హెజ్బొల్లా భీకర దాడి.. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ దుర్మరణం? ఇక బీభత్సమే !!!..అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్..రేవంత్ కు పరీక్షగా మారిన కొండా సురేఖ – హైకమాండ్ క్లారిటీ..హిందూపురం గ్యాంగ్ రేపు ఘటనపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించరా?..రాయచోటిలో విద్యార్థిని ఆత్మహత్య….జిల్లా ఎస్పీ సతీష్ ను ఘనంగా సత్కరించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్..నాగర్ కర్నూల్‌లో ఎస్సీ యువకులను బూతులు తిడుతూ, కొట్టిన పోలీసులు…

👉 హెజ్బుల్ల భీకర దాడి.. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ దుర్మరణం? ఇక బీభత్సమే !!! ఏడాదిగా సాగుతున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక మలుపు. ఏడాదిగా సాగుతున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక మలుపు. ఇటీవలి కాలంలో హమాస్ ను వదిలేసి లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ కు భారీ షాక్.. ఎవరూ ఊహించని విధంగా.. కనీసం కలలో కూడా తలచుకోని రీతిగా ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) చీఫ్ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే గనుక తీవ్ర పరిణామాలే ఉంటాయి. ఐడీఎఫ్ అంటే మామూలు మాటలు కాదు.. అమెరికా నుంచి శ్రీలంక వరకు ప్రపంచంలో ఎన్నో దేశాలకు సైన్యాలు ఉండొచ్చు. కానీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐపీఎఫ్) మాత్రం అత్యంత మేటి అని చెప్పక తప్పదు. చాలా చిన్న దేశానికి చెందినదే అయినా..ఐడీఎఫ్ చూపే తెగువ మామూలు స్థాయిలో ఉండదు. అయితే, తాజాగా ఐడీఎఫ్ చీఫ్ నే హతమార్చింది హెజ్బొల్లా అని అంటున్నారు. ఆ దేశంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్‌బొల్లా మానవ రహిత విమానాలు చేసిన దాడిలో నలుగురు ఇజ్రాయెల్‌ సైనికులు చనిపోయారని, దాదాపు 67 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఐడీఫ్‌ అధిపతి, లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జిహలేవి కూడా మృతుల్లో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అమెరికా కామెంటేటర్‌ జాక్సన్‌ హింక్లె సైతం దీనిని ప్రస్తావించడంతో గగ్గోలు రేగింది. ధ్రువీకరించిన (వెరిఫైడ్‌) ఎక్స్‌ ఖాతాల్లోనూ ఇదే ప్రచారమైంది. అయితే, కొద్దిసేపటి తర్వాత ఈ ప్రచారం తప్పంటూ జెరూసలెం పోస్టు కథనం ప్రచురించింది.
👉హైకమాండ్ ఆశీస్సులు ఎవరికో..! ఇజ్రాయెల్ పై అతిపెద్ద దాడుల్లో ఒకటి హెజ్బొల్లా మానవ రహిత విమానాలు/డ్రోన్లు చేసిన దాడి ఇప్పటివరకు ఇజ్రాయెల్ పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ ప్రదేశం ఐడీఎఫ్‌ గోలాన్‌ బ్రిగేడ్‌ ట్రైనిస్ సెంటర్ లోని మెస్‌ గా చెబుతున్నారు. కాగా, డ్రోన్ల దండుగా రావడంతో ఇజ్రాయెల్ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఏం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఐడీఎఫ్‌ ప్రతినిధి హగారీ మాత్రం.. యుద్ధంపై తమకు పూర్తిగా పట్టు ఉందని ప్రకటించారు. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను మానవ రహిత విమానం ఎలా తప్పించుకొందో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
👉దాడి చేసింది దీంతోనే.. లక్షన్నర రాకెట్లు హెజ్బొల్లా సొంతం. అయితే, దాని దగ్గర ఉన్న మిర్సాద్‌-1 రకం చాలా కీలకంగా చెబుతారు. దీంతోనే తాజాగా దాడి చేసిందని తెలుస్తోంది. 3 వేల మీటర్ల ఎత్తు దాకా ఎగురుతూ 40 కేజీల పేలుడు పదార్థాలతో ఈ డ్రోన్‌ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దాడి చేస్తుందట. ఇరాన్‌ సూసైడ్‌ డ్రోన్‌ మొహాజిర్‌-2 శ్రేణికి చెందినది మిర్సాద్-1.. హెజ్‌బొల్లా ప్రధాన డ్రోన్‌. రెండేళ్లుగా వాడుతోంది. ఉగ్ర సంస్థ భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి మిర్సాద్-1 డ్రోన్లను ప్రయోగించిందని.. అందుకే ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను డ్రోన్లు తప్పించుకోవడం తొలిసారి అని ఇజ్రాయెల్ చెప్పింది. ఐడీఎఫ్ చీఫ్ చనిపోతే.. తమ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ చనిపోతే ఇజ్రాయెల్ ప్రతీకారం ఎలా ఉంటుందో ఊహించలేం.. దీనికి అమెరికా కూడా తోడుగా వస్తుంది. అసలే ఇరాన్ పై రేపోమాపో దాడి చేసేలా, వారి అణు స్థావరాలను లక్ష్యం చేసుకునేలా ఉంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో ఐడీఎఫ్ చీఫ్ మరణం వారిని విపరీతంగా రెచ్చగొట్టినట్లే అవుతుంది.
👉 తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలపై తుఫాన్ ప్రభావం.. ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలి.. జేసీబీలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలి. -ఈవో శ్యామలరావు.
👉రేవంత్ కు పరీక్షగా మారిన కొండా సురేఖ – హైకమాండ్ క్లారిటీ..
మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు…నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది.
సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
*సురేఖ కామెంట్లతో
మంత్రి కొండా సురేఖ దూకుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో సమంత గురించి సురేఖ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే చెలరేగింది. కేటీఆర్ అంశం పక్కకు పోయి..సురేఖ టార్గెట్ అయ్యారు. పరోక్షంగా ప్రభుత్వం, కాంగ్రెస్ లక్ష్యంగా మారాయి. ఆ తరువాత సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహించుకున్నా.. వివాదం మాత్రం సమిసిపోలేదు. సురేఖ పైన హీరో నాగార్జున కేసు దాఖలు చేసారు. ఈ వ్యవహారం పైన అమల నేరుగా ప్రియాంక గాంధీతో మాట్లాడారు. పార్టీ నాయకత్వం సైతం సురేఖ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
*పోలీసు స్టేషన్ లో*
అయితే, సురేఖ పైన వెంటనే చర్యలు తీసుకుంటే రాజకీయంగా సమస్యలు వస్తాయని సీఎం రేవంత్ భావించారు. దీంతో, సురేఖ తన వ్యాఖ్యలు ఉప సంహించుకొనేలా పార్టీ సూచించింది. ఇక, తాజాగా సొంత పార్టీ నేత రేవూరి ప్రకాశ్​ రెడ్డి వర్గీయులతో సురేఖ వర్గ మధ్య విభేదాలు పోలీసు స్టేషన్ కు చేరాయి. వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఫోటోతో మొదలైన వివాదం, తర్వాత ఫ్లెక్సీల చింపివేత, ధర్నాలు, దాడులు, అరెస్టుల దాకా వెళ్లింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం..సీఐ కుర్చీలో ఆమె కూర్చోవడం మరో వివాదానికి కారణమైంది. తమ వారిని విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ చెప్పటం మరింత వివాదంగా మారింది.
*మరో వివాదం*
మంత్రి నేరుగా స్టేషన్ కు చేరటంతో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కూడా చేరుకున్నారు. తన వర్గీయులపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆమె వర్గీయులు అక్కడకు భారీగా చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అధికారంలో ఉన్న సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా మంత్రి స్టేషన్ కు వచ్చి అధికారి కుర్చీలో కూర్చోవటం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. సురేఖ దూకుడు స్వభావం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యగా మారుతోంది. దీంతో..సురేఖ తీరు ఇదే విధంగా ఉంటే త్వరలోనే చర్యలు తప్పవనే సంకేతాలు పార్టీ నుంచి ఇస్తున్నట్లు సమాచారం..
👉అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్*
AP: కొత్త లిక్కర్ పాలసీతో CM చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని, లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ‘రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు. మీరు, మీ వాళ్లు డబ్బు సంపాదించుకోవడం కోసం తెచ్చిన ఈ లిక్కర్ పాలసీ ప్రమాదకరం.
అక్రమార్జన కోసం ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటుకు అప్పగించారు’ అని Xలో ఆరోపించారు.
👉జిల్లా ఎస్పీ సతీష్ ను ఘనంగా సత్కరించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు.*
గుంటూరు : అక్టోబర్ 14
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల క్రితం ఎస్పీ సతీష్ కు ప్రభుత్వం ఏ.డి.సి అవార్డు ఇచ్చిన సందర్భంలో ఎస్పీ సతీష్ కు అభినందనలు తెలియజేస్తూ సత్కరించారు. సంచాలనాత్మక కొన్ని ప్రముఖ సంఘటనలలో త్వరితగతిన కేసులు చేదించిన సందర్భంలో ఎ.డి.సి అవార్డుకు ఎంపిక అవుతారని, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కూడా పేద ప్రజల పట్ల జరిగిన అనేక నేరాలను చాలా శ్రద్ధతో చర్యలు తీసుకుంటూ జిల్లాకు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలు పొందారు. ప్రజలు చెప్పింది చాలా ఓపిక గా విని తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రజలకు ఎస్పీ సతీష్ యొక్క వైఖరి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ పేద ప్రజల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారని, గతంలో కన్నా ఇప్పుడు జరిగిన సంఘటనలు వెంటనే పరిష్కారం అవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే గుంటూరు జిల్లా వ్యాప్తంగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్న జిల్లా ఎస్పీ సతీష్ రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులతో పాటు అత్యున్నత హోదా లో అందరి పొందాలని ఫెడరేషన్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పట్నాల సాయి కుమార్, అజయ్ ఇండియన్, శామ్యూల్,వేముల రాజేష్,కొండవీటి పుల్లారావు,మహేష్ వరదల,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
👉 నాగర్ కర్నూల్‌లో ఎస్సీ యువకులను బూతులు తిడుతూ, కొట్టిన పోలీసులు..
నాగర్ కర్నూల్ ట్యాంక్‌బండ్ పైకి జమ్మి ఆకు కోసం వచ్చిన యువకులను ఆపి ఏ ఊరు, ఏ కులం అడగగా.. వాళ్లు మాది గన్యాగుల గ్రామం, మేము మాదిగ కులస్తూలమని చెప్పగానే దాడి చేశారని వాపోయిన యువకులు.
నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ASI నిరంజన్ రెడ్డి మరియు విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ తమను అకారణంగా కొట్టారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ ఇచ్చిన యువకులు…
👉రాయుడు కాలనీలో విద్యార్థిని ఆత్మహత్య..*
*రాయచోటి పట్టణం డైట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య..*
*సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..*
*పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..*
*విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*
👉 హిందూపురం గ్యాంగ్ రేపు ఘటనపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించరా?.. , హిందూపురం వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త ..దీపిక
సాయంత్రం లోగా నిందితులను అరెస్టు చేస్తామని తెలుగుదేశం పార్టీ మంత్రి సవిత చెప్పారు…ఎక్కడ అరెస్టు చేశారు?మా పార్టీ నాయకులను, జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించడం మాని మీ బాధ్యత నెరవేర్చండి.
దిశ చట్టం తెచ్చి అత్యాచార ఘటనల విచారణ 21 రోజుల్లో పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేసే వ్యవస్థ ఏర్పాటు చేసింది జగనన్న ప్రభుత్వం.
మీ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పది ఘటనలు జరిగాయి. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనీ ఆమె నిలదీశారు..
👉ప్రభుత్వం మద్యం షాపుల లాటరీ వద్ద బందోబస్తు ఏర్పాటులను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ …
జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం కొనసాగుతున్న లాటరీ ప్రక్రియను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు.
లాటరీ సజావుగా జరగడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. జిల్లాలోని 171 మద్యం దుకాణాలకు లాటరీ విధానము ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో జరుగుతున్న నేపధ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ గారు సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలు, బందోబస్తును పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సజావుగా, పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కానీ, ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, ఎలాంటి ఘటనలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయన వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వర రావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..