కొడాలి నానికి చెక్.. చంద్రబాబు రాజకీయ వ్యూహం ఇదేనా …! – News18 తెలుగు

అన్నా రఘు సీనియర్ కరెస్పాండెంట్

ఏపీలో 175 నియోజిక వర్గాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గంగా గుడివాడ ఉంటుందనుకోవటం అతిశయోక్తి కాదు.  గుడివాడ నియోజకవర్గం నుండి  వైసీపీ  తరపున వరుస విజయాలతో కొడాలి నాని ఎమ్మెల్యే గా గెలిచి ఈ సారి మంత్రి పదవి దక్కించుకున్నారు.   ఇదేమి ఆశ్చర్యానికి  గురి చేయక పోయిన కొడాలి నాని చంద్రబాబు మీద  చేసిన ఘాటు  వ్యాఖ్యలు ఎంతో దుమారానికి దారితీసాయి. లోకేష్ ను విమర్శించినా తీరుతో తెలుగు తమ్ముళ్ల లో ఆగ్రహం పెరిగిపోయింది ఎలాగైనా ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నానిని ఓడించి బుద్దిచెప్పాలనే కోరిక తెలుగు దేశం అభిమానుల్లో ఉంది. కార్యకర్తల్లో కోరిక అధినాయకుడి మనసులో ఉన్నట్లు ఉంది. ఎలాగయినా గుడివాడలో కొడాలి నానిని ఓడించి నోటితో కాదు ఓటుతో చెప్పాలని  వ్యూహం సిద్ధం చేస్తున్నారు అధినేత.

వర్గ పోరు నివారణలో అధినేత …..

గత కొంత కాలం గా టీడీపీలో వున్నా వర్గపోరు కొడాలి నాని గెలుపునకు కారణం. అవుతుంది. ఇప్పుడు కూడా గుడివాడలో రావి వెంకటేశ్వర రావు వర్గం కాగా మరొకటి ఎన్నారై వెనిగండ్ల రాము వర్గము జరుగబోయే ఎన్నికల్లో ఎవరికీ వారు తమకే టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు . ఈ నేపథ్యం లో వెనిగళ్ల రాము అభ్యర్థిత్వాన్ని బాబుగారు  కన్ ఫాం చేశారనే టాక్ నడుస్తున్న నేపథ్యం లో మొన్నటివరకు గుడివాడ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉండగా….. ఆయన స్థానంలో వెనిగండ్ల రాముకు అవకాశం దక్కింది అని టాక్ నడుస్తున్న నేపథ్యంలో రావి వర్గీయులు ఒకింత ఆగ్రహం తో ఉన్నారు. ఈ పరిణామాన్ని   గుర్తించిన అధిష్టానం  గుడివాడ సమస్యను పరిష్కరించే బాధ్యత మాజీ మంత్రి  కొల్లు రవీంద్ర కు అప్పగించింది.

గుడ్లవల్లేరులో జరిగిన తెలుగుదేశం ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రావి వెంకటేశ్వర రావుకు పార్టీ న్యాయం చేస్తుందని ఇప్పుడున్న పరిస్థితులలో ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి అవసరం అని అందుకే కొన్ని లెక్కల ప్రకారం వెనిగళ్ల రాము అభ్యర్దిత్వాన్ని బాబుగారు బలపరచడం జరిగిందని చెప్పిన మాజీ మంత్రి రవీంద్రను రావి వర్గీయులు ప్రతిసారి ఇలానే చెప్పి తమ నాయకుడికి అన్యాయం చేస్తుందని కార్యకర్తలు నిలదీసారు. గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని పార్టీ అధికారంలోకి రాగానే రావికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని అవసరమైతే తాను బాండ్ పేపర్ రాసిస్తానని తెలిపారు. ఈ పరిణామంతో శాంతించిన రావి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో వెనిగళ్ల రాము మాట్లాడుతూ  రావి వెంకటేశ్వర రావు త్యాగానికి రుణపడి ఉంటానని … గుడివాడలో కొడాలి నాని ఎత్తుగడలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వర రావు, వెనిగండ్ల రాములు చేతులు కలిపారు. కొడాలి నాని మీద చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో లేదో ఓటర్ లే నిర్ణయించాలి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..