ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు గురవయ్య ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తమ మండలంలో నీటి కొరత ఎక్కువగా ఉందని, ట్యాంకర్లతో నీరు తోలుతుంటే దానిని కూడా ప్రభుత్వం నిలిపివేయడంపై మహిళలు ఆగ్రహించారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగారు. రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని టిడిపి నాయకులు, సిపిఎం నాయకులు, మహిళలు హెచ్చరించారు .
Recent Posts