ఎంపీల తోపులాట.. అంబేడ్కర్ పై షా వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకే – షర్మిల… బీజేపీని వణికించిన శీతాకాలం! … ప్రైవేట్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి…అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత … మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్…తిరుపతిలో‌ వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి..

👉 ఎంపీల తోపులాట.. అంబేడ్కర్ పై షా వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకే: షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నాయకుడూ గుర్తించని కోణాన్ని ఆమె గుర్తించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నాయకుడూ గుర్తించని కోణాన్ని ఆమె గుర్తించారు. తాజాగా ముగిసిన పార్లమెంటు సమాశాలు అత్యంత వాడివేడిగా సాగిన సంగతి తెలిసిందే. దీంతోపాటు గురువారం పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీల తోపులాట అత్యంత వివాదాస్పదం అయింది.
అదానీ, మణిపూర్, ఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు అత్యంత హాట్ హాట్ గా సాగాయని చెప్పడంలో తప్పు లేదు. గత నెల 25న మొదలైన ఈ సమావేశాలు గురువారం వరకు ప్రతి రోజూ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇక సరిగ్గా సమావేశాలకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు, మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగడం, ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం మీద రగడ ఖాయం అని భావించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికల బిల్లులు తోడయ్యాయి. లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు (జమిలి ఎన్నిక బిల్లును) లోక్ సభ గత శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. మంగళవారం రాజ్యసభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ఇది రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అన్ని పక్షాలూ విస్తృత చర్చ కోరుతున్నందున ప్రభుత్వం జేపీసీకి పంపింది. చర్చలో రచ్చ కాగా బుధవారం పార్లమెంటులో చర్చ సందర్భంగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా.. అంబేడ్కర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి పెద్దఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గురువారం పార్లమెంటు ప్రాగణంలో ఎంపీల తోపులాట జరిగింది. దీనిపైనే షర్మిల స్పందించారు. అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి కల్పించారని ఆరోపించారు. షా వ్యాఖ్యల వివాదం నుంచి పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు.

👉 బీజేపీని వణికించిన శీతాకాలం!… గత సమావేశాలతో పోల్చితే ఈసారి మోడీ మార్క్ అయితే అంతగా కనిపించలేదనే అంటున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా శుక్రవారం వాయిదా పడ్డాయి. *నవంబర్ 25 నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలో బీజేపీ అనుకున్న విధంగా బిల్లులను అయితే పాస్ చేయించుకోలేక పోయింది అని అంటున్నారు. జమిలి ఎన్నికల బిల్లుని ఇదే పార్లమెంట్ లో చర్చకు పెట్టి ఆమోదించుకోవాలని అనుకున్నా విపక్షాల వ్యతిరేకత మధ్యన చివరిలోనే దానిని ప్రవేశపెట్టి జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు పంపించారు.
*అదే విధంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టం అవుతుందని శీతాకాల సమావేశాలే దానికి ముహూర్తం అని ప్రచారం సాగినా జేపీసీకి మరో మూడు నెలలు గడువు ఇచ్చి దీని మీద అధ్యయనాన్ని కొనసాగించడానికి వీలు కల్పించారు. ఇక పార్లమెంట్ లో రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా చర్చ మాత్రం సాగింది. అయితే ఇక్కడ కూడా అధికార బీజేపీ విపక్ష ఇండియా కూటముల మధ్య విమర్శల జోరే కనిపించింది. రాజ్యాంగాన్ని ఎవరు గౌరవించారు, ఎవరు అవమానించారన్న దాని మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. *ఇక శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతూనే అదానీ మీద చర్యలకు డిమాండ్ చేస్తూ సభను స్థంభింప చేసేందుకు విపక్షాలు చూస్తూ వచ్చాయి. దాంతో సభ ప్రతీ రోజూ దాదాపుగా వాయిదా పడుతూనే వస్తోంది. పని గంటలు కూడా గతంతో పోలిస్తే ఈసారి తగ్గాయని అంటున్నారు.

ఈసారి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పెద్దగా ఫోకస్ కాలేదు. ప్రియాంకా గాంధీ *మొదటిసారి ఎంపీగా నెగ్గి సభకు రావడంతో ఆమె తన ఉనికి బలంగా చాటుకున్నారు. ముఖ్యంగా రాజ్యాంగం మీద చర్చలో ప్రియాంకా గాంధీ మంచి స్పీచ్ ఇచ్చారని ప్రశంసలు వచ్చాయి. అదే విధంగా మోడీ ప్రభుత్వం మీద ఆమె ధీటైన విమర్శలు చేశారు అని కూడా అంటున్నారు. ప్రధాని మోడీ ఈ సారి సమావేశాలలో రాజ్యాంగం మీద చర్చలోనే కీలకమైన ప్రసంగం చేశారు. అయితే గత సమావేశాలతో పోల్చితే ఈసారి మోడీ మార్క్ అయితే అంతగా కనిపించలేదు అనే అంటున్నారు.*ఈసారి మొత్తం సమావేశాలలో హైలెట్ ఏంటి అంటే బీజేపీలో ఎన్డీయేలో కీలకమైన బలమైన నేతగా ఉన్న అమిత్ షాను ఇరుకున పెట్టడం. ఆయన అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు అంటూ విపక్షాలు సభ లోపలా బయటా కూడా ఆందోళనలు చేశాయి. బహుశా ఈ ఆందోళనలు శీతాకాలం సమావేశాలు పూర్తి అయినా మరింత కాలం కొనసాగే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఏది ఏమైనా మోడీ తరువాత అంతటి లీడర్ అయిన అమిత్ షా పదేళ్ళ పార్లమెంటరీ అనుభవం లో తొలిసారి విపక్షాలకు ఇలా దొరికి ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎన్డీయే ప్రభుత్వాన్ని అదాని ఇష్యూతో మొదలెట్టి అంబేద్కర్ ఇష్యూ దాకా లాగి విపక్షం అయితే వణికించింది అని విశ్లేషిస్తున్నారు. ఈసారి సమావేశాలలో అయితే బీజేపీ అనుకున్నది సాధించలేకపోయిందన్న చర్చ సాగుతోంది. విపక్షం మాత్రం తాము అదానీకి మోడీ సర్కార్ కి అండగా ఉందని ఎస్టాబ్లిష్ చేయగలిగామని అలాగే అంబేద్కర్ విషయంలో బీజేపీ మనువాద ధోరణిని ఎండగట్టామని సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎవరు ఏమి అనుకున్నా ఈసారి శీతాకాల సమావేశాలు మాత్రం ప్రజా సమస్యల మీద పెద్దగా చర్చించలేదని అంటున్నారు. మేధావులు, రాజకీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. సభలలో రచ్చ రభస ఎక్కువ అవుతోందని, ఆఖరికి పార్లమెంట్ బయట బాహాబాహీ వంటి దృశ్యాలు కూడా గతంలో చూడనివి చోటు చేసుకుంటున్నాయని ప్రజాస్వామ్య ప్రియులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
👉 ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ (FAIFA)వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జాతీయ రైతుల దినోత్సవం” కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్,టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, ఫైఫా ప్రెసిడెంట్ జవరే గౌడ ,జనరల్ సెక్రటరీ PS మురళి బాబు , మాజీ శాస్త్రవేత్తలు డా.టండన్,డా.త్రివేది మరియు పలువురు ప్రముఖులు రైతులు,నాయకులు.
👉 గ్రీన్ హైవేస్ పాలసీ పై (రోడ్లపై మొక్కలు నాటే విధానం) మాగుంట ప్రశ్న…
దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశం జిల్లాలో గత 5 సంవత్సరాలలో గ్రీన్ హైవే పాలసీ (జాతీయ రోడ్లపై మొక్కలు నాటే విధానం) క్రింద ప్రాజెక్టులు, ఉపాది అవకాశాలు, నిధులు, అవగాహన కార్యక్రమాలు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ శాఖ మంత్రి, నితిన్ జైరాం గడ్కరి సమాదానమిస్తూ –
గ్రీన్ హైవే పాలసీ వలన కాలుష్యం మరియు ప్రమాదాలు తగ్గునని మరియు అందరి భాగస్వామ్యంతో హైవేల కారిడార్ల పచ్చదానాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యమని, “వార్షిక మొక్కల కార్యాచరణ ప్రణాళిక” ప్రకారం దేశంలోని జాతీయ హైవే రోడ్ల ఇరువైపుల మరియు మధ్య మొక్కలు నాటడం జరుగుచున్నదని తెలిపారు.
గత 5 సంవత్సరాలలో దేశంలో రూ.322.68 లక్షల చిన్న మొక్కలు నాట బడగా, ఆంధ్రప్రదేశ్ లో 9.51 లక్షలు, మరియు ప్రకాశం జిల్లాలో 59,436 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. మొత్తం 62,660 కిలో మీటర్ల మేర మొక్కలు నాటే పని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఖచ్చితమైన ఉపాది – లబ్దిదారుల సంఖ్య లేనప్పటికీ, మొక్కల నాటడం, నర్సరీల అభివృద్ధి, నిర్వహణ మరియు సంబందిత కార్యకలాపాలకు ప్రత్యక్షంగా – పరోక్షంగా గణనీయంగానే ఉద్యోగావకాశాలు ప్రధానంగా గ్రామీణ ప్రజలకు కల్పించబడుచున్నాయని, దీంతో సామాజిక ఆర్ధిక అభివృద్ధి కూడా జరుగుచున్నదని తెలిపారు.
2018-19 నుండి 2024-25 వరకు రూ.602.42 కోట్లు కార్యక్రమాల క్రింద ఖర్చు చేయబడిందని, “ఏక్ పెద్ మా కే నాం” ప్రచారంతో 17-09-2024 ఒక్క రోజే 21,773 మంది ప్రజలతో 1,58,762 మొక్కలు నాటడం జరిగిందని మరియు చిన్న నేలలు, పట్టణాలలో రద్దీ ప్రదేశాలలో,ధార్మిక ప్రదేశాలలో మరియు బ్రిడ్జీల క్రింద కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టబడుచున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు.*స్టాఫ్ రిపోర్టర్ రహమాన్…
👉కలెక్టర్ మానవత్వం*
*పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం*
*ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు. కలెక్టర్ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో… ఓ చిరునవ్వు నవ్వారు. దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది. స్పందించిన కలెక్టర్.. నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటా ఇచ్చి వెళ్లారు. తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసిన కలెక్టర్, జమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ.1లక్ష వ్యాపార రుణం చెక్కును గురువారం అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యచరణ చేశారు.*
👉హైదరాబాద్**పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి*
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం, కాలేజీకి వెళ్తున్న ఇద్దరి విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి మరొకరికి తీవ్ర గాయాలు. మూతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోసం గాలింపు.
👉 డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి చర్చించిన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్.
👉 *అమరావతి :*
పుష్ప సినిమా తరహాలో అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత. వ్యాన్ పై కప్పులో టార్పన్లలో గుట్టుగా గంజాయి ప్యాక్ చేసిన స్మగ్లర్లు…
👉ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో‌ వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి…హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం..గుట్టురట్టుచేసిన పోలీసులు..
వేదాంతపురం పంచాయతీలో ఒక హోం స్టే లో పోస్టిట్యూషన్ నిర్వహణ… సమాచారం తో పోలీసుల దాడులు…
ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు యువకులు అరెస్టు…
తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపుం దగ్గర ఉన్న ఒక హోంస్టే లో పోస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారం తో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేసారు.ఈ దాడుల్లో నలుగురు యువతులు, ముగ్గురు యువకులునీ అదుపులో తీసుకున్నారు.అదుపులో తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించామన్నారు.. స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష..

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..