ప్రస్తుత మారుతున్న కాలంలో ప్రజలు, యువకులు
ఫ్యాషన్
, స్టైలింగ్ సంబంధించిన దుస్తుల విషయంలో చాలా ప్రత్యేకంగా వ్యవహారిస్తున్నారు. రోజు రోజుకి అభివృధి చెందుతున్న ఫ్యాబ్రిక్స్, హ్యాండ్లూమ్ క్లోత్స్, ఇతరతర బట్టలు యువతను ఆకర్షిస్తున్నాయి. దుస్తుల వ్యవహారశాలి ఈ మధ్య
సినిమాలు
, సినిమా హీరోల ప్రభావితం కూడా వేసుకునే దుస్తుల మీద పడుతుంది. ఫ్యాషనబుల్, డిజైనర్ వేర్, ప్రింటెడ్, సాఫ్ట్ షర్ట్స్, సీజనల్ దుస్తులు అంటూ వివిధ రకాల బట్టలను మార్కెట్‌లో ఎక్కువ ఖరీదుతో విక్రస్తున్నారు.
సాధారణంగా మార్కెట్‌లో పడే పడే ఖరీదులకు హోల్‌సేల్ షాపుల్లో పడే ఖరీదులకు చాలా వత్యాసం ఉంటుంది. మార్కెట్లో కొన్ని చోట్ల మనం డబ్బులు ఎక్కువ పెట్టిన క్వాలిటీ దొరకదు. వాటిల్లో కూడా నాసిరకాలను, తొందరగా పాడయిపోవడం వంటివి జరుతాయి. ఎలాంటి నాసిరకాలకు, నాణ్యత లేని దుస్తులకు తావు లేకుండా బయట మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే బ్రాండెడ్ దుస్తులు దొరుకుతున్నాయి.
Seasonal Business: వీళ్ల పని బాగుంది… జస్ట్ ఒక నెల వ్యాపారం… లక్షల్లో ఆదాయం
విజయవాడ నగరంలోని మొగలరాజపురంలోని సిద్దార్థ కళాశాల సమీపంలోని బొంబాయి బోటిక్ వారు బ్రాండెడ్, న్యూ స్టైలింగ్ బట్టలను తక్కువ ధరలకే హోల్‌సేల్ ధరలకే దుస్తుల విక్రయాలు చేస్తున్నారు. వీరి దగ్గర మగవారికి సంబంధించి షర్ట్స్, టీ -షర్ట్స్, ట్రోజర్స్, బ్రజెర్స్ సూట్స్ మరియు అన్ని రకాల దుస్తులు లభ్యమవుతున్నాయి. వీరు బయట మార్కెట్ ధరలతో పోల్చుకుంటే వీరి దగ్గర సగం రేట్లులకే దుస్తులు దొరుకుతాయి అని చెప్పారు.
బాంబే బోటిక్ యజమాని మాట్లాడుతూ వారి దగ్గర అన్ని రకాల దుస్తులు బయట మార్కెట్లో పోల్చుకుంటే వారి దగ్గర తక్కువ ధరలకే దుస్తులు లభ్యమవుతాయి. వీరి దగ్గర మగవారికి సంబంధించినా అన్ని రకాల దుస్తులు ఉంటాయి. బ్రాండెడ్ దుస్తులు అతి తక్కువ ధరలకే విక్రయిస్తునాం అని చెప్పారు. వీరి దగ్గర పిల్లలకు సంబంధించిన దుస్తులు కూడా దొరుకుతాయి. పెళ్లిలకు, ఫంక్షన్స్‌కు, పుట్టినరోజు, రెగ్యులర్‌గా వాడుకోటానికి కూడా మంచి క్వాలిటీ దుస్తులు లభ్యమావుతాయి.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిజినెస్… నెలకు రూ.30 వేల ఆదాయం… ఓ యువకుడి సక్సెస్ స్టోరీ
వీరి దగ్గర కొనుగోలు చేసిన ఏ దుస్తులు అయినా నాసిరకంతో ఉన్న, వాటికీ ఏమైనా ఫాల్ట్స్ ఉన్న అంటే వాష్ చేసేటప్పుడు పాడైయిపోవడం, నాణ్యత లేక చినిగిపోవడం వంటివి జరిగినప్పుడు వీరు వెంటనే వాటిని పరిశీలించి రిటర్న్ తీసుకోవడమో, మార్చుకోవడం వంటివి చేస్తామని తెలియచేసారు. వీరి దగ్గర స్టైలిష్ షర్ట్స్, ట్రెండింగ్ ప్యాంట్స్ రూ.300 నుంచే లభిస్తాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..