కార్తీక మాసం శివునికి ప్రత్యేకమైన మాసంగా ఈశ్వరుని దర్శనం కోసం భక్తులు ప్రసిద్ధ శివాలయ క్షేత్రలకు తరలి వెళ్తుంటారు. కార్తీక మాస పంచారామ దర్శనం కోసం
ఏపీఎస్‌ఆర్టీసీ
అవనిగడ్డ నుంచి పంచారామ యాత్రకు (Pancharama Yatra) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ వాసులు ఈ కార్తీక మాస పంచారామ యాత్రను ఉపయోగించుకోవాలి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఒకే రోజు పంచారామ దర్శన భాగ్యం ఆర్.టి.సి వారు కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ కె హనుమంత రావు చెప్పారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచారామాలయిన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటను కార్తీకమాసంలో ఒకే రోజులో దర్శించిన అఖండ పుణ్యం అని అన్నారు.
Lambasingi: లంబసింగి వెళ్తున్నారా? ఈ బోట్ షికార్ అస్సలు మిస్ అవ్వొద్దు
అవనిగడ్డ డిపో నుంచి కార్తీక మాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 12గంటలకు బస్సులు బయలు దేరతాయి. పంచారామాలను దర్శించుకుని మరుసటి రోజు రాత్రికి అవనిగడ్డ తిరిగివస్తాయి. టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఆల్ట్రా డీలక్స్ బస్సు చార్జీ రూ.1245, సూపర్ లగ్జరీ రూ.1300 చెల్లించాలి. నవంబర్ 18, 19, 25, 26, డిసెంబర్ 2, 3, 9, 10 తేదీల్లో పంచారామాలకు అవనిగడ్డ డిపో నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
జామతోట సాగుతో రోజుకు రూ.1 లక్ష ఆదాయం… ఈ రైతు ఎలా పండిస్తున్నాడంటే
అలంపూర్ యాత్రకు 4 రోజుల పాటు రూ.3 వేల చార్జీతో ప్యాకేజీ అందుబాటులో ఉంది. కార్తీక మాసంలో ప్రతి శనివారం ఈ బస్సు బయల్దేరుతుంది. ప్రసిద్ధి దేవాలయాలైన బ్రహ్మంగారి గుడి, అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, అలంపూర్, శ్రీశైలం, త్రిపురాంతకం దర్శించుకునేందుకు సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..