డిసెంబర్ నెల వచ్చిందంటేనే క్రిస్మస్ పండుగ వచ్చేసినట్టు. క్రిస్టియన్స్ సోదరులు అందరు ఇంటికి ఆకర్షణీయమైన స్టార్లను అమర్చి క్రిస్టమ్మస్ పండుగని ఆహ్వానిస్తారు. క్రిస్టియన్స్ అందరు ఇంటికి అమర్చే స్టార్ల కోసం మార్కెట్లో రకరకాల ఖరీదైన స్టార్లను కొనుగులు చేస్తారు. అలా కాకుండా తక్కువ ధరలకే మంచి క్వాలిటీ స్టార్లను మన విజయవాడ నగరంలో తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు.
విజయవాడ మొగలరాజపురం శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా క్రిస్మస్స్టార్లు తయారు చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో క్రిస్టియన్స్ అందరు ఇంటికి, చర్చికి అమర్చే మూడు అడుగుల స్టార్ల నుంచి 18 అడుగుల స్టార్ల వరకు తయారు చేస్తారు. మార్కెట్లో ఉండే స్టార్లతో పోలిస్తే ఇవి వెదురు కర్రలతో స్టార్ ఆకారంలో అమర్చి లోపల లైట్లను అమర్చి రకరకాల కలర్ పేపర్లతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు.
గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. రూ.2 వేలకు పైగా ఢమాల్!
స్టార్ల తయారీ దారులు మాట్లాడుతూ..
గత పదిహేను సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగకు స్టార్లను తయారు చేసి విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్స్ అందరు ఇంటికి, స్టార్లను అలంకరణంగా అమర్చి క్రిస్మస్ పండుగను ఆహ్వానించటం అనవాయితీగా వస్తున్న పద్దతి. తమ దగ్గర మార్కెట్లో దొరికే కృత్రిమ స్టార్లతో పోలిస్తే, తాము తయారు చేసే స్టార్లు గాలికి, వర్షానికి కూలిపోకుండా దృఢంగా ఉంటాయన్నారు. ఈ స్టార్లు దృఢంగా ఉండటానికి వాటిలో వెదురు కర్రలను ఉపయోగిస్తారని తెలిపారు. వీరి దగ్గర ఇంటికి అమర్చే 2,3 అడుగుల స్టార్ల దగ్గర నుంచి చర్చిలో అమర్చే 20 అడుగుల స్టార్ల వరకు తయారు చేస్తామని వివరించారు. క్రిస్టియన్స్ జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. అందరికి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..