👉 ఏపీ డీజీపీ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు..
ఇవాళ ఏపీ, తెలంగాణల్లో వివాహాలకు చంద్రబాబు హాజరు
విజయవాడలో ఏబీఎన్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి వివాహం..హైదరాబాదులో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె సోనాక్షి పెళ్లి
వధూవరులకు ఆశీస్సులు అందించిన ఏపీ సీఎం..
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏపీ, తెలంగాణల్లో వివాహాలకు హాజరయ్యారు.
విజయవాడలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి పెళ్లికి విచ్చేశారు. ఇక, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె గాయత్రి సోనాక్షి వివాహం హైదరాబాద్ లో జరగ్గా… ఈ పరిణయ మహోత్సవానికి కూడా చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు గాయత్రి సోనాక్షి, రుత్విక్ సాయికి ఆశీస్సులు అందించారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
👉నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు..
టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు..
సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు నిర్వహణ..
తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న హీరో విజయ్.
👉తెలుగుదేశం పార్టీ కార్యకర్త దుర్గాప్రసాద్ హత్య కేసులో 14 మంది ముద్దాయిలు అరెస్ట్:*తిరుపతి జిల్లా… చిల్లకూరు*
*మిగిలిన ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు..*
నేరం లో పాల్గొన్న అందరి పైన రౌడీ షీట్ లు ఓపెన్ చేశాం..* *మరొక్కసారి చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులుతో పాటు PD Act నమోదు చేస్తాం.* *ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.*
జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..*రౌడీయిజన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు..*
జిల్లాలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి రౌడీయిజం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక.*
*గూడూర్ డిఎస్పి వి.వి. రమణ కుమార్.*
తిరుపతి జిల్లా అక్టోబర్ 26: చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని నాచారం పేట మరియు ముత్యాలపాడు గ్రామాల యందు 21.10.2024 మరియు 22.10.2024 వ తేది నాడు జరిగిన సంఘటనలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మల్లారపు హరి ప్రసాద్ హత్య గావించబడిన సంఘటనల పైన చిల్లకూరు పోలీస్ స్టేషన్ నందు యస్.సి/యస్.టి చట్టం తో పాటు వివిధ సెక్షన్ ల క్రింద 3 కేసులు మరియు ఒక హత్య కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసులను తిరుపతి జిల్లా యస్.పి యల్. సుబ్బరాయుడు ఐపియస్., ప్రతిష్టాత్మకంగా తీసుకొని, సంఘటన జరిగిన రోజే స్వయంగా నేరస్థలాన్ని పరిశీలించి, తిరుపతి శాంతి భద్రతల అదనపు యస్.పి కె. రవి మనోహర చారి నేతృత్వం లో గూడూరు SDPO వి.వి. రమణ కుమార్, నాయుడుపేట SDPO చెంచు బాబు గూడూరు రూరల్ సి.ఐ కిశోర్ బాబు, వాకాడు సి.ఐ హుస్సేన్ బాష, సూళ్లూరుపేట సి.ఐ మురళి కృష్ణ, చిల్లకూరు యస్.ఐ రమేష్ బాబు మరియు ఇతర అధికారులతో వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి గౌరవ యస్.పి గారు దిశా నిర్దేశం చేయడం జరిగింది. అదే విధంగా నాచారంపేట మరియు ముత్యాలపాడు గ్రామాల్లో పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించడం జరిగింది.
ఈ కేసులను వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి, నాచారంపేట కు చెందిన దుర్గాప్రసాద్ హత్య కేసు దర్యాప్తు లో భాగంగా, ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన గూడూరు డియస్పి వి.వి. రమణ కుమార్ కు రాబడిన సమాచారం మేరకు 25.10.2024 వ తేదీన చిల్లకూరు మండల పరిధిలో చింతవరం – కోట రోడ్డు లో హత్య కేసు లో 07 మంది ముద్దాయులను, ముత్యాలపేట వద్ద వున్న AMC గోడౌన్ వద్ద మరో 07 మంది ముద్దాయిలను మొత్తం 14 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా నేరానికి ఉయోగించిన కత్తులు మరియు వాహనము ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసుల దర్యాప్తులో భాగ్యస్వామ్యులైన అధికారులను మరియు సిబ్బంది ని గౌరవ యస్. పి అభినందించడం జరిగింది అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డిఎస్పి వి.వి.రమణ కుమార్ హెచ్చరించారు.
👉వివాదంలో విజయవాడ పోలీసులు..!!!
*విజయవాడ,పటమట పోలీస్ స్టేషన్:*
▪️పోలీసులు నుండి రక్షణ కల్పించండి.
▪️విజయవాడలో దంపతులు ఆవేదన.
▪️విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లోని సీఐ పవన్ కిషోర్,క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ మరియు కానిస్టేబుల్ ఆరిఫ్ అరాచకాల నుండి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్న ఓ కుటుంబం.
▪️ఈ వీడియో క్లిప్ ని గౌరవనీయులైన సిఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రివర్యులు లోకేష్ బాబు కు, హోం మినిస్టర్ అనిత కు మరియు గౌరవ జడ్జెస్ వారికి చేరే విధంగా షేర్ చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము.
*▪️బాధితుడు ప్రసాద్, ఆమని*
👉మంచిర్యాల: సత్వరమే న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు..
మంచిర్యాల: సత్వరమే న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు
సత్వరమే ప్రజలకు న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టు జడ్జి వేణుగోపాల్ తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా కోర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ జడ్జి బోయ శ్రీనివాస్, జిల్లా జడ్జిలు బార్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు పూల బొకే అందించి ఘనంగా స్వాగతం పలికారు.
👉 విజయవాడ: ఎస్ఐల బదిలీలు..
ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వెంటనే ప్రస్తుతం పని చేస్తున్న స్టేషన్లలో ఎస్ఐలను రిలీవ్ చేయాలన్నారు. బదిలీ అయిన ఎస్ఐలు తమ బదిలీ స్టేషన్ లో బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఫ్రాన్సిస్ సూర్యారావుపేట కు విఆర్ లో ఉన్న సుమన్ కు భవానిపురంలో పోస్టింగ్ ఇచ్చారు.
👉పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టిజిఎస్పి సిబ్బంది సస్పెండ్..*
తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు.
👉ఆమ్రపాలి పోస్టింగ్ ఎప్పుడు.. ఎక్కడ?*
*విజయవాడ.. లేక విశాఖపట్నం??*
డైనమిక్ ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరుని తెచ్చుకున్న ఆమ్రపాలి ఎట్టకేలకు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది.అయితే ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇప్పటి దాకా కేటాయించలేదు. అయితే సీఎం చంద్రబాబు ఆమ్రపాలిని విజయవాడ నగరాభివృద్ధి సంస్థ కమిషనర్గా నియమిస్తారన్న ప్రచారం ఉంది. లేదా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్గా కూడా నియమిస్తారని టాక్.. స్టేట్ ఇంచార్జ్ ఎస్ రహమాన్.
👉షర్మిల పీసీసీ పదవి అవుట్ ?🤔
వైఎస్సార్ కుమార్తె అన్న కారణంతోనే కాంగ్రెస్ పార్టీ ఆమెకు పార్టీ అత్యున్నత పదవిని కట్టబెట్టింది. వైఎస్సార్ కుమార్తె అన్న కారణంతోనే కాంగ్రెస్ పార్టీ ఆమెకు పార్టీ అత్యున్నత పదవిని కట్టబెట్టింది. ఆమె వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని పార్టీకి నాలుగు ఓట్లు వస్తాయని కూడా ఆలోచించింది.కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల మేలు కంటే కీడే పార్టీకి ఎక్కువ చేస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఆమె ఎంతసేపూ తన సొంత అజెండాను తెచ్చి పార్టీ మీద పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు అన్న జగన్ తో ఉన్నవి పూర్తిగా వ్యక్తిగత వైరాలే. ఆమెకు వారితో ఆస్తుల వివాదాలు ఉన్నా లేక మరోటి ఉన్నా అవన్నీ పూర్తిగా ఆమె సొంత విషయాలు కిందకే లెక్క. వాటికి న్యాయస్థానాలు సరైన పరిష్కారం.అక్కడ ఆమె వాటి విషయం తేల్చుకుంటూ ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. అపుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. ఆమెకు కూడా తగిన గౌరవం ఉంటుంది. కానీ షర్మిల చేస్తున్నది ఏమిటి. ఆమె ఆస్తి వివాదాలతోనే నిండా మునుగుతున్నారు. వాటి మీదనే ఆమె స్టేట్మెంట్స్ ఇస్తున్నారు దాని కోసమే ఆమె పీసీసీ చీఫ్ ట్యాగ్ ని వాడుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. లేకపోతే పొలిటికల్ గా ఆమెకు ఇంత విస్తృత ప్రచారాన్ని మీడియా కూడా ఇవ్వదని అంటున్నారు. ఆస్తుల విషయంలో గత రెండు మూడు రోజుల్గా ఏపీ రాజకీయాల్లో జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. జగన్ నేషనల్ లా ట్రిబ్యునల్ కి వెళ్ళడంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అయితే ఈ విషయంలో షర్మిల బాధితురాలు అని మొదట్లో అనిపించినా చివరికి చూస్తే ఈ కేసులో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అవి బలంగా ఉన్నాయి. అందుకే ఈ విషయంలో షర్మిలకు మద్దతు అయితే పెద్దగా రాలేదని అంటున్నారు. అంతే కాదు ఆమె వాదనలు కూడా లాజిక్ కి దగ్గరగా లేవని అంటున్నారు. ఇక ఇదే ఎపిసోడ్ లో చూసుకుంటే కనుక ఆమె జగన్ కి రాసిన లేఖలు అన్నీ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బయటకు రావడం కూడా రాజకీయంగా కలకలం రేపేదిగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కానీ ఏపెలో కానీ టీడీపీ బీజేపీతో ఉంది. అంటే ఎన్డీయేలో కీలకమైన పార్టనర్ గా ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఎలా చూసుకున్నా బీజేపీతో ఉన్న టీడీపీ కాంగ్రెస్ కి కడు దూరమే.
కానీ ఏపీలో ఏమి జరిగినా జగన్ మీద ద్వజమెత్తడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ షర్మిలకు ఆ విధంగా మద్దతు ఇస్తోంది. మరి అది పరాకాష్టకు చేరినట్లుగా షర్మిల లేఖలు టీడీపీ ట్విట్టర్ లో కనిపించడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడక తప్పదని అంటున్నారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కాకపోగా కొత్త తలనొప్పులు తెస్తున్నట్లుగా ఉన్న షర్మిల వైఖరితో విసిగిన ఏఐసీసీ పెద్దలు ఆమెను తొందరలోనే పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారని అంటున్నారు. టీడీపీతో కుమ్మక్కు అయి తన వ్యక్తిగత లెటర్స్ వారికి ఇచ్చి పూర్తిగా టీడీపీతో ఆమె ఉంటున్నారు అని డిసైడ్ అయి ఈ విధంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. దీంతో షర్మిలను తొందరలోనే తప్పిస్తారు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక షర్మిల తీరు చూసినా కాంగ్రెస్ ఏపీలో ఏ మాత్రం బాగుపడేది లేదని కూడా ఆ పార్టీ నేతలు ఒక అంచనాకు వచ్చారని అంటున్నారు. వైసీపీ ఓడాక సహజంగానే అందులో ఉన్న పాత నాయకులు కాంగ్రెస్ వైపు రావాలి. కానీ ఆ దిశగా గడచిన నాలుగైదు నెలలుగా ఒక్క నేతను కూడా ఈ వైపునకు రప్పించలేకపోయారు అని అంటున్నారు పార్టీ పరంగా పెద్దగా కార్యక్రమాలు లేవు అని బలోపేతం చేసే చర్యలు లేవన్ అంటున్నారు. అధికార టీడీపీ మీద విమర్శలు చేయాల్సింది పోయి ఎంతసేపూ జగన్ అంటూ సొంత అజెండాతోనే షర్మిల ముందుకు సాగడం పట్ల కూడా ఆ పార్టీ పెద్దలు గట్టిగానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఒంటరి అయింది అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది.జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదంలోకి అతి ఉత్సాహంగా టీడీపీ ఎంట్రీ ఇచ్చినా సొంత పార్టీ నేతలు మాత్రం మౌనం దాల్చారు. ఆఖరికి ఆమె ఏరి కోరి నియమించిన అధికార ప్రతినిధులు కూడా ఆ వైపు చూడలేదు. వారంతా కూడా షర్మిల ధోరణుల పట్ల అసంతృప్తిగా ఉన్నారనే అంటున్నారు. పైగా ఇండియా కూటమి వైపుగా జగన్ చూస్తున్న నేపధ్యం ఉంది. రానున్న రోజులలో రాజకీయాలు తమకు అనుకూలంగా మారుతాయని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్న క్రమంలో షర్మిల మొత్తం రాజకీయ వాతావరణాన్ని పాడు చేస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు సోదరుడికి మధ్య ఉంటే అది వేరేగా చూసుకోవాలని దానికి కాంగ్రెస్ ని వాడుకోవడం మంచిది కాదని అంటున్నారు అందుకే షర్మిల వర్సెస్ జగన్ మీద టీవీలో జరిగిన డిబేట్లకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు వచ్చారు కానీ ఏపీ నేతలు కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ లో ఏపీ స్థాయిలో ఢిల్లీ స్థాయిలోనూ కూడా షర్మిలకు మద్దతు అయితే దక్కడం లేదు అని అందుకే ఆమె పీసీసీ పదవి అవుట్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.
👉ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి
👉దక్షిణ బైపాస్ రోడ్డులోని సాయి ఐ. టి. ఏ. కన్వెన్షన్ లో జరిగిన 43 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి , మరియు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్,డాక్టర్ శ్రీధర్ బాబు, డాక్టర్ సుధాకర్ రాజు,డాక్టర్ రామచంద్రరెడ్డి,డాక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.. జిల్లా ఇన్చార్జ్ ఫయాజ్..
👉ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ వరలక్ష్మి
👉ఒంగోలు కమపాలంలోని హనీఫ్ ఖాన్ కుమార్తె వివాహం ఇటీవల అయిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
👉మార్కాపురం పట్టణంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని సబ్ కలెక్టర్ త్రివినాగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన గైనిక్ వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు.. డివిజన్ ఇంచార్జ్ అసలం బేగ్
👉ఏలూరు: ద్వారకా తిరుమలలో అధిక వడ్డీ పేరుతో మోసం.. యాప్‌లో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ.750 వడ్డీ వస్తుందని బురిడీ.. ద్వారకా తిరుమలలో యాప్‌లో పెట్టుబడి పెట్టిన 200 మందికి పైగా బాధితులు.. 15 రోజులుగా యాప్ పనిచేయకపోవడంతో లబోదిబో మంటున్న బాధితులు.. మోసపూరిత యాప్‌లను నమ్మవద్దని పోలీసుల సూచన.. స్టేట్ ఇంచార్జ్ ఎస్ రహిమాన్
👉ఏపీలో ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ తో ప్రవేశాలు*
ఏపీలో BSC నర్సింగ్ కోర్సులో ప్రవేశాల అనంతరం మిగిలిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను APEAPCET, నీట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటర్ మార్కుల తో భర్తీ చేసేందుకు అనుమతినిస్తూరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం వరకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందనిస్పష్టం చేశారు.
ఏపీ డీజీపీ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు..నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు..దుర్గాప్రసాద్ హత్య కేసులో 14 మంది ముద్దాయిలు అరెస్ట్….వివాదంలో విజయవాడ పోలీసులు..షర్మిల పీసీసీ పదవి అవుట్ ?..సత్వరమే న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు-హైకోర్టు జడ్జి వేణుగోపాల్ ..ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ తో ప్రవేశాలు..ద్వారకా తిరుమలలో అధిక వడ్డీ పేరుతో మోసం.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట.. ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు ఎస్సైల బదిలీలు.
Recent Posts