👉 బీజేపీ నేతలు వారే కొట్టుకుని..నెపం రాహుల్‌గాంధీపై నెడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శక్రవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని,మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో బీజేపీ దాడి డ్రామాకు తెరతీసిందన్నారు. అంబేడ్కర్, రాజ్యాంగంపై బీజేపీకి, ఆర్‌ఎ్‌సఎ్‌సకు ఎప్పుడూ చులకన భావమేనని అన్నారు. అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తొలగించాలంటూ ‘ఎక్స్’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందన్నారు.దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాదిమంది దళితులు, అణగారిన వర్గాల జీవితాలను మార్చేసిన గొప్పవ్యక్తి అంబేడ్కర్‌ను బీజేపీ అవమానిస్తూనే ఉందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం కాషాయ మూకపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు.
👉ఆయుష్మాన్ భారత్ స్కీము పై బాగానే ప్రచారాలు చేసిన బిజెపి ప్రభుత్వం గుజరాత్ లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గుండె సమస్య లేని కొందరిని గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్స చేసి బిల్లులు పెట్టి వారి పేరు మీద ఆయుష్మాన్ స్కీం డబ్బులు స్వాహా చేసినట్లు సమాచారం.👉గుండె సమస్యలు లేని వారికి వైద్యం చేసి వీరిపై బిల్లులు పెట్టిన 17 మందిలో 5 మంది ICU లో ఇద్దరు మృతి.
👉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మెత్తం 2,47,097 కేసులు, జిల్లా,సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఈ నెల 19న మేఘ్వాల్ రాజ్యసభకు సమాచారం అందించారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 623 మంది న్యాయాధికారులు ఉండాల్సి ఉండగా 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అలాగే సుప్రీం కోర్టులో 82,640 పెండింగ్ కేసులు ఉండగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో 61,80,878, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4,62,34,646 పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.
👉 అభిఖ్య జి మడోన్నా ..గర్వంగా ఉంది..
కూతుర్ని ఉద్దేశించి దళాధిపతి విజయ్ కుమార్ IAS (R) ట్వీట్
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ G Srkr IAS (R) పుత్రికోత్సాహంతో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న విజయ్‌కుమార్.. తన చిన్న కుమార్తె కుమారి అభిఖ్య జి మడోన్నా అత్యంత ప్రసిద్ధి పొందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ హ్యూమన్ రైట్స్ పూర్తి చేసుకుని ఇవాళ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొనే స్నాతకోత్సవానికి హాజరయ్యారు.ఆమె స్నాతకోత్సవం కార్యక్రమంలో విజయ్‌కుమార్ సతీసమేతంగా పాల్గొన్నారు.
‘‘అభిఖ్య జి మడోన్నా.. నీ ఎదుగుదలను చూడటం చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ హ్యూమన్ రైట్స్ పూర్తి చేసుకుని గ్రాడ్యుయేట్ పట్టా పొందడం నాకు గర్వకారణం.నీ భవిష్యత్ వెలుగుమయం కావాలి .. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటూ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చదివిన యూనివర్సిటీ నుంచి తన కూతురు పట్టా పొందడం గర్వంగా ఉందంటూ విజయ్‌కుమార్ ట్వీట్ చేశారు.ఆయన గురువారం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.తన చిన్న కుమార్తె కుమారి అభిఖ్య జి మడోన్నా అత్యంత ప్రసిద్ధి పొందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ హ్యూమన్ రైట్స్ పూర్తి చేసుకుని గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్న సందర్భంగా ఆమె స్నాతకోత్సవం కార్యక్రమంలో విజయ్‌కుమార్ సతీసమేతంగా పాల్గొన్నారు. తన కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ హ్యూమన్ రైట్స్ పూర్తి చేసుకుని పట్టా పొందడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చదివిన లండన్ స్కూల్ ఎకనామిక్స్ యూనివర్శిటీ నుంచి తన కూతురు మాస్టర్ డిగ్రీ పూర్తి చేయడం గర్వకారణమని తెలిపారు.అంబేద్కర్ స్ఫూర్తితో ఆమెను ఇక్కడ చదివించినట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
👉కడపజిల్లా…పొరుమామిళ్ళ
బంగారు వ్యాపారస్తులకు 60 లక్షలు కుచ్చు టోపీ పెట్టిన గోల్డ్ షాప్ యజమాని మహబూబ్ బాషా..😲😲😲
పోరుమామిళ్లలో పట్టణం లోని వసీం జ్యువెలర్స్ యజమాని మెహబూబ్ భాష తన భార్య హర్షత్ ఉన్నీషా 60 లక్షలు విలువచేసే వెండి బంగారు ప్రొద్దుటూరు, చాగలమర్రి, బద్వేల్ , మైదుకూరు, మరియు తదితర 12 మంది వద్ద బంగారు వెండి కొనుగోలు చేసి వ్యాపారిస్తులకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు.విషయం తెలుసుకున్న
ప్రొద్దుటూరుకు చెందిన గోల్డ్ షాప్ యజమానులు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డికి ఫిర్యాదు చేశారు.ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ప్రొద్దుటూరు కు చెందిన కొంతమంది వ్యాపారస్తులు దగ్గర గోల్డ్, వెండి తీసుకొని వచ్చి అమ్ముకొని ప్రతి నెల తిరిగి కొంత కొంత డబ్బు చెల్లించేవాడని నెల క్రితం ప్లాన్ ప్రకారం షాపు యజమాని సుమారు 60 లక్షలు విలువచేసే బంగారుతో వెండితో పరారు కావడంతో ప్రొద్దుటూరుకి చెందిన గోల్డ్ యజమానులు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
👉 పల్నాడు జిల్లా పోలీస్..పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు
👉 ఈ సందర్భంగా ఎస్పీ కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ
పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు.
👉 పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి,సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, ఫలితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
👉 మహిళలు, బాలికలు, చిన్నారుల పిర్యాదులు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి గాని,సిబ్బంది గాని ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు.
👉 “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి, పోర్టల్ లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలన్నారు.
👉 పోక్సో కేసులు, మహిళల పై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసులు మొదలైన కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని మరియు సదరు నేరాలు అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
👉 జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రకాలు ట్రాఫిక్ సూచనలను తెలిపే సైన్ బోర్డులను అవసరమైన చోట STOP BOARDS ను ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించారు.
👉పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలి. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ప్రతిరోజు రైడ్ లు నిర్వహించాలన్నారు.
👉బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తే నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
👉ఈ నేర సమీక్షా సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిటిషన్లు, POCSO కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్ కేసులు, 174 Cr.PC కేసులు, మిస్సింగ్ కేసులు, , గంజాయి, నాటుసారా ల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షించారు.
👉 జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ 112 ఎమర్జెన్సీ నెంబర్ల నుండి వచ్చు కాల్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. కాల్ వచ్చిన సమయం మరియు సంఘటన స్థలానికి చేరుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు అధికారులను హెచ్చరించారు.
👉 రౌడీలు, సస్పెక్ట్ లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వారి ప్రవర్తన ఎలా ఉంది, వారు కొత్త వ్యక్తులను ఎవరినైనా కలుస్తున్నారా, ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంటుందా వంటి సమాచారాన్ని సేకరించుకోవాలన్నారు
👉 గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాల పై కఠినంగా వ్యవహరించాలన్నారు
👉 జిల్లాలో గాంజాను నిర్మూలించడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని అరికట్టే దిశలో ఉన్నట్లు తెలిపారు.
👉 విచారణ దశలో వున్న కేసులను సాంకేతిక పరిజ్ఞాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి వేగవంతంగా దర్యాప్తుచేసి సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలన్నారు. కోర్టులో ట్రైల్ సక్రమంగా జరిగే విధంగా సంబంధిత డిఎస్పీ, సిఐ, పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు స్వయంగా పర్యవేక్షించుకోవాలన్నారు.
సాక్షులు సరైన రీతిలో నిర్భయంగా న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పేవిధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. నిందితుడికి కోర్టు శిక్ష విధించినప్పుడే మనం బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.
👉 ఈ సమావేశంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పి అడ్మిన్ జె.వి.సంతోష్,CCS అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి గారు,AR అడిషనల్ ఎస్పీ V.సత్తి రాజు గారు,నరసరావుపేట డిఎస్పి K. నాగేశ్వరరావు,సత్తెనపల్లి డిఎస్పి M.హనుమంతరావు,గురజాల డిఎస్పీ జగదీష్,SB -1 సిఐ B.సురేష్ బాబు,SB – 2 సిఐ P.శరత్ బాబు,RI లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
👉మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి*..డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన*..ప్రముఖ సినీ నటి శ్రీ లీల.శ్రీకాకుళం : మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ప్రముఖ సినీ నటి శ్రీ లీల కోరారు.శుక్రవారం ప్రముఖ సినీ నటి శ్రీ లీల శ్రీకాకుళంలో జి.టి. రోడ్డులో వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ,డీజీపి వారి ఉత్తర్వులు మేరకు, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు ప్రత్యేకంగా ప్రచురించిన మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలు గురించి తెలిపే డ్రగ్స్ వద్దు బ్రో మరియు సంకల్పం పోస్టర్ లను శ్రీకాకుళం పట్టణ సబ్ డివిజన్ డిఎస్పి వివేకానంద్ అందించిగా శ్రీ లీల స్ధానిక ఎమ్మెల్యే గోండు శంకర్ తో కలసి ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత మత్తు పదార్థాలు వినియోగానికి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మీ యొక్క విలువైన జీవితం సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుందని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. పోలీస్ యంత్రాంగం మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని కావున యువత చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం తీర్చిదిద్దట్లులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ క్రమంలోనే సామాజిక బాధ్యతతో ప్రజా రక్షణ కొరకు రాత్రి పగలు పోలీసు వారు విధులు నిర్వర్తిస్తున్నారని అందుకు అనుకూలంగా యువతతో డ్రగ్స్ వద్దు బ్రో అనే స్లోగాన్ని శ్రీ లీల పలికించారు.కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మహల్ యాజమాన్యం,నిర్వాహకులు,ప్రతినిధులు,పోలీసు అధికారులు పాల్గొన్నారు.
👉రోడ్డు పక్కన 52 KGల బంగారం,రూ.10 కోట్ల డబ్బు..
భోపాల్ (MP)లోని ఓ కారులో ఏకంగా 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదు దొరకడం సంచలనంగా మారింది. అడవిలో ఓ కారు పార్క్ చేసి ఉండటంతో పోలీసులు సీజ్ చేశారు. అందులోని బంగారం, డబ్బు చూసి వారి మైండ్ బ్లాంక్ అయింది. రూ.42 కోట్ల విలువైన పసిడి, రూ. 10 కోట్ల నోట్ల కట్టలు దొరికాయి. వాటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల ఐటీ శాఖ రైడ్స్ చేస్తుండటంతో అనుమానం రాకుండా ఇలా వదిలేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
👉మార్కాపురంలో…*జగనన్నకు ముందస్తు జన్మదిన వేడుకలు..మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి జన్మదిన* *వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మార్కాపురం YSRCP కార్యాలయంలో సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే అన్నా..
*నాయకులు,కార్యకర్తలు,*అభిమానుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.*అభిమానులకు,పేదలకు దుస్తుల పంపిణీ:*పార్టీ రాష్ట్ర నాయకులు,పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సౌజన్యంతో *జగనన్న జన్మదినం సందర్భంగా* *నియోజకవర్గ పరిధిలోని పేదలకు దుస్తులను అన్నా రాంబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
బీజేపీ నేతలు వారే కొట్టుకుని..నెపం రాహుల్‌గాంధీపై నెడుతున్నారు : వైఎస్ షర్మిల … “గుజరాత్ లో గుండె సమస్యలు లేని వారికి వైద్యం చేసి వీరిపై బిల్లులు పెట్టిన 17 మందిలో 5 మంది ICU లో ఇద్దరు మృతి !… ఎపి హైకోర్టులో మెత్తం 2,47,097 కేసులు,జిల్లా,సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి😱 :కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్* … పుత్రికోత్సాహంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి విజయ్ కుమార్ …డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ను ఆవిష్కరించిన సినీ నటి శ్రీ లీల … పొరుమామిళ్ళ బంగారు వ్యాపారస్తులకు 60 లక్షలు కుచ్చు టోపీ పెట్టిన గోల్డ్ షాప్ యజమాని ..నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు .. రోడ్డు పక్కన 52 KGల బంగారం,రూ.10 కోట్ల డబ్బు.. జగనన్నకు ముందస్తు జన్మదిన వేడుకలు (మార్కాపురం)..
Recent Posts