👉 నేటి నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
మధ్యాహ్నం 2.40 గంటలు తిరుపతి చేరుకోనున్న చంద్రబాబు..తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణిని ప్రారంభించనున్న సీఎం..రాత్రికి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో మూడు రోజుల పాటు నారావారిపల్లెలో ఉండనున్న చంద్రబాబు..స్వగ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, బ్యూటిఫికేషన్, సబ్ స్టేషన్, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్న సీఎం చంద్రబాబు..
👉వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6,700 కోట్లు విడుదలకు సీఎం ఆమోదం – సంక్రాంతి పండుగ కానుకగా బకాయిలు చెల్లిస్తున్నాం* –
ఆర్ధిక శాఖ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగింది.
విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు – ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు రూ.519 కోట్లు చెల్లింపు – పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు చెల్లింపు – సీపీఎస్‌కు సంబంధించిన రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం – టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు రూ.265 కోట్లు చెల్లిస్తున్నాం – ఉద్యోగులకు మొత్తం రూ.1,300 కోట్లు విడుదల చేస్తున్నాం
విద్యార్థుల ఫీజురీయింబర్స్ బకాయిలు రూ.788 కోట్లు ఇస్తున్నాం – చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రూ.586 కోట్లు విడుదల చేస్తున్నాం – రూ.10 లక్షల్లోపు బిల్లులున్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు లబ్ధి – అమరావతి రైతుల కౌలు బకాయిలు రూ.241 కోట్లు చెల్లిస్తున్నాం –
6 వేల మంది చిరువ్యాపారులకు రూ.వంద కోట్లు విడుదల ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.500 కోట్లు విడుదల చేస్తున్నాం – విద్యుత్‌శాఖకు రూ.500 కోట్లు విడుదల చేస్తున్నాం – ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం : మంత్రి పయ్యావుల కేశవ్ఆన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! కేరళలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన తెరపైకి వచ్చింది. కేరళలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఓ 18 ఏళ్ల అథ్లెట్ పై సుమారు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడగా.. వారిలో ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కోచ్ లు, సహకరించాల్సిన తోటి ఆటగాళ్లు కూడా పలు మార్లు ఈ పనికి పాల్పడ్డారని ఆమె వెళ్లడించారని తెలుస్తోంది! అవును… ఓ అమానవీయ ఘటన కేరళలో వెలుగు చూసింది. ఇందులో భాగంగా.. ఓ 18 ఏళ్ల అథ్లెట్ పై సుమారు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఘటన తెరపైకి వచ్చింది. తన 13వ ఏట నుంచే ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పిన ఆ యువతి.. చివరకు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తన ఆవేదనను పంచుకోవడంతో ఈ అమానుషం బయటకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పలు దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. బాధితురాలు 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లాడని.. ఆ సమయంలో అతడితో పాటు అతని స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని వాపోయింది. ఈ క్రమంలో తనపై పలువురు కోచ్ లు, తోటి ఆటగాళ్లు కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపిందని చెబుతున్నారు. అయితే.. ఇంత జరిగినా భయంతోనే ఇన్నాళ్లూ ఈ విషయం బయట పెట్టలేదని ఆమె పేర్కొంది. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో పథనందిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో సుమారు 62 మంది అనుమానితులను గుర్తించగా.. వీరిలో దాదాపు 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిని షెల్టర్ హోం కు తెరలించినట్లు చెబుతున్నారు.
👉 యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ఇవే! అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో చెలరేగిన కార్చిచ్చు ఊహించని నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో చెలరేగిన కార్చిచ్చు ఊహించని నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా లక్షల కోట్ల నష్టాన్ని కలిగించిందని చెబుతున్నారు. వేల కట్టడాలూ బూడిదవ్వగా.. లక్షల మంది ప్రజలు తట్టా బుట్టా సర్ధుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ సమయంలో భారతీయ సంతతి ప్రజలు స్పందిస్తున్నారు. అవును… లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు తీవ్ర వినాశనాన్ని కలిగిస్తుందని అంటున్నారు. ఈ కార్చిచ్చుతో ఇప్పటివరకూ పదిమంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 వేల కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్చిచ్చు కారణంగా సంభవించిన ఆస్తినష్టం విలువ సుమారు 150 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్లు) కు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. మరోపక్క.. సుమారు మూడున్నర లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేయగా.. వేల ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి.ఈ సమయంలో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక దళాలకు శక్తికి మించిన పనిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ లో ఆఫీసులు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాలిఫోర్నియాలోని భయానక అనుభవాలను పంచుకుంటున్నారు భారతీయ అమెరికన్లు. ఈ సందర్భంగా స్పందించిన భారతీయ సంతతికి చెందిన మొయిరా శౌరీ ఈ దృశ్యాన్ని సంపూర్ణ వినాశనంగా అభివర్ణించారు. ఆమె ఫ్యామిలీ లాస్ ఏంజెలిస్ లోని డౌన్ టౌన్ హోటల్ ను బలవంతంగా ఖాళీ చేయాల్సి వచ్చినట్లు తెలిపారు.. పరిస్థితులు తారు మారైనట్లు వెల్లడించారని అంటున్నారు! ఒకప్పుడు కుబేరుల కాలనీగా, సెలబ్రెటీల స్ట్రీట్ గా ఉంటూ సంపదతో తులతూగిన లాస్ ఏంజెలెస్ నగరం నేడు మరుభూమిని తలపిస్తోందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎగసిపడుతున్న మంటలు, పొగ.. అంతరిక్షంలోని ఉగ్రహాలకూ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
👉 ప్రకాశం: సింగరాయకొండలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
అదుపుతప్పి లారీని ఢీకొన్న కావేరి ట్రావెల్స్ బస్సు
ఐదుగురికి గాయాలు, రిమ్స్ ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు
👉 *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..*ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
హైదరాబాద్ నుంచి విజయవాడ కు బంగారం డెలివరీ కి వెళ్ళే క్రమంలో బంగారం తో పరార్ కారు డ్రైవర్…
హైదరాబాద్ నుంచి విజయవాడ కు
3 గురు,వ్యక్తులు విజయవాడ షాపు కి డెలివరీ చేసే క్రమంలో ఆభరణాలతో తోటి వారిని ఏమార్చి సినిమా పక్కిలో డ్రైవర్ పరారైన ఘటన…
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగ్గయ్యపేట సమీపంలో ,ఫుడ్ ప్లాజా వద్ద టీ కోసం కారు ఆపిన సమయం కారులో వాటర్ బాటిల్ తీసుకొని వస్తానని డ్రైవర్ వెళ్లి కారు లో ఉన్న గోల్డ్ తో పరారీ…
కారుకు జిపియస్ ట్రాకర్ ఉండటం తో నందిగామ వద్ద కారు వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిన కార్ డ్రైవర్ జితేష్… నందిగామ ఏసీపి ఆఫీసులో ఫిర్యాదు చేసిన బాధితుడు…6 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు…
👉తిరుమల.* *టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..*
*తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*
*100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు..*
*అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తింపు…*
*తిరుమల పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు..
👉ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఫోకస్ హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో మరో కీలక నగరాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. అత్యంత సులభతరమైన వ్యాపారంతో పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంతో హైదరాబాద్‌ను కాలుష్య రహిత, నెట్ జీరో నగరంగా మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యాఖ్యానించారు. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు తన ఆలోచనను వెల్లడించారు. భవిష్యత్తు నగరంగా పిలువబడే నాలుగో నగరాన్ని హైదరాబాదులో నిర్మించాలని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం న్యూయార్క్, లండన్, టోక్యో, దుబాయిలతో పోటీ పడనుందని రేవంత్ జోస్యం చెప్పారు. దేశంలోనే హైదరాబాద్‌ను గొప్ప నగరంగా నిర్మించాలని తాము భావిస్తున్నామని, ఈ నగరం అంతా కార్బన్ జీరోను లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు. 3,200 బస్సుల స్థానంలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, శీతల గడ్డంగులు, గెడ్డంగుల మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగంపై మొగ్గు చూపించేలా అవగాహనను కల్పించడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఏపీలోని బందర్ పోర్టుకు ప్రత్యేక రహదారిని, రైల్వే అనుసంధానం జరుగుతోందని వెల్లడించారు. మచిలీపట్నం ఓడరేవుకు రోడ్డు, రైలు మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనలో ఉన్నాయని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
👉ఘరానా మోసగాడు అరెస్ట్..
మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 373/24 కేసులో ఏ వన్ ముద్దాయి అయినా చుక్కా బాబు అలియాస్ లవ్ బాబు అనే అతను ఈరోజు మధ్యాహ్నం 1:00 సమయంలో విజయవాడలో అరెస్టు చేయడం జరిగింది. చుక్కా బాబు మొదట కార్ డ్రైవర్ గా పని చేసేవాడు ఆ తర్వాత అతని కుటుంబ అవసరాలు నిమిత్తము డబ్బులు కొరకు ఎవరినైనా మోసం చేయాలని అతను అతని కుటుంబ సభ్యులు అతని స్నేహితులు ఒక పథకం ప్రకారం నిర్ణయించుకుని అతను స్నేహితులు ద్వారా ఖరీదైన లగ్జరీకారులు అద్దెకి తీసుకొని వాటిలో తిరుగుతు గవర్నమెంట్ ఆఫీసులకు కోర్టులకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగి ఎవరైనా అమాయకులు కనబడితే వాళ్ళని నమ్మకంగా పరిచయం చేసుకొని వాళ్లతో స్నేహం చేసి కొద్దిరోజుల తర్వాత తనకు గవర్నమెంట్ లో మంచి పలుకుబడి ఉందని సదరు ముందుగా దిగిన ఫోటోలు చూపించి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బు వసూలు చేసి ఆ డబ్బుతో విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడ్డారు.
ఈ క్రమంలో 2023 వ సంవత్సరంలో దాసరి రామ్మోహన్ రావు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని అతని తమ్ముడికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని అందుకు పది లక్షలు ఖర్చు అవుతుందని అదేవిధంగా హైకోర్టులో స్టేనగా పని చేస్తే అరుణ్ అనే అతను చనిపోయాడని అతని పేరు మీద రాజధానిలో ఉన్న రెండు ఎకరాలు నలుగురు హైకోర్టు న్యాయమూర్తి ల కస్టడీలో ఉందని 50 లక్షలు ఇస్తే ఆ భూమిని నలుగురు నలుగురు జడ్జిలు రామ్మోహన్రావు పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తారని నమ్మబలికి అతను వద్దనుండి మొత్తంగా సుమారు 59 లక్షల రూపాయల వరకు చుక్కా బాబు అతని స్నేహితుడు వంశీకృష్ణ తరుణ్ మరియు అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి మోసం చేసారు. దీనిపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో పై వారందరూ పైన కేసు నమోదు చేసి ఈ రోజున ఏ వన్ ముద్దాయి అయినా చొక్కా బాబును అరెస్టు చేసి తదుపరి రిమాండ్ నిమిత్తము గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసే వాళ్ళని నమ్మి డబ్బులు పోగొట్టుకొకుండ జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.
👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..
*కంభం:* ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని సాధునియా వీధిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి సమయంలో అనుమానంతో భర్త అర్థవీటి శివ రంగయ్య భార్య అంజలిపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలు అంజలికి ముగ్గురు వివాహమైన కుమార్తెలు ఉన్నారు. ఆమె కొన్నేళ్లుగా కంభం లోని శ్రీ చైతన్య స్కూలులో టీచర్ గా పని చేస్తుంది నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని సీఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.