👉 ఆపరేషన్ వైసీపీ.. బాబు మాస్టర్ ప్లాన్?
ఆపరేషన్ వైసీపీ.. బాబు మాస్టర్ ప్లాన్?
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం వైసీపీని టార్గెట్ చేస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. వైసీపీ ఓటమి పాలైనా అందులో బలమైన నాయకులు ఉన్నారు. స్ట్రాంగ్ లీడర్స్‌ని ఎంపిక చేసుకుని మరీ చంద్రబాబు వారిని టీడీపీలోకి తీసుకుంటున్నారు. అలా వస్తున్న వారి పట్ల సొంత పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా వారికి నచ్చచెప్పి మరీ పార్టీ తీర్థం ఇస్తున్నారు. అయితే ఇదంతా వైసీపీని బలహీనం చేయడానికేనని తెలుస్తోంది.
👉 ప్రియాంక గాంధీకి తొలి సవాల్! కాంగ్రెస్ నుంచి ప్రియాంక తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పేర్లతో కూడిన లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలపై నియమించిన సంయుక్త పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ నుంచి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలి సవాల్ ను ఎదుర్కొబోతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ జమిలి ఎన్నికపై ఏర్పాటయ్యే సంయుక్త పార్లమెంట్ కమిటీ (జేపీసీ) సభ్యురాలిగా కాంగ్రెస్ తరఫున ఉంటారని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 17న లోక్ సభలో ప్రవేశపెట్టిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చించి ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
ఈ సమావేశాల్లో చివరి రోజైన డిసెంబర్ 20 శుక్రవారం సాయంత్రంలోగా స్పీకర్ ఓంబిర్లా జేపీసీ ఏర్పాటు చేయాల్సివుంది. జేపీసీలో సభ్యులుగా ఎవరెవరు ఉంటారనే విషయమై పేర్లు సూచించాలని స్పీకర్ ఆయా పార్టీలను కోరారు. జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్ సభ నుంచి 21 మందికి అవకాశం ఉంటుంది. సభలో పార్టీల బలాబలాలు ఆధారంగా సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. సభలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి ఎక్కువ మంది సభ్యులను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం లభించనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తోపాటు విపక్షంలోని కొన్ని పార్టీలు, ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మినహా మిగిలిన పార్టీలు తమ పార్టీ తరఫున జేపీసీలో సభ్యులుగా ఉండనున్న ఎంపీల పేర్లను స్పీకర్ ఓం బిర్లాకు నివేదించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పేర్లతో కూడిన లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరులో ఒకరు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కాగా, మరొకరు మనీశ్ తివారీ పేర్లను సూచించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోని టీడీపీ నుంచి అమలాపురం పార్లమెంట్ సభ్యుడు హరీశ్ బాలయోగి, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన (షిండే) పార్టీ తరఫున మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేర్లు సిఫార్సు చేశారు. విపక్షంలో డీఎంకే పార్టీ ఎంపీలు విల్సన్, సెల్వ గణపతి, టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే పేర్లను స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు చెబుతున్నారు. ప్రియాంకకు సవాల్ జేపీసీలో సభ్యురాలు కాబోతున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఇది తొలి సవాల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. గత దశాబ్దకాలంగా ఈ దిశగా అడుగులు వేస్తోంది. సొంతంగా బలం లేకపోయినా, మూడోంతుల మెజార్టీ సాధించాల్సివున్నప్పటికీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణకు బిల్లు ప్రవేశపెట్టింది. సంపూర్ణ మెజార్టీ లేనందున జేపీసీ నియమించి ఏకాభిప్రాయం తేవాలని ప్రయత్నిస్తోంది. అయితే జేపీసీలో ప్రభుత్వ ఎత్తుగడలను అడ్డుకోవాల్సిన బాధ్యత విపక్షంపై ఉంది. జమిలి ఎన్నికలు తేవాలని బీజేపీ ఎంత బలంగా కోరుకుంటుందో.. ఇండియా కూటమి పార్టీలు అంతే వ్యతిరేకత చూపుతున్నాయి. విపక్షంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ దీనికి నాయకత్వం వహించాల్సివుంటుంది. ఈ బాధ్యతను అగ్రనేత ప్రియాంకకు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ తాజా సమావేశాల్లో అనర్గళంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు జేపీసీలోనూ అంతే సమర్థంగా పనిచేసి విపక్షం ఆశలను నెరవేర్చాల్సివుంది. దీంతో ప్రియాంక పాత్రపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
అగ్రనేత ప్రియాంక గాంధీకి ఇది తొలి సవాల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. గత దశాబ్దకాలంగా ఈ దిశగా అడుగులు వేస్తోంది. సొంతంగా బలం లేకపోయినా, మూడోంతుల మెజార్టీ సాధించాల్సివున్నప్పటికీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణకు బిల్లు ప్రవేశపెట్టింది. సంపూర్ణ మెజార్టీ లేనందున జేపీసీ నియమించి ఏకాభిప్రాయం తేవాలని ప్రయత్నిస్తోంది. అయితే జేపీసీలో ప్రభుత్వ ఎత్తుగడలను అడ్డుకోవాల్సిన బాధ్యత విపక్షంపై ఉంది. జమిలి ఎన్నికలు తేవాలని బీజేపీ ఎంత బలంగా కోరుకుంటుందో.. ఇండియా కూటమి పార్టీలు అంతే వ్యతిరేకత చూపుతున్నాయి. విపక్షంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ దీనికి నాయకత్వం వహించాల్సివుంటుంది. ఈ బాధ్యతను అగ్రనేత ప్రియాంకకు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ తాజా సమావేశాల్లో అనర్గళంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు జేపీసీలోనూ అంతే సమర్థంగా పనిచేసి విపక్షం ఆశలను నెరవేర్చాల్సివుంది. దీంతో ప్రియాంక పాత్రపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
👉కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..!- WHO హెచ్చరిక!!😲😲😲
1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ఈ భూమ్మీద ఏదైనా ఒక అంటువ్యాధి వచ్చినప్పుడల్లా అది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఇదే ఈ విషయం వెల్లడైంది. 1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. స్పానిష్ ఫ్లూని “మదర్ ఆఫ్ ఆల్ ఎపిడెమిక్స్” అని కూడా అంటారు. దీని కారణంగా 5 కోట్లకు పైగా మరణాలు సంభవించాయి.
మొన్నటికీ మొన్న కరోనా వైరస్ కూడా అంతే ప్రాణాంతకంగా మారింది.. ఇది మిలియన్ల మంది ప్రజలను మృత్యుఒడిలోకి నెట్టింది. దాదాపు మొత్తం ప్రపంచాన్ని వణికించింది. అయినప్పటికీ, ఈ ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ‘X’ వ్యాధిగా చెబుతున్న ఈ వ్యాధిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దీన్ని నివారించేందుకు ప్రపంచం మొత్తం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని WHO హెచ్చరించింది. ‘X’ వ్యాధి గురించిన భయంకరమైన విషయం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించింది.
ఈ పేరులేని అంటువ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఏ రూపంలోనైనా దాడి చేయగలదని WHO హెచ్చరిస్తోంది. ఈ దాడి ఎవరిపై ఎక్కడ మొదలవుతుందో వైద్య శాస్త్రానికి కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది. అందరూ ప్రజలంతా సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని చెబుతున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లను తగ్గించి మేలైన పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
👉శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్
రెండు వారాలుగా కిమ్స్‌లో చికిత్స
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉంది కిమ్స్ వైద్యులు చైతన్, విష్ణుతేజ్ నిన్న రాత్రి వెల్లడించారు. ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.
👉టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా*
*టీడీపీలో చేరేందుకు ముహూర్తం బాగా లేకపోవడంతో చేరికను వాయిదా వేసుకున్న ఆళ్ల నాని*
*ఆన్ లైన్ ద్వారా టీడీపీ సభ్యత్వం తీసుకున్న మాజీ మంత్రి ,వైసీపీ నేత ఆళ్ల నాని.
*రేపు లేదా ఎల్లుండి ఆయన టీడీపీలో చేరే అవకాశం*
👉కడప జిల్లా..బద్వేల్ గోపవరం మండలం సోమశిల ముంపు ప్రాంత నిరుద్యోగులను డబ్బులు తీసుకొని ఉద్యోగాల పేరుతో మోసం చేశాడంటూ బాధితుల ర్యాలీ…
సుమారుగా 600కు పైగా బాధితుల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాల పేరుతో మోసం…
బ్రోకర్ రామస్వామి డౌన్ డౌన్ అంటూ స్థానిక టీటీడీ కళ్యాణ మండపము వద్ద నుండి రామ స్వామి ఇంటి వరకు ర్యాలీగా వచ్చిఇంటి ముందు బైఠాయించిన బాధితులు…
ప్రభుత్వ అధికారులు అతనిపై ఎంక్వయిరీ వేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన…
👉 శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు ప్రవీణ్.నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నూర్జహాన్ అనే యువతిని 12 ఏండ్లుగా ప్రేమించి మోసం చేసిన ప్రవీణ్
రెండు సార్లు అబార్షన్ చేయించి,పెండ్లి చేసుకోకుండా మోసం చేసిన ప్రవీణ్..ప్రవీణ్ ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన నూర్జహాన్.
👉కాకినాడ తనిస్క్ షో రూమ్ లో… ఉద్యోగిని గన్ తో బెదిరించి.. బంగారం దోచుకుని వెళ్లిన దొంగ.
తక్షణమే పోలీసులు స్పందించినా .. వార్పు రోడ్డు.. ఫారెస్ట్ ఆపీస్ దగ్గర దొంగను పట్టుకొన్న…ట్రాఫిక్ . పోలీసులు..
దొంగ నుండి బంగారం.. గన్ స్వాధీనం.
స్వాధీనం చేసుకున్న గన్… డమ్మీ గన్ గా గుర్తించిన పోలీసులు..దొంగను 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
👉గద్దర్ జాతీయ సేవ పురస్కారం అందుకున్న మోతే కృష్ణ* తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, పి.గన్నవరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు ప్రధానం.*
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధనౌక గద్దర్ జాతీయ సేవా పురస్కారం – 2024 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సాయి తేజ జూనియర్ కళాశాల అన్న బత్తుల రామామణి కళా వేదిక నందు నిర్వహించడం జరిగింది . భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన మోతే కృష్ణ గారు యూత్ సర్కిల్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ చేతులమీదుగా గద్దర్ జాతీయ సేవా పురస్కారాన్ని మోతే కృష్ణకి అందజేసి ఘనంగా సత్కరించారు.
👉 పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేసిన వ్యక్తి..!!..ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్న హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు.
పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్న వంశీ.
పెళ్లిచూపుల అనంతరం కట్నకానుకలు తీసుకుని ముఖం చాటేసిన మోసాలకు పాల్పడ్డ వంశీ.
ఓ మహిళా డాక్టర్‌ను రూ.50 లక్షల మేర మోసం చేయడంతో బయట పడ్డ అతడి బాగోతాలు…
👉 పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ శృతి ఆత్మహత్య..!!!
పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ శృతి ఆత్మహత్య
తెలంగాణ : జానపద పాటలతో ఫేమస్ అయిన సింగర్ శృతి మృతి చెందారు. పెళ్ళైన 20 రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో శృతి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించారు. వేధింపులు తాళలేక శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
👉 ధ్రువపత్రాలపై జగన్ ఫోటో.. హైకోర్టులో విచారణ
ధ్రువపత్రాలపై జగన్ ఫోటో.. హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ : కుల, స్థానికత, జనన ధ్రువపత్రాలపై జగన్, నవరత్నాల లోగోపై హైకోర్టు విచారించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ధ్రువపత్రాలపై సీఎం బొమ్మ ముద్రించలేదన్నారు. వాటిపై కేవలం జాతీయ చిహ్నమే ముద్రించాల్సి ఉందన్నారు. ధ్రువపత్రాలపై జగన్ ఫోటోతో పాటు నవరత్నాల పథకం లోగోను తొలగించామని.. ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బహుజన సోసైటీ అధ్యక్షుడు బాలకోటయ్య వేసిన పిటిషన్‌పై విచారణ ముగించినట్టు ధర్మాసనం తెలిపింది.
👉 కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల..
ఆంధ్రప్రదేశ్ : కానిస్టేబుల్ స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నిన్న రాత్రి పోలీస్ నియామక మండలి అందుబాటులో ఉంచింది. ఈ నెల 29వ తేదీ మ. 3గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEC 30 నుంచి FEB 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నబర్లను ఆఫీసు (ఉ.10-సా.6 గం.) సమయంలో సంప్రదించండి. వెబ్‌సైట్: https://slprb.ap.gov.in/
👉 అల్లు అర్జున్ చెప్పేవన్నీ అబద్ధాలా !..అల్లు అర్జున్ టీమ్ శ్రీతేజ్ కుటుంబంతో టచ్ లో ఉన్నామని, వైద్యఖర్చులు భరిస్తున్నామని కూడా చెప్పినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఇటీవల సింగపూర్ నుంచి నాలుగు లక్షల రూపాయల కాస్లీ ఇంజెక్షన్ సైతం తెప్పించినట్లు వార్తలు వచ్చాయి.*అయితే.. తాజాగా.. హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్ శ్రీతేజ్ ను పరామర్శించినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త సీరియస్ గా ఉందని.. వైద్యులు మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని అన్నారు. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామెజ్ అయిందని అన్నారు. బాలుడి ఆస్పత్రి ఖర్చులన్ని రేవంత్ సర్కారు భరిస్తుందని చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన వార్తలలొ నిలిచింది.
ఇన్నిరోజులు అల్లు అర్జున్ టీమ్ .. బాలుడి ఆస్పత్రి ఖర్చులు భరిస్తున్నామని.. ఇంజెక్షన్ తెప్పించామని చెప్పినవన్ని అబద్దాలేనా.. అంటూ కొంత మంది సోషల్ మీడీయాలో అల్లు అర్జున్ ను ఏకీపారేస్తున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో అబద్దాలు చెప్పేందుకు నోరు ఎలా వస్తుందని కొందరు మండిపడుతున్నారంట.
ఆపరేషన్ వైసీపీ.. బాబు మాస్టర్ ప్లాన్?…ప్రియాంక గాంధీకి తొలి సవాల్! … కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..! – WHO హెచ్చరిక!…టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా… ధ్రువపత్రాలపై జగన్ ఫోటో- హైకోర్టులో విచారణ.. శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ .. ఉద్యోగాల పేరుతో మోసం చేశాడంటూ బాధితుల ర్యాలీ … అల్లు అర్జున్ చెప్పేవన్నీ అబద్ధాలా ? .. గద్దర్ జాతీయ సేవ పురస్కారం అందుకున్న మోతే కృష్ణ* … శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు… పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేసిన వ్యక్తి..
Recent Posts