అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త నిరసన .. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ముత్తుముల.. కంభం మండలంలో పొలం బడి

👉రోడ్డు పై బైఠాయించిన సీఎం.. రాజ్‌భవన్ వద్ద భారీగా కార్యకర్తలు …*అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార,ఆర్థిక రంగాన్ని,పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు*. దేశంలో అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర మంత్రులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి వాటితో వరుసగా అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు.మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు,విధ్వంసాలపైనా మోడీ స్పందించకపోవడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు ముందుగా భారీ ర్యాలీ చేపట్టారు..సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.ప్రధాని,అదానీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని దుయ్యబట్టారు.దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితి తెచ్చారన్నారు.అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని,వెంటనే జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు.
*అదానీ విషయంలో ప్రధాని మోడీని నిలదీసినా.. అడిగినా కడిగినా మాట్లాడడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి రాజ్‌భవన్ వద్ద నిరసన చేపట్టడం ఏంటని కొందరు అంటున్నారని, తమ నిరసన కొందరి నచ్చకపోవచ్చని,75 ఏళ్లు కష్టపడి కాంగ్రెస్ దేశ ప్రతిష్టను పెంచిందన్నారు.
*అదానీ లంచాలు ఇచ్చారని అమెరికాలో కేసు నమోదైందని,ఈ అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీశారని అన్నారు. అయినా.. మోడీ మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని, అదానీపై విచారణ జరగాలని అన్నారు.
👉మోదీ.. వ్యాపార మోసగాడు అదాని కలిసి దేశ ప్రతిష్ట ను దెబ్బ తీసిన బడా చోరులు.*ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి*..*చలో రాజ్ భవన్ ర్యాలీలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి*
హైదరాబాద్ :టి పి సి సి ఆధ్వర్యంలో బుధవారం నెక్లేసు రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహాము వద్ద నుంచి భారీ ర్యాలీ తో చలో రాజ్ భవన్ కార్యక్రమం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
దేశ ప్రధాని మోదీ.. వ్యాపార మోసగాడు అదాని కలిసి దేశ ప్రతిష్ట ను దెబ్బ తీసిన బడా చోరులు.
గౌతమ్ ఆదాని కీ ప్రధాని మోదీ దేశ సంపద దోచి పెడుతున్నారని.. దేశ ప్రజలు మేల్కొవాలని ర్యాలీ ముఖ్య అతిథి గా పాల్గొన్న రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
ఆధాని అవినీతి.. మోసం.. మని లండరింగ్, మార్కెట్ మానిపు లేషన్ వాటితో దేశ ప్రతిష్ట దెబ్బతిసిన దేశ ద్రోహుల పార్టీ బిజెపి అని ముఖ్య మంత్రి విమర్శించారు.
పోలీసులు అడ్డుకోవడం తో రోడ్డు పై ధర్నా చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కార్యక్రమం లోఏఐసీసీ పరిశీలకులు దీప దాష్ మున్సి,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్ర మార్క, రాష్ట్ర మంత్రులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే లు,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొన్నారు. హైదరాబాద్ ఇంచార్జ్ అమీర్..

👉టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం* .
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆద్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ఎత్తున నాయకుల కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారితో నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు,మహిళ కాంగ్రెస్ నాయకులు,మైనారిటీ నాయకులు,ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు,NSUI నాయకులు,INTUC నాయకులు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.
⭐ నేడు కేంద్ర పౌరవిమానయాన మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకల్లో సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి పాల్గోని,జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ..
ఢిల్లీలో పోర్ట్ షిప్పింగ్ మరియు జలమార్గాల కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .ఒంగోలు రూరల్ మండలంలోని గుండాయపాలెం నుండి సముద్ర తీరానికి వెళ్లే మార్గంలో బకింగ్ హామ్ కెనాల్ మీద 17 కోట్ల రూపాయల ఖర్చుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసి నదిగా కోరినారు.. * స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్*
⭐ ఆంధ్రప్రదేశ్ లో రైతుల నైపుణ్యాభివృద్ధి పధకాలపై మాగుంట ప్రశ్న..
దేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశం జిల్లాలో రైతుల నైపుణ్యాభివృద్దికి అమలుచేయుచున్న పధకాలు, లబ్ధిదారులు, నిధుల కేటాయింపు, చేసిన ఖర్చు మరియు అవగాహన పెంపుకు ప్రచార కార్యక్రమాల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయక మంత్రి, రాంనాథ్ ఠాకూర్ సమాధానమిస్తూ –
ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశం జిల్లాలో రైతులకు, వ్యవసాయ మహిళలకు మరియు యువతకు నూతన వ్యవసాయ సాంకేతికలు అందింఛి ఆర్ధికంగా ఎదుగుటకు పలు కార్యక్రమాల ద్వారా శిక్షణా తరగతులు, ప్రదర్శనలు, సందర్శనల ఏర్పాటుకు పలు పధకాలు మరియు కార్యక్రమాలను కేద్రం అమలుచేయుచున్నదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో 2019-20 నుండి 2023-24 వరకు కేంద్రం వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ATMA) కార్యక్రమం క్రింద, రూ. 41.61 కోట్ల వ్యయంతో 5,74,817 మందికి, కృషి విజ్ఞాన్ కేంద్ర (KVK) కార్యక్రమం క్రింద 2,35,514 మందికి, గ్రామీణ యువత నైపుణ్య శిక్షణ ((STRY) కార్యక్రమం క్రింద రూ.55.38 కోట్లతో 2,316 మందికి, వ్యవసాయ యాంత్రీకరణ మిషన్ (SMAM) కార్యక్రమం క్రింద రూ.7,398.74 కోట్లతో 11,042 మందికి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ((RKVY) కార్యక్రమం క్రింద 165 మందికి, పి.యం. కౌశల్ వికాస్ యోజన (PMKVY) కార్యక్రమం క్రింద 4,515 మందికి, జాతీయ గ్రామీణ నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత (NRLM) క్రింద 97 మందికి మరియు కృషి సఖిస్ కార్యక్రమం క్రింద 1,927 మంది రైతులకు శిక్షణ మరియు నైపుణ్య శిక్షణ ఇవ్వబడిందని తెలిపారు.
ప్రకాశం జిల్లాకు సంబంధించి పి.యం. కౌశల్ వికాస్ యోజన (PMKVY) కార్యక్రమం క్రింద 645 మందికి శిక్షణ, కృషి సఖిస్ కార్యక్రమం క్రింద 94 మందికి శిక్షణ ఇవ్వబడిందని మరియు జాతీయ గ్రామీణ నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత (NRLM) క్రింద 6 మందికి డ్రోన్ల శిక్షణ ఇవ్వబడిందని కేంద్ర మంత్రి తెలియజేశారు.
⭐ ప్రజల వద్దకే అధికార యంత్రాంగం*
*రెవిన్యూ సదస్సుల ద్వారా రైతులు ఎదుర్కొనుచున్న సమస్యలకు పరిష్కారం.*గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చునని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొమరోలు మండలం, రాజుపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఎన్దీయే ప్రభుత్వం అడుగులు వేస్తుందని,గ్రామాల్లో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వచ్చి, వారి సమస్యలను పరిష్కారం చేస్తుందన్నారు. పాస్ బుక్ లో పేరు మార్పులు, ఆన్ లైన్ సమస్యలు, రహదారి సమస్యలు, వంటి సమస్యలను రెవిన్యూ సదస్సులో పరిష్కారం చేసుకోవచ్చునన్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి,స్థానిక మాజీ ఎంపీటీసీ గోడి ఓబుల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవ రెడ్డి,నాయకులు అధికార సిబ్బంది,ప్రజలు పాల్గోన్నారు.

⭐మెల్లంపూరి వారి కళ్యాణంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*..*కొమరోలు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో మెల్లంపూరి సుబ్బారావు ల కుమార్తె చి.ల.సౌ సాయి హర్షిత, చి.సునీల్ కుమార్ లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.
*నియోజకవర్గ ఇన్చార్జి సనావుల్లా ఖాన్*
👉ఈరోజు కంభం మండలంలోని నర్సిరెడ్డి పల్లె మరియు ఎల్ కోట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అయినటువంటి స్వరూప మాట్లాడుతూ రబి సీజన్ కు సంబంధించి ప్రతి ఒక్క రైతు వాళ్లు వేసిన యొక్క పంటలను ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఇంకా మొన్న వర్షాలకు పంటల యొక్క స్థితిగతులను గమనించి వారికి సూచనలు అందించారు సెనగ పంట ఎక్కువ వర్షం కారణంగా కింది కొమ్మల నుంచి ఎర్రగా పోవడం జరుగుతుందని దీనికి నివారణగా ప్రోక్లైమ్ దీనితో పాటుగా 13 0 45 కానీ 19.19.19 కానీ స్ప్రే చేసుకోవాలని తెలియజేశారు. కంభం రిపోర్టర్ ఎన్ వెంకట్

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..