వచ్చిన మార్పు నిజమేనా..? నేనింతే అనే వర్మ.. నేను మారతా అంటే నమ్మొచ్చా అనేది ఆడియన్స్‌లో ఉన్న అనుమానం. ఇకపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ..
👉 పుట్టపర్తిలో రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,డీఐజీ, ఎస్పీ రత్నా..
సత్యసాయిజిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్న ఏపీ డిజిపి ద్వారకా తిరుమలరావు కు పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, అనంతపురం రేంజ్ డిఐజి షిమోషి
ఎస్పీ వి రత్న.. ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, డీ ఐ జి ,ఎస్పీ ,జిల్లా పోలీస్ అధికారులు,
* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..
Recent Posts