విజయవాడ ఫుడ్ లవర్స్ కి శుభవార్త. ప్రతి సాయంత్రం వేళ రుచికరమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబందించిన రుచికరమైన వంటకాలను రుచి చూడాలి అంటే తప్పకుండా విజయవాడ బందర్ రోడ్డులోని ఫార్టున్ మురళి పార్క్ హోటల్ సందర్శించాలిసిందే. ఎందుకంటే ప్రతి రోజు స్వచ్ఛమైన తెలుగు వంటకాలతో భోజన ప్రియులను అబ్బురపరిచే విధంగా తెలుగు రాష్ట్రాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.
విజయవాడ నగర వాసులకు ఫార్టున్ మురళి పార్క్ హోటల్ వారు ఏర్పాటు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలు ప్రతి రోజు సాయంత్రం సమయాల్లో కుటుంబ సమేతంగా రుచికరమైన తెలుగు వంటకాలను రుచి చూడొచ్చు.
పార్క్ సీనియర్ చెఫ్ఫార్టున్ మురళి మాట్లాడుతూ..
విజయవాడ నగర వాసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబదించిన అన్ని రకరకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్స్ ఫెస్టివల్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ప్రతి రోజు డిన్నర్, ఆదివారం లంచ్ & డిన్నర్ కు తెలుగు స్పెషల్ ఫుడ్స్ ఫార్టున్ మురళి పార్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ జిల్లా మొత్తం గంట ముందే ముగియనున్న పోలింగ్.. కారణం ఇదే..
తెలుగు ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్లో రొయ్యల వేపుడు, చేపల పులుసు, తెలుగు వారు అందరు ఇష్టంగా చేసుకొనే చింతపండు పులిహార, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటు కోడి పులుసు, అరకు బొంగు చికెన్, చింతచిగురు మాంసం,కోస్తాల్ ఏరియాలో దొరికే కొర్రమీను వేపుడు అలాగే తెలుగు రుచులతో కూడిన మిఠాయిలను ఆత్రేయపురం పూతరేకులు, నేతి అరిసెలు, నేతి సున్నుండలు, కొబ్బరి బూరెలు, బెల్లం పొంగలి మరియు నేతి బెల్లం చెక్క వంటి ఎన్నో రకాల తెలుగు వంటకాలను మరియు రుచులను నేతితరం వారు అందరు రుచి చూడాలి కోరుకుంటున్నటు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..