జగన్ జైలుకెళ్ళటం ఖాయం -‘యనమల’ కీలక వ్యాఖ్యలు..షర్మిలకు కాంగ్రెస్ నుంచి మరో తోడు.. రైల్లో రగడ. ప్రయాణికులపై చిరు వ్యాపారస్తులు దాడి..భార్యను కడతేర్చిన భర్త..ఎన్టీఆర్‌ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్‌..కలెక్టరేట్ వద్ద వరద బాధితులు నిరసన..విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి : దామచర్ల సత్య .. గిద్దలూరు పొదిలి లలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసన.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.

👉జగన్ జైలుకెళ్ళటం ఖాయం.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘యనమల రామకృష్ణుడు*
రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు.
ఎన్సీఎల్టిలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయాడు.. అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు.. జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకేనని యనమల అన్నారు. ఇది ఆస్తుల వివాదం కాదు.. ఇది రాజకీయ ఆత్మహత్యే.

చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశాడు. వాళ్ల కుటుంబ తగాదాలు వాళ్లే రోడ్డుకీడ్చుకుని ఆ బురద మీడియాపైకి నెట్టడం హాస్యాస్పదం.
షర్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడివి అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 10ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత నాలుగైదు రోజులుగా పుంఖానుపుంఖాలుగా జగన్ అక్రమాస్తుల రగడ మీడియాలోనే కాదు, పబ్లిక్ గా జరుగుతుంటే ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల్లో కదలికలేవి..? ఒక ఆర్ధిక నేరస్తుడు 11ఏళ్లుగా బెయిల్ పై ఉండటమేమిటి అంటూ యనమల ప్రశ్నించారు. 136డిశ్చార్జి పిటీషన్లు వేసి తనపై కేసుల విచారణను ముందుకు సాగకుండా ఇలా న్యాయవ్యవస్థకు, దర్యాప్తు సంస్థలకే పెనుసవాళ్లు విసురుతుంటే భారత రాజ్యాంగం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు.
జగన్ తీరుతో ఇప్పటికే అనేకమంది వైసీపీని వీడుతున్నారు. సురక్షిత ఆశ్రయంకోసం వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఇక భవిష్యత్ లో జగన్మోహన రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే. అందుకే ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న ఆరాటంతో పోటీపడి వైసీపీ నుంచి దూకేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం మునిగిపోయిన నావ, పూర్తిగా మునిగిపోకముందే అందరూ దూకేయడం బెటర్. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయం. పాత కేసులకుతోడు కొత్త కేసులు అనేకం ఆయన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తో ఉంటే అది ఆత్మహత్యా సదృశ్యమేనని యనమల రామకృష్ణుడు అన్నారు.
కొడుకుగా తల్లిదండ్రులను మోసం చేశాడు.. అన్నగా చెల్లెళ్లను మోసం చేశాడు.. పార్టీ పెట్టి నాయకులను, కార్యకర్తలను మోసం చేశాడు.. అధికారం చేపట్టి అన్నివర్గాల ప్రజలను మోసం చేశాడు. అవినాష్ రెడ్డిని కాపాడటంకోసం సొంత చిన్నాన్న కుటుంబాన్నే మోసం చేశాడు. చిన్నాన్నను కిరాతకంగా హత్యచేసిన హంతకులకు రక్షణ కల్పించడమే కాదు, ఆ పాపంలో తానూ భాగస్వామి అయ్యాడు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి సునీత ఉసురు పోసుకున్నాడు, వాళ్ల కన్నీళ్లే వైసీపీకి శాపాలయ్యాయి. ఇప్పుడు ఏకంగా తల్లినీ, చెల్లిని ఏడిపిస్తున్నాడు. సీఎంగా గత ఐదేళ్లలో 8లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు చేశాడని జగన్ మోహన్ రెడ్డిపై యనమల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
👉జగన్ విషయంలో షర్మిలకు కాంగ్రెస్ నుంచి మరో తోడు దొరికింది! గత కొంతకాలంగా.. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా.. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంశం ఏదైనా, లక్ష్యం మరేదైనా.. “టార్గెట్ జగన్” అనే విషయంలో ఆమె అవిరామంగా దూసుకుపోతున్నారన్ని అంటుంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ నుంచి మరో వ్యక్తి తోడు దొరికిందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును… ఏపీలో షర్మిల పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ గరిష్టంగా మైకందుకున్న ప్రతీసారీ జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… జగన్ అధికారంలో ఉన్నప్పుడూ అదే తంతు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదే వ్యవహారం అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే… ఆమె అంత ఘాటుగా కాకపోయినా.. ఎంతో కొంత జగన్ పై మరో ఏపీ కాంగ్రెస్ నేత చేయడం లేదని అంటుంటారు. కారణం ఏదైనప్పటికీ… పనిగట్టుకుని మైకుల ముందుకో, ఎక్స్ వేదికగానో జగన్ పై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు లేరని.. దీంతో ఈ విషయంలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని చెబుతుంటారు. ఈ సమయంలో “నేనున్నాను” అన్నట్లుగా మాణికం ఠాగూర్ వచ్చారనే చర్చ మొదలైంది. దీనికి కారణం… తాజాగా వైసీపీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్. ఆ పోస్ట్ లో సామాన్య ప్రజానికంతో, వారిలో ఒకరిగా రాజశేఖర్ రెడ్డి కలిసి ఉన్నట్లు ఉన్న ఓ ఫోటోను కూడా జత చేసింది వైసీపీ. ఈ సందర్భంగా వైఎస్సార్ గొప్పతనం గురించి చెబుతూ ఓ వాక్యం రాసింది. ఇందులో భాగంగా… “ప్రజా సమస్యల పరిష్కారానికే మొదట ప్రాధాన్యత ఇచ్చేవారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. రోజూ ఉదయం ప్రజలను కలిసిన తర్వాతే తన దినచర్య ప్రారంభమయ్యేది” అని రాస్తూ.. #వైఎస్సార్ ఫర్ ఎవర్ అని పోస్ట్ చేసింది. దీంతో.. ఈ ట్వీట్ పై మాణికం ఠాగూర్ స్పందించారు. ఇందులో భాగంగా… “జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధనవంతుల్ని మాత్రమే కలిసేవారు. కలెక్షన్లతో బిజీగా గడిపేవారు. నిజానికి జగన్ ఎప్పుడూ వైఎస్సార్ ని అనుసరించలేదు లేదా పాటించలేదు” అని రిప్లై ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్. దీంతో… ఏపీలో జగన్ ని విమర్శించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకు ఓ తోడు దొరికిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
👉 మదనపల్లె…. అన్నమయ్య జిల్లా. రైల్లో రగడ.
ప్రయాణికులపై చిరు వ్యాపారస్తులు దాడి.
07656 తిరుపతి… గుంతకల్ రైల్లో ఘటన.
చిన్నపాటి తగాదాతో మొదలైన గొడవ..
చిరు వ్యాపారస్తులు ఒక్కటై మదనపల్లి స్టేషన్ వద్ద భార్యాభర్తల పై దాడి..అనంతపురం జిల్లా, రాఘవేంద్ర నగర్, కు చెందిన సురేష్ రేణుక భార్యాభర్తలు తిరుపతికి వచ్చి వెళుతుండగా వివాదం.రైల్వే ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన చిరువ్యాపారులు.
👉*భార్యను కడతేర్చిన భర్త. ఆత్మహత్యగా చిత్రీకరణ.*
*భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకధ.*
మచిలీపట్నం.
వలంద పాలెం, సాంఘిక సంక్షేమ హాస్టల్ సమీపంలో ఎలక్త్రిషియన్ గా పనిచేస్తున్న పేరం మల్లేశ్వరరావు భార్య శిరీష ను దారుణంగా హత్య చేసి ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. ఘటనా స్థలిలోని బంధువులను విచారించగా గత కొంతకాలంగా భార్య భర్తల మద్య వివాదం నడుస్తుందని, నాలుగు రోజుల క్రితం వేరే ప్రాంతంలో ఉండే వ్యక్తి ఇక్కడకు వచ్చాడని అతని సహకారంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బందువులు ఆరోపిస్తున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.*
👉ఎన్టీఆర్‌ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్‌.. స్థానిక మైన్స్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం.. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్‌ వసూలు చేయవద్దన్నా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌.
👉కలెక్టరేట్ వద్ద వరద బాధితులు నిరసన
NTR: వరద నష్టం పరిహారం అందలేదంటూ కొండపల్లి మున్సిపల్ ఏరియా వరద బాధితులు సోమవారం విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. వరద నష్టం పరిహారం అందజేయడంలో తీవ్రంగా జాప్యం జరిగిందని ఆందోళన చేశారు. స్పందించిన కలెక్టరేట్ అధికారులు ఇబ్రహీంపట్నం తహశీల్దార్కు అర్జీలు ఇవ్వాలని సూచించారు.
👉 ప్రకాశం జిల్లా..కొండపిలోని బి.ఆర్.అంబేద్కర్ గురుకులంలో ఏర్పాటు చేసిన జోనల్ సైన్సు ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎ.తమీం అన్సారియా
👉 విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి : దామచర్ల సత్య
విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు. మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన మూడు జిల్లాల సైన్స్ ఫెర్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సంచలన మార్పులతో పాటు సాంకేతికతను, ఆధునికతను మెరుగుపరుస్తూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకొని తమ ఫలితాలు సాధించాలని కోరారు.కళాశాలలో కావలసిన మౌలిక వసతులతో దామచర్ల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులందరూ ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన వాతావరణం లో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సత్య ఆకాంక్షించారు. ముందుగా పాఠశాల విద్యార్థులు దామచర్ల సత్యకు ఘన స్వాగతం పలికారు. కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సత్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మూడు జిల్లాల విద్యార్థులు సైన్స్ ఫెర్ లో ఏర్పాటుచేసిన నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, వసంత రాయుడు, నారాయణస్వామి, నరసారెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్, సిఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
👉 విజిలెన్స్ పై విద్యార్థులకు ట్యాలెంట్ టెస్టు.. ‌ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో అర్ధవీడు లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు అవినీతి నిర్మూలన పై విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి బహుమతి షేక్ సోని, రెండవ బహుమతి కె శివ, షేక్ సుకుర్ బాబా విద్యార్థులకు అర్ధవీడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భద్రీనాద్ బహుమతులు అందించారు.ఈ కార్యక్రమం లో ఇంచార్జి ప్రిన్సు పాల్ డి బ్రహ్మేశ్వర రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ మణికంఠ, బ్యాంకు సిబ్బంది రవి కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.
👉వలీమా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు మండలం, తాళ్లపల్లె గ్రామంలో పటాన్ హుస్సేన్ ఖాన్ కుమారుడు చి.నాయబ్ రసూల్ ఖాన్ వలీమా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.*
👉గిద్దలూరు ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహా నిరసన*
ప్రకాశం జిల్లా గిద్దలూరులో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో గిద్దలూరు ఎల్ఐసి ఏజెంట్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పాలసీల మీద జిఎస్టిని రద్దు చేయాలని ఎల్ఐసి ఏజెంట్లు డిమాండ్ చేశారు. పాలసీల మీద బోనసులు పెంచాలని ఏజెంట్లకు కమిషన్లు యధావిధిగా ఉంచాలని కోరారు. లక్ష సమ్మర్ సూడు ని ఇతర విధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, సెక్రటరీ రామకృష్ణయ్య, ట్రెజర్ ఆళ్ళబాబు మరియు ఏజెంట్లు పాల్గొన్నారు.
👉 మహా నిరసన కార్యక్రమం లో జీవిత బీమా ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పొదిలి శాటిలైట్ పరిధిలోని ఏజెంట్ సోదరులు నిరసన వ్యక్తం చేశారు..
👉 పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికుల హెల్త్ అలవెన్సు బకాయిలను తక్షణం ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యం.రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పొదిలి నగర పంచాయితీ ఆఫీసు వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా జరిగింది. ఈ ధర్నాలో రమేష్ మాట్లాడుతూ పొదిలి నగర పంచాయితీ కార్మికులకు 36నెలల హెల్త్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రతికార్మికుడికి 2,16,000 రూపాయలు హెల్త్ అలవెన్సు రావాల్సి ఉందన్నారు.16 రోజుల సమ్మె ఒప్పందాలు 10 నెలలు అయినా నేటికి అమలుకాలేదన్నారు. కనీసం పండుగ అలవెన్స్ 1000 రూపాయలు చెల్లించలేద న్నారు. అత్యంత దుర్గంధంతో కూడిన పారిశుధ్య పనులు చేస్తూ ప్రజలందరికి ఆరోగ్య బధ్రత కల్పిస్తున్న కార్మికుల సమ్మె ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయకపోగా రాజకీయ కక్షసాధింపుతో కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. కార్మికులందరికి మౌత్ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు సరఫరా చేయాలన్నారు.మహిళా కార్మికులకు వెంటనే యూనిఫాం ఇవ్వాలన్నారు. పెరుగుతన్న జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసరావుకి వినతి పత్రం సమర్పించారు.ఈ ధర్నాలో ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు)పొదిలి నగర పంచాయితీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.సుబ్బయ్య, బి.కోటేశ్వరావు,నాయకులు కె.వి.నరసింహం, జి.నాగేశ్వరావు, రామయ్య, పి.నాగేంద్రం, కోటేశ్వరమ్మ, రాజయ్యలు పాల్గొన్నారు.
👉గ్రామాల్లో లోవోల్టెజ్ సమస్యలను పరిష్కారం చేయాలి*
*ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో ట్రాన్ఫార్మర్ల కొరత,పంట పొలాలకు విద్యుత్ సప్లై, ట్రాన్ఫార్మర్స్ అవసరత మరియు గ్రామీణ ప్రాంతాల్లో లోవోల్టెజ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.నియోజకవర్గంలో సబ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని,సోలార్ విద్యుత్ సప్లై మరియు వినియోగం తదితర అంశాల పై అధికారులతో చర్చించారు.సమావేశంలో ఎలక్ట్రికల్ డీఈ మరియు ఏఈలు పాల్గోన్నారు.
*కొణతం వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*అర్ధవీడు మండలం, నాగులవరం గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి కొణతం రంగారెడ్డి కుమార్తె చి.ల. సౌ లక్ష్మిదేవి మరియు చి. విజయ్ కుమార్ రెడ్డిల వివాహా రిసెప్షన్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.*

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త