👉నేడు పంజాబ్ బంద్*
*ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు*
*రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని పిలుపు*
*బంద్ నేపథ్యంలో పంజాబ్ మీదుగా వెళ్లే 163 రైళ్లను రద్దు చేసిన నార్తర్న్ రైల్వే*
*కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‍తో రైతుల ఆందోళన*
*ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు, ఖానౌరీ బోర్డర్ల వద్ద కొనసాగుతున్న రైతుల నిరసన*
👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు, జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 2025 ఫిబ్రవరి 15తో ప్రస్తుత అసెంబ్లీ (ఢిల్లీ 7వ అసెంబ్లీ) గడువు ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు ప్రక్రియను పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
దళిత, మైనారిటీ వర్గాల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటుబ్యాంకును మెరుగుపరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈ సారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగునే ఉన్న హర్యానాలో గెలుపు వాకిట తడబడి ఓడిన కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆప్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన 53.57 శాతం ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాల్లో 62 గెలుపొందగా, 38.51 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4.26 శాతానికే పరిమితమైంది.
పదేళ్ల పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, శీష్ మహల్‌గా పేరొందిన విలాస నివాస భవనం సహా 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయలేకపోవడం వంటివి కేజ్రీవాల్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53 శాతం ఓట్లలో కోత విధిస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎటువైపు మళ్లుతాయి అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతుంది. అలాకాకుండా కాంగ్రెస్ వైపు మళ్లినా సరే.. పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది. తాజా లోక్‌సభ ఎన్నికల తర్వాత ముస్లిం మైనారిటీలు, దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈ వర్గాలను కేజ్రీవాల్‌కు దూరం చేసినా సరే.. కమలదళానికే ఉపయోగం ఎక్కువ. కాంగ్రెస్ పెంచుకునే ఓట్లశాతం ఆ పార్టీని గెలిపించకపోయినా.. దశాబ్దకాలం తర్వాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి, బీజేపీకి పరోక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమీ కాదని, అనేక రకాల అవినీతి, అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజాకోర్టులో బురదజల్లింది. ఇది తనపై సాగుతున్న కక్షసాధింపు రాజకీయమని, ప్రజాకోర్టులోనే తీర్పు అడుగుతానని సీఎం పదవిని వదులుకుని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్, కేసులు, అరెస్టు, జైలుపాలవడాన్ని సానుభూతి పవనాలుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లశాతాన్ని సమీప ప్రత్యర్థి బీజేపీతో పోల్చుకుంటే 15 శాతం తేడా ఉంది. ఇందులో ప్రతికూలతల కారణంగా కొంత మేర ఓట్లు తగ్గినా.. ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చలేవని, సీట్లు కొన్ని తగ్గినా విజయం తమదేనన్న ధీమాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది.
👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు
-టీడీపీ నేత బుద్ధావెంకన్న
చంద్రబాబుది ఎవరినీ కించపరిచే మనస్తత్వం కాదు
అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిని అవమానించారు
అప్పుడు మాట్లాడని పేర్ని నాని..
ఇప్పుడు మహిళల తరపున మాట్లాడడం విడ్డూరం
-టీడీపీ నేత బుద్ధావెంకన్న
👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కుట్ర బట్టబయలైందని మాజీ సీఎం కేజ్రివాల్ తెలిపారు. ‘గత 15 రోజుల్లో వేల ఓట్లను తీసివేసి నకిలీ ఓట్లు కలిపేందుకు బీజేపీ దరఖాస్తులు ఇచ్చింది. వారికి ముఖ్యమంత్రి ముఖం, బలమైన అభ్యర్థిగానీ లేరు. ఓట్ల కోత, అవకతవకలతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుట్రలకు ఢిల్లీ ప్రజలు సమాధానం చెబుతారు” అని ట్వీట్ చేశారు.
👉రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవు…
పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుము..
అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారు..
పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చింది..
0%శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుంది..
ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరిగాయి..20టన్స్ గాంజాయి సీజ్ చేసాము
స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుంది..
48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది.
ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి..
142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ ..5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసాము..
సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది.
దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడాము..180 కోట్ల నగదు బాధితులకు అందజేశము..10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాము..ఈ ఏడాది డయాళ్ 100 కాల్స్ ..16,92 వేల కాల్స్ రిసివ్ చేసాము..7నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగము..
1000 పెట్రోల్ కార్స్ ఉన్నాయి.. 2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు..ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేసాము ..రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేసాము
ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ లను విధుల్లోకి తీసుకున్నాం..మహిళలు చిన్నారుల రక్షణ పోలీస్ బాధ్యత పోలీస్ హెల్ప్ లైన్ లో భాగంగా 29,600 ట్రాక్ చేసాము
రౌడీ షీటర్ లపై కఠిన చర్యలు తీసుకున్నాం
18 కేసులు నమోదు చేసాము ..ఇందులో 35 మంది రౌడి షీటర్ లకు కన్విక్షన్ వచ్చింది..77 పోక్సో కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 82 కేసులో నిందితులకు శిక్ష పడింది.
👉 5 గురు పేకాట రాయళ్ళ అరెస్ట్ Rs.48,000/- నగదును సీజ్ చేయడమైనది
👉రాజశ్రీ అనంతపురం జిల్లా SP జగదీశ్ ఆదేశాల మేరకు తాడిపత్రి సబ్-డివిజనల్ పోలీస్ అధికారి P.రామక్రిష్ణుడు ఉత్తర్వుల మేరకు తాడిపత్రి రూరల్ అప్ గ్రేడ్ పోలిస్ స్టేషన్ CI S.శివ గంగాధర్ రెడ్డి అయిన నేను మరియు నా సిబ్బంది SI ధరణిబాబు HC 32, PC’s 3235, 587, 3314, 3694, 3284, 771 రాబడిన సమాచారం మేరకు ఈ దినం అనగా 29.12.2024 వ తేది ఉదయం 11.00 గంటల సమయంలో తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న 05 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 48,000/- రూపాయల నగదు, 52 పేక ముక్కలను స్వాదీనం చేసు కొని వారిపై కేసు నమోదు చేయడమైనది.
ముద్దాయిల యొక్క వివరాలు
1. G.సోమశేఖర్ రెడ్డి, తాడిపత్రి టౌన్
2. D. వసు వర్ధన్ రెడ్డి, ఊరుచింతల గ్రామం, తాడిపత్రి మండలం
3. O. విజయ్ కుమార్ రెడ్డి, తాడిపత్రి టౌన్
4. S. సతిస్ కుమార్, తాడిపత్రి టౌన్
5. P. రామాంజినేయులు, తాడిపత్రి టౌన్
ఇట్లు
S. శివ గంగాధర్ రెడ్డి
ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్
తాడిపత్రి రూరల్
నెల్లూరు జిల్లా..కావలి..*
*💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*💥
నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట సముద్ర తీరంలో మెరైన్ కానిస్టేబుల్ సాహసం నిండు ప్రాణం నిలబడింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు సముద్ర తీరానికి వచ్చారు. మద్యం మత్తులో ముగ్గురు యువకులు సముద్రంలో ముందుకెళ్లారు. సముద్ర తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న మెరైన్ కానిస్టేబుళ్లు K గోవిందరాజులు S. వేణుగోపాల్ రెడ్డి A. రమేష్ నరేంద్ర చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని రక్షించగా మరో వ్యక్తి మరికొంత లోతుకి వెళ్ళిపోయాడు. ప్రాణాలకు తెగించి గోవిందరాజులు ఆ వ్యక్తిని గట్టుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులు సరైన సమాచారం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి ఉడయించారు. యువకుల ప్రాణాలు కాపాడడంతో అక్కడున్న సందర్శకులు మెరైన్ సిబ్బందిని అభినందించారు.
👉 లవర్ ని బ్లాక్ మెయిల్ చేశారని స్నేహితుడిని సుత్తితో కొట్టి చంపాడు!,
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. తన ప్రియురాలిని బ్లాక్ బెయిల్ చేస్తున్న స్నేహితుడిని 11వ తరగతి చదివే విద్యార్థి ఒకరు సుత్తితో కొట్టి చంపాడు. నిందితుడి ఫోన్లో ఉన్న అతడి ప్రియురాలి నగ్న చిత్రాలను దొంగతనంగా తీసుకున్న మృతుడు వాటితో ఆమెను కొంతకాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రియుడు కాళీ నది ఒడ్డుకు తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
👉అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా….
స్మార్ట్ మీటర్లు వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయనే భయం చాలా మందిలో ఉంది. కొంతమంది ఈ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని అతిగా చూపిస్తాయని భావిస్తున్నారు.
* దాడులకు గురయ్యే అవకాతవం: స్మార్ట్ మీటర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
* ఆరోగ్య ప్రభావాలు: కొంతమంది స్మార్ట్ మీటర్ల నుండి వెలువడే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరం అని భావిస్తున్నారు. అయితే, ఈ అభిప్రాయానికి శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువ.
* డేటా ప్రైవసీ: స్మార్ట్ మీటర్లు వినియోగదారుల విద్యుత్ వినియోగం గురించిన వివరాలను సేకరిస్తాయి. ఈ డేటాను ఎలా ఉపయోగిస్తారు అనేది స్పష్టంగా లేదు.
* తక్కువ నాణ్యత గల విద్యుత్ సరఫరా: కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.
👉 సైబర్ నేరాల అవగాహనకు ఉపయోగపడే క్యాలెండర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ..
సైబర్ నేరాల అవగాహనకు ఉపయోగపడే నూతన క్యాలెండర్లను జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఆవిష్కరించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన, సైబర్ స్మార్ట్ సిటిజన్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్, ఏపికె ఫైల్, డిజిటల్ అరెస్ట్ , తదితర సైబర్ మోసాల గురించి అవగాహన చేస్తూ నూతన క్యాలెండర్ లో రూపొందించారు. ప్రజలకు ఈ క్యాలండర్ లోని అంశాలు బాగా ఉపయోగపడుతాయని ఎస్పీ పేర్కొన్నారు.
👉రెడ్డి సంక్షేమ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ..ప్రకాశం జిల్లా..మార్కాపురం..రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి. ఆధ్వర్యంలో 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ ను రెడ్డి సంక్షేమ సేవా సంఘం మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి గుంటక సుబ్బారెడ్డి . చేతుల మీదుగా కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.గత ఆరు సంవత్సరాలుగా రెడ్డి సంక్షేమ సేవా సంఘం క్యాలెండర్ కు సహకరించిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు రెడ్డి సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గోగిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, కు0దూరు రమణారెడ్డి, తిరుమలరెడ్డి రామిరెడ్డి, గుంటక భాస్కర్ రెడ్డి, చిట్టి రెడ్డి నరసింహారెడ్డి ,కందుల బలరాం రెడ్డి, కందుల లక్ష్మిరెడ్డి,సాదుల యోగి రెడ్డి,ఎస్ రమణా రెడ్డి,కొమ్మిరెడ్డి రామకృష్ణారెడ్డి,రమణారెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు సోదరులు పాల్గొన్నారు..
👉 కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి అందుకే అంటారు గెలుపులో తప్పులు కాస్తా ఒప్పులు అవుతాయి. కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతేనే తిప్పలు మొదలవుతాయి.అందుకే అంటారు గెలుపులో తప్పులు కాస్తా ఒప్పులు అవుతాయి. కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతేనే తిప్పలు మొదలవుతాయి. అప్పటివరకు జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అప్పటివరకు తమకు తిరుగేలేదన్నట్లుగా ఉన్న వారికి తిప్పలు మొదలవుతాయి. పదేళ్లు నాన్ స్టాప్ గా తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ ఫ్యామిలీకి రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత ఏదో ఒకరకంగా షాకులు తగులుతున్నాయి.
ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కుమార్తె కవిత జైలుకు వెళ్లి రావటం తెలిసిందే. ఇంకోవైపు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీకి తోడుగా ఈడీ సైతం రంగంలోకి దిగటం.. కేటీఆర్ అరెస్టు ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వేళలో.. కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొన్న ఓఆర్ఆర్ లీజు అంశాన్ని రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లీజు అంశంపై విచారణ జరుగుతోందంటూ కొత్త బాంబు పేల్చారు. దీంతో.. కేసీఆర్ ఫ్యామిలీకి మరో కష్టం ఎదురుకానున్నట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మాజీ మంత్రి హరీశ్ రావు తన మామ.. బామ్మర్దిని ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై సిట్ వేయాలని అడిగారు. హరీశ్ రావు అసెంబ్లీలో కోరడంతోనే ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో దొంగలు దొరికారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో అవకతవకలు కూడా బయటపడతాయి’’ అంటూ పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక.. ఆర్ఆర్ఆర్ కోసం ఢిల్లీలో ఉండి తానెంతో క్రషి చేశానన్న కోమటిరెడ్డి.. 2017లో ఆగిన ప్రాజెక్టు తమ ప్రయత్నాలతోనే ముందడుగు పడినట్లుగా పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ మంజూరు చేసిన ప్రధానమంత్రి మోడీకి థ్యాంక్స్ చెప్పిన కోమటిరెడ్డి.. ఈ ప్రాజెక్టుకు సహకరించిన కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి చతురత ఏమంటే.. ఒకే ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూనే.. తమ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి సాధించిన విజయాన్ని షేర్ చేయటం.
:👉విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు*
విశాఖపట్నం :
ఏపీలో విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది. అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి చెక్ చేశారంటూ కుటుంబీకులతో కలిసి జైలు ఎదుట వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. 37మంది వార్డ్ వర్కర్ లతో కలిపి మొత్తం 66మందిని బదిలీ చేశారు. కాగా తాము ఖైదీల ముందు దుస్తులు విప్పించామనడంలో నిజం లేదని జైలు అధికారులు
వివరణ ఇచ్చారు.
నేడు పంజాబ్ బంద్* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి
Recent Posts