సోనియాతో పీవీకి విభేదాలు ఎందుకు వచ్చాయి…????

ఎంత చెప్పుకున్నా పీవీ గురించి తక్కువే. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు. ఆయనకు రాని బిరుదులు లేవు . పీవీ నరసింహారావు గ్రేట్ లీడర్. అందులో నో డౌట్. ఆయన లాంటి రాజకీయ వైతాళికుడిని ఈ దేశం గతంలో చూసి ఉండదు, భవిష్యత్తులో అసలు చూడదు. ఆయన బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పదహారు భాషలలో పట్టు సాధించిన వారు. రాజకీయ నాయకుడు కాదు రాజకీయ వేత్త. మేధావి అపర చాణక్యుడు. మౌనం కూడా ఒక నిర్ణయమే అన్న కొత్త సూత్రాన్ని కనిపెట్టి లోకానికి పరిచయం చేసిన జ్ఞాని.
ఇలా ఎంత చెప్పుకున్నా పీవీ గురించి తక్కువే. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు. ఆయనకు రాని బిరుదులు లేవు. ఇపుడు ఆయన భారత రత్నం అయ్యారు. నిజంగా ఆ అవార్డుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. ఎందుకంటే తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశాన్ని ఒక దశలో దిశలో నడిపించారు. అలా నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం తరువాత దేశం గమనం ఇబ్బందులలో పడినపుడు ఈ దేశం బంగారాన్ని సైతం అమ్ముకునే స్థితి ఏర్పడినపుడు ఆర్ధిక సంస్కరణలతో కొత్త మలుపు తిప్పి ఈ రోజు నవీన భారతానికి పునాది వేసిన మహనీయుడు పీవీ కాకుండా భారత రత్నం మరెవరు అవుతారు పీవీకి పదవుల మీద వ్యామోహం లేదు. ఆయన రాజకీయాల్లో ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు చందంగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. కానీ ఉమ్మడి ఏపీలో ఆయన ముఖ్యమంత్రి అయి కొన్నాళ్ళు ఆ పదవిలో ఉన్నారు. ఇక కేంద్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. విదేశాంగ శాఖ నుంచి మానవ వనరుల శాఖ నుంచి హోం శాఖ వరకూ ఎన్నో చేపట్టి అన్నింటికీ వన్నె తెచ్చారు. ఆయన చేపట్టని ఒకే ఒక పదవి ప్రధాని అని అప్పట్లో అంతా అనుకునేవారు. అలాంటి పీవీ తట్టా బుట్టా సర్దుకుని ఇక ఈ రాజకీయం చాలు అని హైదరాబాద్ కి వెళ్ళిపోదామని అనుకుంటున్న వేళ రాజీవ్ గాంధీ దారుణ హత్య జరిగింది. అది 1991 మే 21. అప్పటికి కొన్ని దశల లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. ఆ దుర్ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ అంతా కలసి పీవీనే కాంగ్రెస్ కి నాయకత్వం వహించమని కోరింది. అలా ఆయన తాను వద్దనుకున్న బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అదే ఏడాది జూన్ లో కాంగ్రెస్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వానికి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అలా అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన సమర్ధత చాలా గొప్పది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ లో ప్రధానిగా ఏఐసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఒక్కరే నిర్వహించడం నెహ్రూ ఇందిర రాజీవ్ తరువాత పీవీకే దక్కింది వారంతా ఒకే కుటుంబం. కానీ నెహ్రూ గాంధీ కుటుంబేతరుడు ఇలా కీలక బాధ్యతలు మోస్తూ జాతీయ స్థాయిలో అయిదేళ్ల పాటు గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ కి లీడర్ గా ఉండడం అంటే అది గొప్పగా చూడాలి. ఆ సమయంలో సోనియాగాంధీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు నాటి సీనియర్ నేతలు కొందరు పీవీ మీద పనిగట్టుకుని సోనియాగాంధీకి చాడీలు చెప్పేవారు అని ప్రచారంలో ఉన్న మాట. పీవీ సైతం తన రాజకీయ ఠీవిని ఏనాడూ కోల్పోలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. పార్టీ మేలు కోసం పనిచేశారు. ఆయన భజన బృందాల మాదిరిగా వ్యవహరించలేదు. బహుశా ఈ కారణాలే ఆయనకు సోనియాగాంధీకు మధ్య గ్యాప్ ని పెంచాయని అంటారు. ఎంతలా అంటే సోనియా గాంధీకి పీవీ పొడ గిట్టనంత అని చెబుతారు. పీవీకి రాజకీయాల మీద వ్యామోహంలేదు. పార్టీని తన వారసులకు ఇవ్వాలన ఆశ అంతకంటే లేదు. కానీ ఆయన కాంగ్రెస్ ని కష్టకాలంలో నిలబెట్టి తాను కష్టాల పాలు అయ్యారు. ఆయన గాంధీ కుటుంబానికి గిట్టని వారు అని భజన బృందాలు చేసిన ప్రచారానికి బలి అయ్యారు. కాంగ్రెస్ ని నిలబెట్టడం కోసం ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని రక్షించడానికి చూస్తే చివరికి అదే ఆయనకు ఇబ్బందిగా మార్చాయి దశాబ్దాల బంధం కాంగ్రెస్ తో ఉన్న పీవీ చివరికి అదే కాంగ్రెస్ లో ఒంటరి అయ్యారు. దేశాన్ని పాలించిన ప్రధానులు చనిపోతే ఢిల్లీలో వారికి అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ పీవీకి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఆయన చనిపోయేనాటికి దేశంలో కాంగ్రెస్ నాయకత్వాన యూపీయే వన్ ప్రభుత్వం ఉంది. అయినా ఆయన భౌతిక కాయాన్ని సొంత స్టేట్ అయిన ఏపీకి తీసుకుని వెళ్లేలా కొన్ని పరిణామాలు జరిగాయి. ఇంతకీ ఆయన కాంగ్రెస్ పెద్దలకు చేసిన అపకారం ఏమిటి అన్నది చూస్తే జవాబు ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. కానీ రాజకీయాల్లో ఎంతటి మహా శిఖరం అయినా కొన్నింటికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా పీవీ రాజకీయాలలో చివరి పుటలను చూడాలి.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం