(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 2024 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వైసిపి, జనసేన పోటీ పడుతున్నాయి. మేమంటే మేము, మేము గెలుస్తాము, అంటూ ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అధికార పార్టీ అయినా వైసీపీ అయితే 175కు 175 సాధిస్తామని చెప్తోంది. అలానే టిడిపి, జనసేన, బిజెపిలు కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపుతున్నాయి. ఎవరికి వారు పధకాలను ప్రకటిస్తున్నారు. అయితే జనసేన అధినేత అయినా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కుదురుచుకుంటున్నారని చెప్పారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ తో టిడిపి జనసేనతో పోటీ చేస్తున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు.టిడిపితో కలిసి నడుస్తామని జనసేన అధినేత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.మరి టీడీపీతో దోస్తీకి వెనకడుగు వేస్తున్నబిజెపి జనసేనతోనే కలుస్తుందా, లేక టిడిపితో కలుస్తుందా అనేది మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.
జనసేన,టీడీపీ పొత్తు వైసీపీకి ప్లస్ అవుతుందా..
జనసేన టీడీపీ పొత్తు విషయంలో వైసీపీ ఒకింత హ్యాపీ గా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ఎమ్మెల్యే ల ప్రోగ్రెస్ రిపోర్ట్, గడప గడప గడపకు ఎచీవ్మెంట్ తో పాటు ఐప్యాక్ నివేదికల ఆధారంగా కొంత మంది ఎమ్మెల్యే లతో పాటు మంత్రులను మందలించినట్లుగా సమాచారం. అయితే వారిలో కొందరు టీడీపీలోకి వెళ్లలేక..జనసేనాలోకి వెళ్లాలని ప్లాన్లు వేసుకున్నారు.షడన్ గా టీడీపీ,జనసేన పొత్తుతో వారికి వైసీపీ తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని అధికార వైసీపీ భావిస్తుంది.
ANDHRA PRADESH:చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ..స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ కు బెయిల్
వైసీపీ రిలాక్స్..
ఈ పొత్తుతో తమ పార్టీ నుంచి వలసలు, వేరే పార్టీలోకి జంప్ చేసే వారు ఉండరని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ఎలాగూ పార్టీలో ఉంటారు కాబట్టి అధినేత మెప్పు పొందేందుకు కూడా ఎంతో కొంత కృషి చేస్తారని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.టీడీపీ, జనసేన పొత్తు వల్ల తమకు మేలే జరిగింది అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.తమ అధినాయకత్వం ఆ విషయంలో రిలాక్స్ అయినట్లు తాడేపల్లి వర్గాల వాదన.
మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి
జనం తిరస్కరిస్తే ..
తమ నేతలు పార్టీ మారే ఛాన్సు లేకుండా పోయిందని వైసీపీ సంబర పడుతున్నప్పటికి..వాళ్లలో కూడా కొందరు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి పేరు లేదు. ఈ కారణంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలు వారి కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికో ఓట్లు వేస్తే ఆ రూపంలో అధికార పార్టీకి నష్టం తప్పదని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..