👉నకిలీ పత్రాలతో రౌడీ షీటర్ పై కేసులు మాఫీచేసిన కానిస్టేబుల్*..గుంటూరు..
వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు రమేశ్ గాంధీ పేరిట నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి అదే పేరుతో ఉన్న రౌడీషీటర్ పై పట్టాభిపురం స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ కేసులు తీసివేయించాడు. రమేష్ గాంధీ పై పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి.ఈ అవకాశాన్ని అదనుగా భావించిన కానిస్టేబుల్ గుంటూరుకు చెందిన రమేశ్ అనే షీటర్ పై కేసులు తీసివేయించాడు. దీంతో అతడిని విధుల నుంచి అధికారులు శనివారం సస్పెండ్ చేశారు.
👉నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా*
*రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు శస్త్ర చికిత్సలు..*
*వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కూలీకి అరచేతి పక్షవాతం.. రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశం*
*ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు జింకా రెడ్డి శేఖర్ తీర్పు*..వైద్యుల నిర్లక్ష్యంపై శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి *జింకా రెడ్డి శేఖర్* తీర్పు ఇచ్చారు. ఓ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించి అరచేతి పక్షవాతానికి కారణమైనట్లు నిర్ధారించి.. బాధితుడికి రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలంటూ నెల్లూరు నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు…*వివరాల్లోకి వెళితే..*
నెల్లూరు కొడవలూరుకు చెందిన షేక్ మక్సూద్ భవన నిర్మాణ కూలిగా జీవనం సాగించేవాడు. 2009 నవంబరు 28న పని చేస్తుండగా కింద పడటంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన తరువాత ఓ వైద్యుడు శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించగా.. డిసెంబర్ 1న లాంగ్ బోన్ ఫ్రాక్చర్ కు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 2009 డిసెంబర్ 12న డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ తరువాత విపరీతమైన చేతి వాపు, నొప్పితో ఫిబ్రవరి నెలలో నారాయణ హాస్పిటల్ కు వెళ్ళగా పరీక్షించిన తరువాత బాధితుడికి రేడియల్ నరాల యొక్క న్యూరోప్రాక్సియా వచ్చిందని నిర్ధారించారు. ఇంకో సారి శస్త్ర చికిత్స చేయాలని సూచించగా బాధితుడు 2010 ఫిబ్రవరి 26న మరలా రెండవ సారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. రెండవ సారి శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత కూడా ఫలితం లేకపోయింది. బాధితుడికి అరచేతి పక్షవాతం వచ్చింది. ఆ తరువాత అదే ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
*వినియోగదారుల కోర్టులో విచారణ..*
మొదటి శస్త్ర చికిత్స తరువాత వైద్యుడు సూచించిన జాగ్రత్తలు, నియమాలు పాటించకపోవడంతో బాధితుడుకి న్యూరో ప్రాక్సియా వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్, రెండవ శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు కోర్టుకు తెలిపారు. రెండవ శస్త్ర చికిత్సకు ముందు బాధితుడికి శస్త్ర చికిత్స తరువాత కాంప్లికేషన్స్ వస్తాయని వివరించి హై రిస్క్ కన్సెంట్ ఫార్మ్ మీద బాధితుడి, అతని భార్య వద్ద నుండి సంతకం తీసుకున్న తర్వాతే చికిత్స చేశామని, శస్త్ర చికిత్స చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్నామని.. అయినా కాంప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. న్యాయమూర్తి కేసు షీట్స్, ఆపరేషన్ నోట్స్, హై రిస్క్ కన్సెంట్ ఫార్మ్ లను కోర్టులో సమర్పించమని అడగగా ఆసుపత్రి యాజమాన్యం సమర్పించలేదు. మొదటి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు విచారణకు హాజరు కాలేదు. ఆసుపత్రి యాజమాన్యం బాధితుడిపై చేసిన నిందలను డాక్యుమెంట్ల ద్వారా నిరూపించలేదని తీర్పులో పేర్కొన్నారు.
బాధితుడు కోర్టుకు సమర్పించిన మెడికల్ ఒపీనియన్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల సర్టిఫికెట్, గుర్తింపు కార్డును పరిశీలించిన న్యాయమూర్తి రెడ్డి శేఖర్ ఆపరేషన్ తరువాత వైద్యుల నిర్లక్ష్యంతో వచ్చిన ట్రామా వల్లనే బాధితుడికి అరచేతి పక్షవాతం వచ్చిందని నిర్ధారించాడు.
*రూ.5 లక్షలు జరిమానా*
బాధితుడు నారాయణ ఆసుపత్రిలో మందులకు, శస్త్ర చికిత్స తరువాత చేసుకున్న ఫిజియోథెరపీకి రూ.1,490లు చెల్లించినట్లు బిల్లులు సమర్పించాడు. దీంతో బాధితుడి వద్ద నుంచి తీసుకున్న రూ.1,490,
శారీరక, మానసిక వేదనకుగాను బాధితుడికి రూ.5 లక్షలు.. మొత్తం రూ.5,01,490లు నష్ట పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు బాధితుడికి చెల్లించాలని శుక్రవారం నెల్లూరు నారాయణ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు *న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్* ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. 45 రోజుల్లో పరిహారం చెల్లించకపోతే తీర్పు వెలువడిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తీర్పు కార్యక్రమంలో సభ్యురాలు బాలసుధ పాల్గొన్నారు.
👉 జన్వాడ రేవ్ పార్టీలో వ్యాపారవేత్త విజయ్ మద్దూరి
విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ నిర్థారణ
విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
NDPS యాక్ట్, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు..రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు ప్రముఖులు..
రేవ్ పార్టీ వివరాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు..పోలీసులు రావడానికి కొద్దిసేపటి ముందే ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారంటూ ప్రచారం..
రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో అర్థరాత్రి పార్టీలు నిత్యకృత్యమని అంటున్న స్థానికులు..
👉 రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్నాం.
పోలీస్ ఇమేజ్ ను కాపాడటం మన బాధ్యత.
పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటివి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది.
ఇలా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం సరికాదు.
సీనియర్ పోలీస్ అధికారులుగా మీ సమస్యల పరిష్కారానికి మేము హామీ ఇస్తున్నాము.
దర్బార్ లో మీ సమస్యలు చెప్పుకోవచ్చు.
తెలంగాణ డీజీపీ జితేందర్
👉 కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై స్పెషల్ పార్టీ, Cyberabad SOT పోలీసుల దాడులుజన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ రాజ్ పాకాల ఫాం హౌస్ లో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేసిన పోలీసులుడ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కోకయున్ డ్రగ్ పాజిటివ్ కొకయున్ తీసుకున్నట్టు గా డ్రగ్ టెస్ట్ లో తేలడం తొ Ndps యాక్ట్ కింద కేసు నమోదురాజ్ పాకాల ఫాం హౌస్ లో జరిగిన పార్టీ పై డ్రగ్స్ Ndps యాక్ట్ కేసు నమోదు భారి శబ్దాలతో పార్టీ నడుస్తున్న సమాచారం రావడంతొ పోలీసుల తనఖీలుడయల్ 100 కు ఫోన్ రావడం తో పోలీసుల తనఖీలుమరో వైపు భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్న పోలీసులుదొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన పోలీసులు. Section 34, Excise Act కింద మరో కేసు నమోదు.
👉 ఏపీలో టీచర్ల బదిలీలకు చట్టం!
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలపై ఆ శాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజు సంఘాలతో చర్చలు నిర్వహించారు. ప్రధానంగా టీచర్ల బదిలీలకు చట్టం తేవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో డిసెంబరు నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలని
ప్రభుత్వం నిర్ణయించింది.
👉 అక్రమంగా కేసులు పెట్టారని తమకు న్యాయం చేయాలని ఓ జంట పెట్టిన వీడియోలు ప్రస్తుతం నెట్ ఇంట్లొ హల్చల్ సృష్టిస్తున్నాయి.. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లోని సీఐ పవన్ కిషోర్ గారు, క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ మరియు కానిస్టేబుల్ ఆరిఫ్ అరాచకాల నుండి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నాము. ఈ వీడియో క్లిప్ సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ , మంత్రివర్యులు లోకేష్ బాబుకి, హోం మినిస్టర్ అనితలకు, జడ్జీలకు చేరే విధంగా షేర్ చేయవలసిందిగా అందరినీ కోరుచున్నామని…ప్రసాద్, ఆమని పెట్టిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ సృష్టిస్తున్నాయి.
👉సెబీ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచే*
వచ్చే నెల (నవంబర్) 1 నుంచి మ్యూచువల్ ఫండ్ కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC)
ఒక పాన్ ద్వారా యూనిట్లలో రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని లావాదేవీలు రెండు రోజుల్లోగా కంప్లయెన్స్ అధికారికి వెల్లడించవలసి ఉంటుంది. ఆయా లావాదేవీల వివరాలను రెండు పని దినాల్లోగా తెలియజేయవలసి ఉంటుంది.
👉దీపావళికి క్రాకర్స్ కాల్చటంపై పోలీసుల ఆంక్షలు*
హైదరాబాద్ :
దీపావళి పండుగ అంటేనే పటాకులు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టుగా జనాలు భావిస్తుంటారు.
దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి వరకు ఈ మోత మోగుతూనే ఉంటుంది,అయితే.. దీపావళి వేళ హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. క్రాకర్స్ కాల్చటం పై ఆక్షలు విధించారు.
ఎంతో ఉత్సాహంగా పెద్ద ఎత్తున పటాకులు కాల్చా లని భావిస్తున్న వారికి పరిమితులు విధిస్తూ తాజాగా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కువ శబ్దంతో వచ్చే బాణాసంచా కాల్చకూడదం టూ, పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.
దీపావళి పండగ రోజున.. హైదరాబాద్ నగరంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలని.. హైదరాబాద్ పోలీసులు పరిమితి విధించారు. కేవలం ఈ రెండు గంటల్లోనే టపాసు లు కాల్చాలని.. ఆ తర్వాత ఎలాంటి బాణాసంచా కాల్చొద్దని హెచ్చరించారు.
ఈ రెండు గంటల సమయంలోనూ.. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చటంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం.. 55 డెసిబెల్స్ మించి శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చొద్దని పోలీసులు హెచ్చరించారు.. తెలంగాణ ఇంచార్జ్ హైదర్ అలీ..
👉 పలాస నియోజకవర్గంలో రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరాయి. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడైన అల్లూరామణ పై టీడీపీ నేతలు శనివారం హత్యాయత్నం చేసినట్లు సమాచారం. అల్లూరామణ, దాడికి సంబంధించిన ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఇతర వైసీపీ నేతలు మన్మథరావు తో పలువురు వ్యక్తులపై కూడా టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న టీడీపీ సీనియర్ నేతలు పీరుకట్ల విఠల్, బడ్డ నాగరాజు, మరియు సప్ప నవీన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. చుట్టూ పోలీసులు ఉన్న దాడిని అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయారని వైసీపీ శ్రేణులు వాపోతున్నారు.
ఈ ఘటన పై వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ, మైనర్ బాలికలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులపై దాడులు జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. పలాసలో జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇంటి నుంచి బయలుదేరిన అప్పలరాజును పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అప్పలరాజు బయటకు వస్తే శాంతి భద్రతలకు భంగం ఏర్పడుతుంది అంటూ పోలీసులు చెపుతున్నారు. మరోపక్క పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ, “తమకు రక్షణ కల్పించడం లేదు” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
**దాడి కి ముందు సజ్జల తో భేటీ*..అప్పిరెడ్డి, రఘురాం, నందిగం,అవినాశ్ సమావేశమై మాట్లాడారు
వారి ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపైకి దాడికి వెళ్లాం..
అక్కడ పట్టాభి ఉంటే చంపాలనుకున్నాం..
సీఐడీ విచారణలో కీలక విషయాలు వెల్లడించిన చైతన్య!
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైసీపీ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ భేటీ అయ్యారని ప్రధాన నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న చైతన్యను కోర్టు మూడు రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు చైతన్య విచారణకు సహకరించకపోగా, కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించినట్లు తెలిసింది. కాగా రెండో రోజు దాడికి సంబంధించి కీలక విషయాలను సీఐడీ విచారణలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులు తియ్యగూర గోపిరెడ్డి, పేరూరి అజయ్, రామిశెట్టి విశాల్ తదితరులతో తాను నాజ్ సెంటర్లో ఉండగా వైసీపీ నేత నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి ఫోన్ చేసి వెంటనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని చెప్పాడని చైతన్య పేర్కొన్నారు. అంతేగాక అనుచరులను సిద్ధంగా ఉంచమని చెప్పాడన్నారు. ఉమామహేశ్వరరెడ్డి నాజ్ సెంటర్‌కు రాగా..
తామంతా కారులో తాడేపల్లికి వెళ్లామని తెలిపారు. ఆ సమయంలో కారులో ఉమామహేశ్వరరెడ్డితో పాటు గడ్డంతో ఉన్న మరో వ్యక్తి ఉన్నాడని, అయితే అతడు ఎవరో తనకు తెలియదని చెప్పాడు. తాము వైసీపీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో అప్పిరెడ్డి, రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ తదితరులు సమావేశమై ఉన్నారని పేర్కొన్నాడు. ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి వచ్చిన ఆదేశాలతో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 200 మంది వరకు కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయంపై దాడికి బయలుదేరామని చైతన్య వివరించాడు. జగన్‌ను ధూషించిన పట్టాభి అంతు చూడాలని అనుకున్నామన్నాడు. కొంత మంది టీడీపీ ఆఫీసులో పట్టాభి ఉండే చంపేయండి రా! అంటూ కేకలు వేశారని, ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో అక్కడున్న వారిని కొట్టామని చెప్పినట్టు తెలిసింది. దేవినేని అవినాశ్ మరికొందరు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి తీరును పరిశీలించారని తెలిపారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంగళగిరి రూరల్ సీఐ,ఓ కానిస్టేబుల్‌పై తాను దాడి చేశానని పానుగంటి చెప్పాడు. దాడి అనంతరం ఖాజా మొహిద్దిన్, బత్తుల దేవానంద్, అచ్చాల వెంకటరెడ్డి తదితరులతో తాను ఏపీ07 బీఈ 2345 నంబరు గల కారులో తిరిగి వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లినట్లు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
👉 వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదని ఏపీ పీసీసీ *అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.**
ఇప్పటికీ అద్దంలో చూసుకుంటే.. వైఎస్ జగన్‌కి చంద్రబాబే కనిపిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ని ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం వైఎస్‌ఆర్ బిడ్డనైన తనకు లేదని. ఎన్నటికీ రాదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
ఆస్తి వివాదం నేపథ్యంలో సోదరుడు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య లేఖాస్త్రాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్యలో స్పందించిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డికి షర్మిల్ ఇవాళ (ఆదివారం) గట్టి కౌంటర్ ఇచ్చారు. ”మీరు చదివింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా?” అంటూ విజయసాయిరెడ్డిని ఆమె ప్రశ్నించారు.
*విజయసాయిరెడ్డికి చురకలు*
ఆస్తుల గురించి నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమాన వాటా ఉంటుందన్నది వైఎస్ఆర్ మ్యాండేట్ అని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ” విషయం అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?. మీరు సైతం జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే మీరు. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే” అంటూ విజయసాయిరెడ్డికి చురకలంటించారు.
*కాంగ్రెస్ కారణం కాదు…**
ఇక వైఎస్ఆర్ మృతికి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ కారణం కాదని షర్మిల అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వైఎస్ఆర్ తీసుకొచ్చారని అన్నారు. అలాంటి బంగారు బాతును ఎవరు చంపుకోరన్నారు. సొంత కళ్లను ఎవరజ పొడుచుకోరని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే … మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు గాడిదలు కాశారా? అని ఆమె ప్రశ్నించారు.
వైఎస్ఆర్ మరణం, చంద్రబాబు పాత్రపై ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను నిలదీశారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదన్నారు. దోషులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. అనుమానం ఉండి.. ఈ ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా? అంటూ సోదరుడు వైఎస్ జగన్‌కు వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు.
*తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు**
వైఎస్ఆర్ మరణానంతరం చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? అని విజయసాయిరెడ్డిని నిలదీశారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని ప్రశ్నించారు.
**సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి**
అయితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవన్నారు. గతంలో వైఎస్ఆర్ తన బిడ్డ వివాహానికి చంద్రబాబు నాయుడుని పిలిచారన్నారు. అలాగే తాను సైతం చంద్రబాబును తన కుమారుడి వివాహానికి పిలిచానని చెప్పారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును పెళ్లికి ఆహ్వానిస్తే.. తన చీర రంగు గురించి సైతం విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు.. సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి? అంటూ సోదరుడు వైఎస్ జగన్‌పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.
👉సంచలనంగా మారిన జగన్ , షర్మిలా రెడ్డి మధ్య లేఖలు..!!*
రాజీ కోసం తల్లికి, చెల్లికి ఆగస్టు 27 న జగన్ లేఖ
లేఖలో షర్మిలకు షరతులు విధించిన జగన్..తనపై, భారతి పై, అవినాష్ పై విమర్శలు చేయొద్దని కండీషన్..
తల్లి, చెల్లి నుంచి స్పందన లేకపోవడంతో తానే రాసిచ్చిన ఆస్తుల కోసం సెప్టెంబర్ 9న మళ్ళీ కోర్టుకెళ్ళిన జగన్..
అన్న కేసు గురించి తెలిసి జగన్‌కు సెప్టెంబర్ 12న షర్మిల లేఖ…తన రిప్లయ్‌లో జగన్ షరతులను కొట్టిపారేసిన ..నా కెరీర్‌ను, నా రాజకీయాలను నిర్దేశించడానికి మీరెవరు ?..ఆస్తుల్లో నలుగురికీ సమానవాటాలు దక్కాలనేది నాన్న ఆకాంక్ష..నాన్న ఆశలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా మీరు ఆలోచిస్తున్నారు..సాక్షి మీడియాలోనూ నాకు తీరని ద్రోహం చేశారు..నాన్న కలలో కూడా ఊహించని విధంగా అమ్మపై, నాపై కేసులు పెట్టారు..సరస్వతి పవర్‌లో అమ్మకు ఇచ్చిన షేర్లు మీరు రాసి ఇచ్చినవి కావా ?..ఆస్తుల్లో నాకు ఎలాంటి హక్కులు లేకుండా చేయకూడదనే మీ దుర్బుద్ధి అర్థమైంది..
మీరు ఎన్ని చేసినా నా గమ్యాన్ని మీరు అడ్డుకోలేరు-షర్మిల
👉టంగుటూరు మండలం.*కొణిజేడు గ్రామంలో*
*చెరుకుమల్లి ప్రసాద్, చిన్నమ్మాయి కుమారుడు బ్రహ్మయ్య వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండల నాయకులు
👉కంభంలో రక్తదాన శిబిరం..
కంభం పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణదినోత్సవంలో భాగంగా ఆదివారం కంభం పోలీస్ స్టేషన్ఆవరణలో రక్తదానశిబిరాన్ని మార్కాపురండీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో విలేకరులు మరియు పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ..రక్త దానం చేయడం వల్ల ఓ ప్రాణం కాపాడిన వారవుతారని,రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కంభం సిఐ మల్లికార్జున్ రావు,కంభం ఎస్త్సె నరసింహరావు, బేస్తవారిపేట ఎస్త్సె రవీంద్రరెడ్డి, అర్థవీడు ఎస్త్సె సుదర్శన్ మరియు పోలీసు సిబ్బందిపాల్గొన్నారు.
👉మార్కాపురం నియోజకవర్గంలోన తర్లుపాడు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, మార్కాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ జడ్పిటిసి వెన్న ఇందిరా, ఎంపీపీ సుబ్బారెడ్డి భూలక్ష్మి , సర్పంచ్ పల్లె పోగు వరాలు,స్కూల్ చైర్మన్ వెన్న రాజారాం రెడ్డి, అపూర్వ విద్యార్థులు, నాయకులు,పాల్గొన్నారు. డివిజన్ ఇంచార్జ్ అస్లాం బేగ్.
సంచలనంగా మారిన జగన్, షర్మిలా రెడ్డి మధ్య లేఖలు..!!*నకిలీ పత్రాలతో రౌడీ షీటర్ పై కేసులు మాఫీచేసిన కానిస్టేబుల్.. అక్రమంగా కేసులు పెట్టారని తమకు న్యాయం చేయాలని ఓ జంట పెట్టిన వీడియోల హల్ చల్..నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా..బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన..కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై స్పెషల్ పార్టీ.. పలాసలో తారాస్థాయికి చేరిన రాజకీయ కక్షలు.. జన్వాడ రేవ్ పార్టీ సంచలనం.. మార్కాపురంలో ఎంపీపీ మాగుంట.. కంభంలో రక్త దానం..
Recent Posts