సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే కఠిన చర్యలు- సీఎం చంద్రబాబు..సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన సీఎం.. బాలికపై అత్యాచారయత్నం..ఎస్సి బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినీలు ఆత్మహత్యాయత్నం..ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్.. మగ్గానికి ఉరి వేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య..మహిళలను కించపరిచేలా మేయర్ తీరు-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్.. జనసేన కార్యకర్త ఆత్మహత్య పై లోతైనా విచారణ చేయాలి..ఆక్రమించుకున్న స్థలాలను పరిశీలించిన గిద్దలూరు రెవెన్యూ అధికారులు…

👉శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే జాగ్రత్త జగన్ కు తల్లి చెల్లి అంటే గౌరవం లేదు.. మాకు సభ్యత సంస్కారం ఉన్నాయి.. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు..నా దగ్గర రౌడీలు గుండాల ఆటలు సాగవు.. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు.. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలిపెట్టం మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదు రౌడీయిజం చేస్తే సహించేది లేదని..👉వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలనని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘YCP నేతల భార్యలు, కూతుర్లపై అసభ్యకర పోస్టులు పెట్టినా వదలనని మృగాళ్లా ప్రవర్తించొద్దు.. రౌడీలు, నేరస్థులు వేసుకున్న రాజకీయ ముసుగు తీస్తానని, కొందరు పోలీసులు లాలూచీ పడితే వారికదే లాస్ట్ డే అని టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే. నా దగ్గర మీ కథలేంటి. బీ కేర్ ఫుల్’ అని హెచ్చరించారు.

👉రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”..ఏపీలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
*విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి స్లీప్లేన్ లో ప్రయాణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.
*శనివారం విజయవాడ పున్నమి ఘాట్ లో రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “సీ ప్లేన్” ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి విచ్చేశారు.శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా “సీ ప్లేన్” ల్యాండ్ అయ్యింది.*రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి ముఖ్యమంత్రికి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు.అనంతరం పాతాళగంగ నుంచి రోప్ వే లో శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి దర్శనం చేసుకున్నారు. స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష..
👉బాలికపై అత్యాచారయత్నం
ఆంధ్రప్రదేశ్ : ప్రకాశం జిల్లా కారుమంచిలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న బాలికపై టీచర్ అత్యాచారానికి యత్నించాడు. సుధాకర్ అనే టీచర్ బాలిక ప్రైవేట్ పార్ట్‌పై చేతులతో తాకి గాయపర్చాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రానివ్వకుండా బాలిక కుటుంబాన్ని నిందితుడు బెదిరించినట్లు తెలుస్తోంది.
👉కడప జిల్లా..*ఎస్సి బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినీలు ఆత్మహత్యాయత్నం..హాస్టల్ గేటు బయట అపస్మారక స్థితిలో పడిపోయిన విద్యార్థినిలు..విషం తాగినట్లు సమాచారం.. గురువారం అర్ధరాత్రి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ఆర్ చంద్ర హరిత.. సి నందిని జమ్మలమడుగులో ఓ ప్రముఖ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు*..పరిస్థితి విషమంగా ఉండడంతో చంద్ర హరితను కర్నూలు ఆసుపత్రికి, నందిని ని కడప రిమ్స్ కు తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉 ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్..అమరావతి :
ఏపీలో ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని సీఎంచంద్రబాబు
అన్నారు.RTGపై సమీక్షించిన ఆయన ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తేవాలన్నారు. వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు సీఎం కు
మంత్రి లోకేశ్ వివరించారు. 90 రోజుల్లో QR కోడ్ ద్వారా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పొందేలా చర్యలు
చేపడుతున్నామన్నారు.
👉రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోయే ముందు గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు శనివారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వం ప్రాధాన్యతలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.*
👉జనసేన కార్యకర్త ఆత్మహత్య పై లోతైనా విచారణ చేయాలి*..డిప్యూటీ సీఎం సీఐడి విచారణకు ఆదేశించాలి.ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు
మదిరె రంగ సాయి రెడ్డి..
గత వైసీపీ హయాంలో గిద్దలూరు నియోజకవర్గం లో అనేక హేయమైన చర్యలు చేశారు.వాటిలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చాలా భాదాకారం.దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఐడి దర్యాప్తుకు ఆదేశించాలి.తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
👉 సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం:వాలంటీర్ లు
సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను విధుల్లో కొనసాగించడంతో పాటు రూ.10 వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వాలంటీర్ల విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.
👉నేడు ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా రూడ్ సెట్ డైరెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి,స్టాప్ బాపూజీ సుధీర్,లీలా కృష్ణ,చందు తదితరులు.*నేడు ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు.
*ఒంగోలు లోని సాయి I. T. A కళ్యాణమండపం లో గళ్ళా శ్రీనివాసరావు మరియు శ్రీవాణి కనిష్ఠ పుత్రిక చి. ల. సౌ. నందిని మరియు చి.చంద్రశేఖర్ ల వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రహిమాన్.
👉 ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో వీసాలు ఇప్పించామని ముగ్గురు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని నార్తరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాలోని అటార్నీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కాలిఫోర్నియోలో నివసించే కిశోర్‌ దత్తపురం (55), కుమార్‌ అశ్వపతి (55), సంతోష్‌ గిరి (48)లపై కేసు నమోదయింది. నానోసెమాంటిక్స్‌ పేరుతో నైపుణ్యంగల కార్మికులను సరఫరా చేసే కంపెనీని కిశోర్‌, అశ్వపతిలు నిర్వహిస్తున్నారు. న్యాయ సహాయం అందించేందుకు లెక్స్‌గిరి పేరుతో సంతోష్‌ గిరి సొంతంగా మరో సంస్థను నడుపుతున్నాడు. విదేశీయులు తాత్కాలిక ప్రాతిపదికన అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఉద్దేశించిన హెచ్‌-1బీ వీసాల్లో వీరు అక్రమాలకు పాల్పడినట్టు అమెరికా పోలీసులు గుర్తించారు. అశ్వపతికి విధించే శిక్షఫై ఈ నెల 25న విచారణ జరగనుంది. కిశోర్‌, సంతోషగిరిలకు విధించే శిక్షపై ఫిబ్రవరి 24న విచారణ జరగనుంది. వీరికి పదేళ్ల జైలు శిక్ష, 2.50లక్షల డాలర్ల(సుమారు రూ.2కోట్లు) ఫైన్‌ విధించే అవకాశం ఉంది.
👉మదనపల్లె …. అన్నమయ్య జిల్లా.
*నీరు గట్టు వారి పల్లెలో మగ్గానికే ఉరివేసుకుని వేలాడుతూ బలవన్మరణం చెందిన చేనేత కార్మికుడు*
మదనపల్లె లోని నీరుగట్టువారిపల్లెలో చేనేత మగ్గానికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుని మృతి కన్నీళ్లను తెప్పిస్తోంది. శనివారం తీవ్ర కలకలం రేపిన ఘటనపై వివరాలు.. సత్యసాయి జిల్లా, సోమందేపల్లికి చెందిన రామయ్య కొడుకు చేనేత కార్మికుడు సి. హరి(45) మదనపల్లె పట్టణం, నీరుగట్టు వారిపల్లిలోని మారుతి నగర్లో ఉంటున్నాడు. అనారోగ్యం కారణంగా తాను నేచే మగ్గానికే ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. సంఘటన స్థలాన్ని మదనపల్లె ఒకటవ పట్టణ సీఐ చాంద్ భాషా పరిశీలించి, సత్యసాయి జిల్లాలో ఉన్న మృతుని భార్య పిల్లలకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.
👉మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమీక్ష సమావేశం*
*మహిళలు, చిన్నారుల భద్రత, గంజాయి నిర్మూలన, సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్య పోస్టుల నియంత్రణపై చర్చ*
*డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా, యాంటి నార్కోటిక్ చీఫ్ ఆకే రవికృష్ణ,లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్, సిఐడి ఎడిజి రవిశంకర్ సహా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు..
👉 అనంతపురం
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా డీఎస్పీ ఆఫీస్‌లో.. జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు.
👉అల్లూరి సీతారామరాజు జిల్లా
వైయస్ జగన్ పై అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో.. జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, వైయస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు.
👉*మదనపల్లె పాత ఆర్డిఓ మురళి ని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు**
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్లదగ్ధం కేసులో మదనపల్లె పాత ఆర్డిఓ మురళిని శనివారం ఉదయం ఏసిపి అధికారులు అరెస్టుచేశారు. ఫైళ్ల దగ్ధం కేసులో దూకుడు పెంచిన సిఐడి తమదైన స్టైల్లో కేసులో నిందితుల కోసం కూపి లాగుతూ ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలతో తిరుపతి జిల్లా ఎసిబి అధికారులు మదనపల్లె పాత ఆర్డీఓ మురళి ఇంటితో పాటు మరో మూడు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి, కీలక లభించడంతో అరెస్టు చేశారు.. దీనిపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు.. పీటీ వారెంట్‌పై కర్నూలుకు తరలింపు
సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు
కర్నూలుకు తరలించి విచారిస్తున్న పోలీసులు
అనిల్‌పై ఇప్పటికే పలు కేసులు
బాబు ప్రకాశ్‌ను బెదిరించిన కేసులో అరెస్ట్
వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత గట్టు తిలక్ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆయనను పీటీవారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.
బోరుగడ్డ అనిల్‌పై ఇప్పటికే పలు కేసులున్నాయి. రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ 2021లో కర్లపూడి బాబుప్రకాశ్‌ను బెదిరించిన కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. గతేడాది మార్చి 31న బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి కేసులో అనిల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏ1గా, అనిల్ ఏ2గా ఉన్నారు. కాగా, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.
👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు లోని కాశినాయన కుంట సమీపంలో కుంట సమీపంలో దాదాపు నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్న స్థలాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు..!! ఇంతకు ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకుంటారా లేక రాజకీయ వత్తులకు లొంగుతారా వేచి చూడాల్సిందే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు…???
👉ప్రకాశం జిల్లా కొమరోలు మండలం కొమరోలు టౌన్ లో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 21 క్వాటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నా ఎక్సైజ్ సీఐ జయరాజు వారి బృందం
👉ప్రకాశం..
మంత్రి లోకేష్ పై సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు…
అమరావతి.
👉*గుంటూరు పీఎస్ లో బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్.*
*బోరుగడ్డ అనిల్ అడుగులకు మడుగులు ఒత్తిన పోలీసులపై ఆరా.*కోర్టు ఆదేశాల మేరకే తాము బోరుగడ్డకు పరుపు, దిండు ఇచ్చామన్న డీఎస్పీ.*సొంత ఇల్లుగా పోలీస్ స్టేషన్ ను వాడుకున్న బోరుగడ్డ అనిల్ దాడులు, దౌర్జన్యాలు చేసిన వారికి రాచమర్యాదలు.*ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసిన అధికారులు.*
👉 కడప జిల్లా*..కడప హరి టవర్స్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మీడియా సమావేశo…కార్పొరేషన్ లో కొన్ని సంప్రదాయాలు పాటించాల్సిన అవసరo మేయర్ కు ఉంది..
మహిళలను కించపరిచేలా మేయర్ తీరు..మేయర్ సురేష్ బాబు కొత్తగా ప్రోటోకాల్ డ్రామాలకు తెరలేపారు…మహిళా ఎమ్మెల్యే ని మేయర్ అవమాన పరిచాడు…గతంలో వైసిపీ ఎమ్మెల్యే లను పక్కన కూర్చోబెట్టుకున్న మేయర్ కు ఇప్పుడు ప్రోటో్కాల్ గుర్తుకు వచ్చిందా…గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందాన మేయర్ సురేష్ తీరు..
వైసిపీ లో ఒక పెద్దమనిషి ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నాడు అని చెప్తే మేయర్ ఎందుకు దేవుని కడప లో ప్రమాణం చేసాడు…కమలాపురం, కడప ఎమ్మెల్యే లకు అవమాన పరిచేలా మేయర్ ప్రవర్తన ను తీవ్రంగా ఖండిస్తున్నాం…
కార్పొరేషన్ లో ప్రజా సమస్య లను ప్రశ్నిస్తే మహిళా ఎమ్మెల్యే కు కుర్చీ లేకుండా చేస్తే సహించేది లేదు…
ప్రజలను అవమాన పరిచే విధంగా మేయర్, వైసిపీ అనుచరుల తీరు…మీడియా సమావేశం లో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు శ్రీనివాసులు, సి.ఆర్. వి ప్రసాద్, టిడిపి నాయకులు పాలెంపల్లి సుబ్బారెడ్డి, బెస్త సంఘం నాయకులు రాంప్రసాద్, ఇతర నాయకులు…

👉 సీబీఐ ఆఫీసర్లుగా నటించి రూ.లక్షలు దోచుకున్న మోసగాళ్లు..
సీబీఐ ఆఫీసర్లుగా నటించి రూ.లక్షలు దోచుకున్న మోసగాళ్లు
కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న ఓ ముఠా సీబీఐ అధికారులుగా నటించి వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంది. గత కొన్ని వారాల్లో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయని సమాచారం. “ఈ ముఠా సాధారణంగా నల్లటి స్కార్పియోలో వచ్చి, CBI అధికారులుగా నకిలీ ఆధారాలు చూపిస్తారు. కొన్ని సార్లు నేరుగా దుకాణాలపై దాడి చేస్తారు. మరికొన్ని సార్లు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తున్న వ్యక్తులను ఎత్తుకెళ్తారు,” అని ఓ అధికారి చెప్పారు.
👉 కృష్ణాజిల్లా..
ఉయ్యూరు..
పద్మావతి కన్స్ట్రక్షన్ అధినేత… జాలాది సత్యనారాయణ… అరెస్ట్…?
అలియాస్ రోటరీ క్లబ్ సత్యనారాయణగా పేరుపొంది… కన్స్ట్రక్షన్స్ వ్యాపారంతో ఉయ్యూరులో కొన్ని వందల మంది దగ్గర.. కోట్ల రూపాయల్లో వసూళ్లు చేసి.. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్న సత్యనారాయణను ఉయ్యూరు పోలీసులు కోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసి తీసుకు వచ్చినట్లు సమాచారం…?
ఇతని బాధితులు వరుసగా పోలీస్ స్టేషన్ వద్దకు క్యూ కడుతున్నట్లు సమాచారం…
ఉయ్యూరులో ప్రముఖులకు కోట్ల రూపాయల్లో టోకరా వేసినట్టు సమాచారం…
లక్ష రూపాయలు దగ్గర నుంచి ఐదు కోట్ల వరకు సామాన్యుడిని కూడా వదలకుండా కన్స్ట్రక్షన్స్ వ్యాపారం పేరుతో మోసాలు చేసి వసూళ్ల కు పాల్పడినట్టు సమాచారం..?
ఇప్పటికే ఇతనిపై ఉయ్యూరు స్టేషన్లో పలు కేసులు పెండింగ్లో ఉన్నట్లు, కోర్టులో ఎన్ బి డబ్ల్యులు, పలు వారెంట్లు ఇతనిపై ఉన్నట్లు సమాచారం..?
👉ప్రాణం విలువ….పది లక్షలా…..?
• వైద్యం వికటించి మృతి చెందిన మహిళా విషయంలో అనేక అనుమానాలు..! • కొండపల్లి టూ ఇబ్రహీంపట్నం వయా ఆంధ్రా హాస్పిటల్…. సెటిల్మెంట్ షురూ…!
• వైద్యం ముసుగులో అక్రమాలు నిజమేనా…..?
• పేరు ఒకరిది…. వైద్యం మరోకరిది… ఇది జగమెరిగిన సత్యం..• ఓ పోలీస్ అధికారి, న్యాయవాది, రిపోర్టర్ తో చరవాణిలో నిరంతర మంతనాలు… సఫలం
• కాల్ డేటా బహిర్గతంతో వెలుగులోకి అసలు నిజాలు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో ఓ నర్సింగ్ హెూమ్ లో శుక్రవారం జరిగిన సంఘటన కొండపల్లి ప్రజలని నిర్ణాంతంకు గురించేసింది. కొండవల్లిలోని గత కొన్ని సంవత్సరాల నుండి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న వైద్యుడి వైద్యం పైన పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు చదివింది డిప్లొమా ఇన్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జన్ కోర్సు చేసేది హలోపతి వైద్యం, ఎటువంటి పూర్తి అవగాహన లేకుండా ఒక రోగానికి మరొక మందు ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఇది ఇలా ఉoటే కడుపులో గడ్డలకు సర్జరీ చేసారు ఆపరేషన్ చేసి నాలుగు గంటలు తరువాత ఫిడ్స్ మరియు స్ట్రోక్ వచ్చాయి అని ఆంధ్రాహాస్పిటల్ కీ పెషేంట్ ని డిశ్చార్జ్ చేసి పంపించేసారు. దారిలోనే ప్రాణం పావటం దారుణం. హోమియో వైద్యుడికి ఆపరేషన్ గదిలో ఏమి పని…? అసలు గుర్తింపు ఉన్న వైద్యులతోనే సర్జరీ జరిగిందా..?..
జరిగి ఉంటే నాలుగు గంటల తరువాత రోగి పరిస్థితి ఎందుకు అత్యవసర స్థితిలోకి వెళ్ళింది. ఇలా అనేక రకాలుగా ఆ వైద్యుడి వైద్యంపై పలు అనుమానాలు నివృత్తి అవుతున్నాయి..
మంతనాలు… వాళ్ళకే సాధ్యం….. చక్రం తిప్పిన అధికారి..
ఒక మహిళా అందులో 23 సంవత్సరాలు కూడా నిండని ఓ మహిళ ఈ విధమైన పరిస్థితి కీ గురవటం కుటుంబ సభ్యులలో తీవ్ర శోకం కు గురిచేసింది. మృతురాలి కుటుంబ సభ్యులుతో కొందరు న్యాయవాదులు ఓ అధికారి సహాకారంతో స్థానికుల అండ దండలతో అర్ధరాత్రి చర్చలు జరిపి సఫలం అవటంతో ఎటువంటి ఉద్రిక్తకు తావు లేకుండా వెను తిరిగినట్టు సమాచారం. ఈ చర్చలలో సుమారుగా లక్షల్లోనే నగదు చేతులు మారినట్టు విశ్వసనీయ సమాచారం అదే కాకుండా
ఈ చర్చల్లో సహకరించిన వ్యక్తులకు మరియు రహస్యంగా సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్న ఓ నలుగురు వ్యక్తులకు కూడా కొంత వరకు ముడుపులు సమర్పించుకున్నట్టు సమాచారం. ఏమైనా ప్రాణం ఖరీదు లక్షలు అని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇంత జరిగినా ఎటువంటి మహిళా ప్రజా సంఘాలు స్పందించక పోవటం దురదృష్టకరం… వైద్యం మునుగులో ఆర్థిక అహంకారం తో ఇటువంటి సంఘటనలు మూలంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికైనా నిజమైన వైద్యులు ఎవరో ముసుగు వీరులు ఎవరో ప్రభుత్వం గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
[ కుత్బుల్లాపూర్
మల్లారెడ్డి ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.
నిర్లక్ష్యపు వైద్యంతో యువతి ప్రాణాలు కోల్పోయిందని బందువులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కవరేజీ కీ వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి.
మల్లారెడ్డి ఆసుపత్రి లో గల బౌన్సర్లతో కవరేజీ కి వచ్చిన R tv న్యూస్ స్టాఫర్,కెమెరామెన్ మరియు లోకల్ రిపోర్టర్ పై దాడి.
సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మీడియా ప్రతినిధులు.
[: అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు…
గత ఐదేళ్లలో టీడీపీ పార్టీ జెండా మోసిన మమ్మల్ని కష్టపెట్టిన వైసిపి వాళ్ళే ఈ రోజు మళ్ళీ టీడీపీ లోకి వచ్చి మమ్మల్ని తొక్కుతుంటే మాకు దిక్కెవరు..?
– కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన మా లాంటి వాళ్ళకి ఇప్పటికీ కష్ట కాలమే నడుస్తుంది..
పార్టీ జెండా పట్టడానికి భయపడిన కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి, కార్యకర్తలను నడిపించిన నాయకుడికే దిక్కు లేదంటే ఇంకా మా పరిస్థితి ఏంటి?..పార్టీ అధికారంలోకి వచ్చినాక సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు , లోకేష్ చెప్పిన మాట ప్రకారం పార్టీ కోసం కష్టపడ్డాం, ఈ రోజు మమ్మల్ని అప్పుడు కష్టపెట్టిన వైసిపి వాళ్ళే ఈ రోజు టీడీపీ లోకి వచ్చి మమ్మల్ని తొక్కుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి..గత ఐదేళ్లుగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా వైసిపి వాళ్ళతో కలిసి పని చేసుకుని , టీడీపీ పార్టీ జెండా మోయకుండా ఇంట్లో పడుకున్న వాళ్ళు ఈ రోజు ముఖ్య నాయకులు, యువ నాయకులు అని చెప్పుకుని అధికారం చెలాయిస్తున్నారు..
పార్టీ కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు తెలుగుదేశం పార్టీ అదినాయకత్వం న్యాయం చేయాలని కోరుతున్నామని టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?