కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రీతి వంతమైన పుణ్య మాసంగా హిందువులు భావిస్తారు. ఈ కార్తీక మాసంలో భక్తులు ఈశ్వరునికి సంవత్సరం అంతా చేయాలిసిన దీపారాధనలను కార్తీక మాసంలో చేస్తుంటారు. కార్తీక పౌర్ణమినాడు అధిక సంఖ్యలో ఈశ్వరునికి దీపాలు వెలిగించి తమ కోర్కెలను శివునికి చెప్పుకుంటారు. ఈశ్వరునికి సంబందించిన ప్రతి శివాలయంలో విశేషంగా కోటి దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఈ కోటి దీపోత్సవ వేడుకలలో అశేషంగా మహిళా భక్తులు వేలాదిగా పాల్గొంటారు.
విజయవాడ ఇంద్రాకీలాద్రి ఆలయంలో కార్తీక పౌర్ణమి పుణ్య దినమున 5 వేల మంది మహిళలు అశ్లేషంగా కోటి దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాస కోటి దీపోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విచ్చేసి, కనక దుర్గ అమ్మవారి ఇంద్రాకిలాద్రి ఆలయంలో ఏర్పాటు చేసిన 5 వేల మంది మహిళా భక్తులతో కలిసి కోటి దీపోత్సవ వేడుకలను ఆరంభించారు.
కార్తీక పౌర్ణమి శుభ ఘడియలు ఇవే.. నేటి పంచాగం తెలుసుకోండి!
ఇంద్రాకిలాద్రి ఆలయ పండితులు మాట్లాడుతూ… కార్తీక పౌర్ణమి సందర్బంగా ప్రదోష కాలంలో దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణప్రారంభించారు. అనంతరంఅమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. కోటి దీపోత్సవం కార్యక్రమం నందు భక్తులు విశేషముగా పాల్గొని, దీపములు వెలిగించి శ్రీ అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి వారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహణాధికారులు, వైదిక కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..