*తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం*
*గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల*
రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న జగన్ రెడ్డి ఒక్క బీసీ సోదరునికయినా సబ్సిడీ ఋణం అందించారా అని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.శనివారం అర్ధవీడు మండలం దొనకొండ గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గోన్న అశోక్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలకు వెన్నుపోటు పొడిచాడని, ఎన్నికల సమయంలో బీసీ సోదరులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా బీసీలపై దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టటం వైసీపీ నాయకుల దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో బీసీ సోదరుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని గుర్తు చేశారు.. గిద్దలూరు నియోజకవర్గంలో బీసీ భవనాలను మంజూరు చేసి పనులను ప్రారంభిస్తే ఈ వైసీపీ పాలకులు ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.. రాష్ట్రంలో బీసీ సోదరుల సంక్షేమం కోసం కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అని, మళ్ళీ అధికారంలోకి రాగానే గతంలో అందించిన పథకాలతో పాటు బీసీ సోదరులను అన్నీ విధాలుగా ఆదుకొనే బాధ్యత తెలుగుదేశం పార్టీది అని భరోసానిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ టీడీపి, జనసేన లకు మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్, ప్రధాన కార్యదర్శి కొణతం రంగారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఈర్ల ఎర్రన్న యాదవ్, స్థానిక సర్పంచ్ సిరివెళ్ళ ఎస్తేరు రాణి, మాజీ సర్పంచ్ బండి నారాయణ రెడ్డి, యాచవరం సర్పంచ్ పీరయ్య, పాపినేనిపల్లె సర్పంచ్ పుల్లారావు, మాజీ ఎంపీటీసీ మండ్ల రంగయ్య, బోయపాటి వెంకటేశ్వర్లు, బియ్యాల నారాయణ, ఉపాధ్యక్షులు సూరె కృష్ణయ్య, క్లస్టర్ ఇంచార్జ్ మారెడ్డి రంగారెడ్డి, మండల టీడీపీ నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.