👉గిద్దలూరు లోనే నివాసం ఉంటా.. నాగార్జున రెడ్డి.. ఆర్మీ జవాను భౌతికకాయానికి నివాళులు

👉ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే: నాగార్జున రెడ్డి

ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని గిద్దలూరు ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని నాన్లో లోకల్ అనే మాటకు ఇక తావులేదని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. సీఎం జగన్ మాట ప్రకారం తాను గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చినట్లుగా తెలిపారు.తాను గిద్దలూరు వైసిపి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనపై సోషల్ మీడియాలో అధికంగా విమర్శలు వస్తున్నాయని కావాలంటే తమ కుటుంబం అక్రమాలకు పాల్పడి ఉంటే ఆర్టిఐ ఆక్ట్ ద్వారా నిరూపించాలని అన్నారు.👉

ఇక గిద్దలూరు నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఆర్మీ ఉద్యోగులు ఉన్నారని వారందరూ దేశ సేవకై అంకితమై ఉన్నారని వారికోసం సీఎం జగన్ తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు వారికి సదుపాయాలు కల్పించేందుకు ముందు ఉంటానని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గ మొత్తం పర్యటించి కార్యకర్తలతో కలుస్తానని ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. ఎమ్మెల్యే అన్నారాంబాబుతోపాటు తనతో సీఎం జగన్ మాట్లాడి నియోజకవర్గలా మార్పిడి చేశారని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

  • APIIC చైర్మన్ ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జంకె.వెంకటరెడ్డిని కంభం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంగటి చెన్నారెడ్డి,అర్ధవీడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చేగిరెడ్డి పోతిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
  • 👉 గుండెపోటుతో మరణించిన ఆర్మీ జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కుందురు

రాచర్ల మండలం సోమిదేవిపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బత్తుల వెంకటరాజు (40)గురువారం రాత్రి కోలుకొతా లో గుండెపోటుతో మృతి చెందడంతో శనివారం ఆయన భౌతికకాయాన్ని సోమిదేవిపల్లె గ్రామానికి తీసుకోనిరాగా విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..