కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం ఎందుకు చేస్తారంటే..!! 

అన్ని మసాలాలో పవిత్ర కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైన మాసంగా ఈశ్వరుడిని హిందువులు కొలుస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో శివ భక్తులు ఎంతో నిబద్దతతో ఉపవాసాలు ఉంటూ, కార్తీక మాసంలో ప్రతి రోజు విశేషంగా ఈశ్వరుడిని ఆరాధిస్తూ దీపార్చనలు మరియు పూజలు నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసంలో సోమవారములను కార్తీక సోమవారలుగా పిలుస్తూ ఉంటారు. సోమవారం ఈశ్వరుడిని పూజించే హిందూ భక్తులు కార్తీక సోమవారం రోజున దీపారాధనలు చేస్తూ తమ కోర్కెలను శివునికి చెప్పుకుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున ప్రతి శివ శైవ క్షేత్రంలో గొప్పగా జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులు అయిన పార్వతి మరమేశ్వరులను ఆ జ్వాలా తోరణంలో మధ్య ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజుఈ జ్వాలా తోరణ ప్రదక్షిణాలు జరుగుతు ఉంటాయి. అసలు ఈ జ్వాలా తోరణం వెనుక ఉన్న అంతర్గతం ఏంటి అంటే..

కార్తీక పౌర్ణమి శుభ ఘడియలు ఇవే.. నేటి పంచాగం తెలుసుకోండి!

దేవతలు మరియు రాక్షేసులు కలిసి అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలికెటప్పుడు వచ్చిన హాలహలాన్ని ఎలా అడ్డుకోవాలో తేలిక దేవతలు మరియు రాక్షసులు భయబ్రాంతులకు గురై ఈశ్వరుడిని ప్రార్ధించగా, మహా దేవుడు అయిన పరమేశ్వరుడు హాలహలాన్ని తనకు తానుగా మింగేస్తాడు. అదే సమయంలో మాత పరమేశ్వరి హాలహలం నుంచి తన భర్త మహా దేవుడిని రక్షించుకోవటానికి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణంగా గుండా ప్రదక్షిణ చేయాలి అనుకున్నారంట మాత పార్వతి. అదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ప్రతి శైవ క్షేత్రంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులు అయినా పార్వతి పరమేశ్వరులను ప్రదక్షిణాలు చేయిస్తారు. ఈ జ్వాలా తోరణంలో భక్తులు ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే వారికి అరిష్టాలు అన్ని దూరమై సకల సంతోషాలతో ఆనందంగా ఉంటారని, మృత్యు భయం లేదా యమ భయం ఉండవని ప్రతీక.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

మోదీ పారిశ్రామికవేత్తలకు దేశ సంపద కట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డి..ఏపీకి మోడీ..ఎన్నో ఆటంకాలు..వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి బంపర్ ఆఫర్.. విస్తృత ప్రచారంలో మాగుంట,ఉగ్ర,ముత్తుముల,కుందూరు..