ఇచ్చాపురంలో రేపటినుంచి ప్రారంభంకానున్న శంఖారావం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న యువనేత నారా లోకేష్…
- యువనేతకు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్యనేతలను పేరుపేరునా పలకరించిన లోకేష్ పార్టీశ్రేణులకు అభివాదం చేసి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన ఇచ్చాపురం నుండి బయలుదేరారు. ఇచ్చాపురంలో రేపటి శంఖారావం కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇచ్చాపురంలో రేపు ఉదయం 10.30గంటలకు యువనేత లోకేష్ చేతులమీదుగా శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. శంఖారావంలో పాల్గొనేందుకు ఇప్పటికే పార్టీ ముఖ్యనాయకులు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఇచ్చాపురం చేరుకున్నారు.