కక్షపూరిత రాజకీయాలపై విజయ్ క్లారిటీ..అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన మున్సిపల్ కార్మికులు.మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటికి నోటీసులు…”విజయమ్మ..సుబ్బారెడ్డి..బాలినేని అందుకు సరిపోతారా?”..నాని కీలక ప్రశ్న!. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి డోలా శ్రీ, ఎంపీ మాగుంట..కానిస్టేబుల్ బాషావలికి ఉత్తమ ప్రతిభ రివార్డు..

👉మద్యం షాపులకు చంద్రబాబు వార్నింగ్.. బెల్ట్ షాపుల కు మద్యం ఇస్తే భారీ జరిమానా.*
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం పై నిఘా పెట్టాలన్నారు.
👉అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన మున్సిపల్ కార్మికులు.. కమిషనర్ ఫిర్యాదుతో మున్సిపల్ ఛాంబర్ కు చేరుకున్న పట్టణ ఎస్సై, పోలీసులు….నిబంధనం విరుద్ధంగా కమిషనర్ కార్యాలయంలో ధర్నా చేయకూడదంటూ చెప్పిన ఎస్సై…తమ ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఎస్సై కాళ్లు పట్టుకున్న కార్మికులు.. ప్రకాశం జిల్లా మార్కాపురం.. ‌ అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని కోరుతూ గత 13 రోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ అధికారులు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్ చాంబర్ వద్దకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని , సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటామని సమాధానం చెప్పే వరకు బయటకు వెళ్ళమని ఛాంబర్ లో బైఠాయించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ 13 రోజులుగా కార్మికులు రోడ్లమీద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ అధికారులకు గాని, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు గాని ఏమాత్రం కనికరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తామన్న పాలకులు, అధికారులు నియమ నిబంధనలు తుంగలో తొక్కి కార్మికుల పొట్టగొట్టే చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. మా సమస్య పరిష్కారం అయ్యేవరకు మీ ఛాంబర్ వదిలి బయటకు వెళ్ళమని కార్మికులు ఛాంబర్ లో బైఠాయించి జరిగింది ఇంతలో కమిషనర్ పోలీసులకు ఫోన్ చేసి పిలవడం జరిగింది.వ్రాతపూర్వకంగా కార్మికులపై కేసు రాసి ఇవ్వడం జరిగింది. ఎస్ఐ సైదు బాబు చాంబర్లో ధర్నా చేయడం సరికాదని వారించడం జరిగింది.దీంతో కార్మికులు ఒక దశలో ఎస్ ఐ కాళ్లు పట్టుకొని మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి లేదా మమ్మల్ని చంపండి అని ఆయనకు మొర పెట్టుకోవడం జరిగింది. ఛాంబర్ లో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కార్మికుల పొట్ట కొట్టే చర్యలు మానుకోవాలని నినాదాలు ఇవ్వటం జరిగింది. మాకు కమిషనర్ హామీ ఇచ్చేవరకు మేము చాంబర్ వదిలి వెళ్ళమని కార్మికులు తెగేసి చెప్పడం జరిగింది. దీంతో కమిషనర్ కార్మికులను తాము తొలగించలేదు, కేవలం తాత్కాలికంగా పని ఆపడం జరిగిందన్నారు.మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకొని మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు బైఠాయింపు నిష్క్రమించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి సోమయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రాజు, సిఐటియు నాయకులు నాగరాజు,మున్సిపల్ యూనియన్ నాయకులు కే సుబ్బరాయుడు,యూసఫ్,పి శ్రీను, శేశిరెడ్డి, కనకయ్య,రమణ,వెంకటయ్య,అల్లూరయ్య, చెన్నకేశవులు ,సుబ్రహ్మణ్యం,కేశవ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
👉అనుమతులు లేకుండా,నిబంధనలు అతిక్రమించి బాణసంచా విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించినా నిల్వ ఉంచినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ దామోదర్ తెలిపారు. జిల్లాలో బాణసంచా తయారీ లేదా విక్రయాలు లైసెన్సు కల్గిన వారు ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి ఉండాలని, బాణసంచాలు మరియు పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదని, శాశ్వత & తాత్కాలిక బాణసంచా తయారీ లేదా విక్రయాల లైసెన్సు కల్గిన దుకాణాల్లో మాత్రమే బాణసంచా అమ్మాలని, బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకోని విక్రయించుకోవాలన్నారు. షాపుల వద్ద మండే స్వభావం కల్గిన వస్తువులు ఉంచరాదని, నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలని, ఆ పరిసరాల్లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో తగు సూచనలు చేస్తూ బోర్డులను ప్రదర్శనలో ఉంచాలి. చిన్న పిల్లలను బాణా సంచా దుకాణాల్లో విక్రయాలకు ఉంచుకోరాదన్నారని, లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని, బాణసంచా దుకాణాలకు దూరంలో వాహనాలను నిలుపుకునేలా చూసుకోవాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో అక్రమంగా తయారయ్యే టపాసులు, సరఫరా, విక్రయాలు చేసే వారిపై వారిపై నిఘా ఉంచాలని, టపాసుల స్టాల్ల్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతర తనిఖీలు నిర్వహించి మతాబుల దుకాణాల వద్ద భద్రత చర్యలను ఎప్పటికపుడు పరిశీలన చేయాలని, ముందస్తు జాగ్రత్తలు వల్లనే ప్రమాదాలను నివారించగలమని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.
దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101, పోలీస్ డయల్ 100/112 లకు లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 లేదా స్థానిక పోలీసుల కు గాని తెలియ చెయ్యాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఉంటే పోలీసులకు తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ గారు తెలియచేసినారు.
👉పొదిలి విశ్వనాధపురం లోని పాత వెంకటేశ్వర థియేటర్ సమీపంలో రాబోయే దీపావళి పర్వదిన సందర్భంగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించి రేపు ఉదయం 11 గంటలకు పొదిలి పోలీస్ స్టేషన్లో బాణా సంచా దుకాణాల నిర్వహకులకు దీపావళి పర్వదిన రోజున తీసుకోవలసిన జాగ్రత్తలపై కౌన్సిలింగ్ ఇవ్వనున్న ఎస్సై వి.వేమన..
👉కక్షపూరిత రాజకీయాలపై విజయ్ క్లారిటీ.. వారిపై సెటైర్స్! ఈ సందర్భంగా సుమారు 10 నుంచి 20 కి.మీ. మేర వాహనాల బారులే కనిపించాయి. “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) పార్టీ తొలి రాష్ట్రస్థాయి మహానాడును విళుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలో ఆదివారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమారు 10 నుంచి 20 కి.మీ. మేర వాహనాల బారులే కనిపించాయి. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ ప్రసంగంలో పలు ఆసక్తికర, కీలక, సంచలన విషయాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా… ఎంచుకున్న అంశల్లో స్పష్టత ఉండటంతో పాటు ఆ విషయాన్ని నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అంతే స్పష్టంగా చెప్పడంలోనూ విజయ్ సక్సెస్ అయ్యారని అంటున్నారు. అవును… టీవీకే పార్టీ తొలి రాష్ట్ర స్థాయి మహానాడులో జోసఫ్ విజయ్ ప్రసంగం ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో భాగంగా… “సమాజంలో విభజనలు సృష్టిస్తున్న ఓ సమూహం ఉంది.. వారే మనకు మొదటి శత్రువులు”..అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్. తన దగ్గర సర్దుబాటు రాజకీయాలు లేదా రాజీలు ఉండవని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో… ద్రావిడ భావజాలాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకుంటూ.. తమిళనాడును కుటుంబ వ్యాపారంగా దోచుకుంటున్న వారు తమ తదుపరి ప్రత్యర్థులని అన్నారు. ప్రధానంగా… బీజేపీ తమకు సైద్ధాంతిక ప్రత్యర్థి అయితే.. డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. అదేవిధంగా తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. సామాజిక నిబద్ధతతోనే ప్రజాసేవలోకి వచ్చానని అన్నారు. ఇదే సమయంలో…ద్వేషపూరిత రాజకీయాలు ఉండవని, ఇక వెనక్కి తిరిగి చూడకూడదని మద్దతుదారులకు క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో… తమ సిద్ధాంత నాయకుడు తందై పెరియార్ అని..మహిళాభ్యున్నతి, స్త్రీ విద్య, సామాజిక న్యాయం, హేతువాదం వంటి పెరియార్ సిద్ధాంతాలను కచ్చితంగా చేతుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నాదురై చెప్పినట్లు ఒకటే కులం, ఒకటే దైవం అనేది తమ వైఖరని స్పష్టం చేశారు. న్యాయమైన పాలనకు – లౌకికవాదానికీ ఆదర్శంగా ఉన్న మాజీ సీఎం కామరాజర్ ను తమ మార్గదర్శకునిగా స్వీకరిస్తామని.. కులనిర్మూలనకు పోరాడిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను తమ మార్గదర్శకునిగా చెప్పడానికి గర్విస్తున్నామని.. బ్రిటీష్ వారిపై పోరాడిన అంజలై అమ్మాళ్, వేలునాచ్చియార్ లు తమ సిద్ధాంత నాయకులని పేర్కొన్నారు.
👉మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటికి నోటీసులు..హైదరాబాద్:
జన్వాడలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దావత్, వ్యవహారం కొత్త మలుపు తిరిగింది, రాజ్ పాకాల పరారీలో ఉండటంతో పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు.
తమ విచారణకు రావాలని, లేకుంటే ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని రాజ్ పాకాలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. జువ్వాడ పార్టీ కేసులో విచారణ చేయాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడ్రస్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని, విచార ణకు సహకరించాలని కోరారు. BNSS యాక్ట్ (35) సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.
హైకోర్టుకు రాజ్ పాకాల…నిన్నటి నుంచి రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన ఇంటివద్ద కూడా కనిపించడం లేదు.దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రాజ్ పాకాల పిటీషన్ లో కోరారు. హైకోర్టులో రాజ్ పాకాల పిటీషన్ పై విచారణ ఎప్పుడు జరుగుతుంద న్నది,మాత్రం తెలియ రాలేదు. దీనికి సంబంధిం చిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
👉జన్వాడ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు..
తెలంగాణ: జన్వాడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.అయితే రాజ్ పాకాల, విజయ్ మద్దూరి నిన్న విచారణకు హాజరు కాలేదు. పార్టీ జరిగిన రోజు విజయ్ మద్దూరి తన ఫోన్ బదులు వేరే మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు.అయితే ఆ మహిళా తన ఫోన్ ఇవ్వాలంటూ మోకిల ఠాణా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను ఇస్తామని వెల్లడించారు.
👉 మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్..
తెలంగాణ: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది.మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచు కుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. ఆటో డ్రైవర్‌ నర్సింహులు అదే అదనుగా భావించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు.అనంతరం బాధితురాలు జగదేవ్‌పూర్‌ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఇంచార్జ్ హైదర్ అలీ..
👉”విజయమ్మ..సుబ్బారెడ్డి..బాలినేని అందుకు సరిపోతారా?”..నాని కీలక ప్రశ్న!
ఏపీలో రాజకీయాలో వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహరం ఇప్పుడు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో రాజకీయాలో వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహరం ఇప్పుడు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అటు నుంచి షర్మిల ఒకటి అంటే.. ఇటు వైసీపీ నేతల నుంచి నాలుగు పడుతున్నాయి. వాటికి తిరిగి ఆమె తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.* పెదరాయుడు’ సినిమాలో రజనీకాంత్ లా జగన్.. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలా షర్మిలా వ్యవహారం ఉందంటూ సింగిల్ లైన్ లో కన్ క్లూజన్ ఇచ్చేస్తున్నారు వైసీపీ నేతలు. తల్లిపై కోర్టులో కేసు వేసిన కొడుకుగా జగన్ నిలిచిపోతారన్నట్లు షర్మిళ కూడా సింగిల్ లైన్ పైనే కీలకంగా వాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో పలువురు వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించగా.. తాజాగా వైఎస్ ఫ్యామిలీకి బందువు, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ ముందుకు రావాలని.. ఇద్దరికీ న్యాయం చేయాలని సూచించారు. ఇదే సమయంలో… తానైనా, ఇతరులు అయినా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని అన్నారు. ఇక.. తాను ఏ పార్టీలో ఉన్నా.. వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. దీంతో… ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. అవును.. జగన్ – షర్మిల ఆస్తుల వ్యవహారంపై బాలినేని వ్యాఖ్యానించిన వేళ పేర్ని నాని స్పందించారు. ఇందులో భాగంగా… జగన్ – షర్మిల మధ్య నెలకొన్న వివాదం విషయంలో… అటు విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి జడ్జిలుగా ఉంటానికి సరిపోతారా అని ప్రశ్నించారు.
👉విజయమ్మ అటు పక్క, సుబ్బారెడ్డి ఇటు పక్క, బాలినేనేమో పవన్ కల్యాణ్ పక్క ఉన్నారని.. వీళ్లు ముగ్గురూ జడ్జిలుగా ఉంటానికి సరిపోతారా అని ప్రశ్నించారు. జడ్జి అంటే మధ్యలో ఉండాలని అన్నారు. ఇదే సమయంలో… ఈ పార్టీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారు? అవసరాల కోసం చేసే రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు.. ఇప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు!
👉 వెలిగొండ ప్రాజెక్ట్ పరిశీలనలో భాగంగా దోర్నాల లోని వెలిగొండ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి,ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి,యర్ర గొండపాలెం నియోజకవర్గం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు,20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్, బెజవాడ సురేష్ రెడ్డి కలిశారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్ రెహమాన్

👉 పెద్ద దోర్నాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని డా.వైద్య సంజు,డా.కాశీ రావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
👉కానిస్టేబుల్ బాషావలికి ఉత్తమ ప్రతిభ రివార్డు.. బాషాను అభినందించిన సిఐ, ఎస్సై..

*యర్రగొండపాలెం సర్కిల్ పోలీసు శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను చూపి,నాలుగు కీలక కేసులను త్వరితగతిన ఛేదించినందుకు పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ పి బాషావలి ఉత్తమ ప్రతిభ రివార్డు ప్రకటించారు.యర్రగొండపాలెం పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న బాషావలి పట్టణంలోని పలు దొంగతనాలు, హత్య కేసులలో నిందితులను గుర్తించడంలో త్వరగతిన స్పందించి కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించారు.బాషా సేవలను గుర్తించిన పోలీస్ ఉన్నతాధికారులు బాషాకు ఉత్తమ ప్రతిభ రివార్డు ప్రకటించారు,ఆ రివార్డును సీఐ ప్రభాకర్ రావు బాషా కు అందజేశారు.ఈ సందర్భంగా సిఐ ప్రభాకరరావు, ఎస్సై చౌడయ్య బాషావలికి అభినందనలు తెలిపారు.
👉యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌..
ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి అప్పుల పాలై బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ వద్ద ఉన్న ఓ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన గణేశ్‌ భారీగా అప్పులు చేశాడు. ఇటీవల కాలేజీ ఫీజు కట్టేందుకు తల్లి దగ్గర రూ.80 వేలు తీసుకొని, వాటిని కూడా గేమ్‌లో పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్‌ సోమవారం పురుగుల మందు తాగి చనిపోయాడు.

7k network
Recent Posts

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు