కమ్యూనిస్టు వారసత్వాన్ని అందించిన మహనీయుడు వెంకటస్వామి మాజీ రాజ్యసభ సభ్యులు పి. మధు

కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తాను ఆచరించడమే కాదు తాను నమ్మిన పార్టీకి వారసత్వాన్ని అందించిన ఘనత వెంకటస్వామికి దక్కుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. సోమవారం మరిపూడి మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి సంతాప సభ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మధు మాట్లాడుతూ భయంకరమైన కలరా వ్యాధి ప్రబలి గ్రామాలలో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడిన కష్టకాలంలో కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు వైద్యం నేర్చుకొని పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన సేవా తత్పరత కల వ్యక్తి వెంకటస్వామి అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలను ఐక్యం చేయడంలో ముందుండేవారన్నారు వెనకబడిన ప్రాంతంలో జన్మించిన విద్య ప్రాధాన్యతను గుర్తించి వెంకటస్వామి కుమారుడు శ్రీనివాసరావును ఉన్నత విద్యాభ్యాసం చదివించేందుకు కావలి జవహర్ భారతిలో చేర్పించారన్నారు. పార్టీ విభజన అనంతరం విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరావు అంచలంచలుగా కేంద్ర కమిటీ సభ్యులుగా నేడు రాష్ట్ర కార్యదర్శిగా ఎదుగుదలలో తన తండ్రి వెంకటస్వామి కృషి, శ్రమతో పాటు కుటుంబ సభ్యుల, బంధుమిత్రులు అక్కాచెల్లెళ్ల ప్రోత్సాహం చాలా గొప్పది అన్నారు. వెంకటస్వామి చాలా నిష్టగా ఓర్పుగా క్రమశిక్షణతో కుటుంబాన్ని నడిపించడంలో ఆదర్శంగా నిలిచాడు అన్నారు శ్రీనివాసరావు భార్య మరణించిన కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చినా వెరవకుండా ముందుకు సాగారన్నారు. వెంకటస్వామి చేసిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకోవడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినవారిమవుతామన్నారు. వృద్ధాప్యంలో వెంకటస్వామికి మనవరాలు ఆశాభారతి ప్రసాదు మునిమనవరాలు నక్షత్ర చేసిన సేవలు కమ్యూనిస్టుల నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంకటస్వామి అభ్యుదయ విలువలు పాటించిన ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ గ్రామంలో సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించారన్నారు. అప్పట్లోనే భక్తి అనేది వ్యక్తిగతమని రాజకీయం ప్రజాసేవ అని స్పష్టంగా విభజన గీత గీసిన వెంకటస్వామి నేటి తరానికి ఆదర్శమన్నారు.తన వృద్ధాప్యం, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నిత్యం ఉత్సాహంగా ఉండేవారు అన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ కట్టుబాట్లతో కునారిల్లుతున్న వెనకబడిన ఈ గ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేసేలా కుమారుడికి ఆదర్శ వివాహం జరిపించాడన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకురాలు పి. రోజా మాట్లాడుతూ వెంకట స్వామి గారు మహిళలను ఎంత గౌరవించేవారో కుటుంబ సభ్యుల తీరును బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్. నారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని వెనకబడిన పొదిలి తాలూకాలో వీరాస్వామి కాసిరెడ్డి తో కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించడంలో వెంకటస్వామి పాత్ర మరో లేనిదన్నారు.ఉమ్మడి పార్టీలో పొదిలి సమితి అధ్యక్షులుగా సానికొమ్ము కాసిరెడ్డి విజయానికి దోహదం చేసిన వ్యక్తి అన్నారు.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర జాయింట్స్ కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మరణం అందరికీ సహజమని కానీ వెంకటస్వామి పార్టీ నిర్బంధంలో సైతం నిలబడటమే కాక చివరి వరకు కమ్యూనిస్టుగా జీవించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పొదిలి మాజీ ఏఎంసి చైర్మన్ మాట్లాడుతూ యర్రమోతు శ్రీనివాసులు మాట్లాడుతూ నాడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మాలాంటి ప్రజాప్రతినిధులకు వెంకటస్వామి ప్రజాసభ ఎలా చేయాలో నేర్పించిన వ్యక్తి అన్నారు. సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై సిద్దయ్య మాట్లాడుతూ ఆత్మాభిమానం గల వ్యక్తిగా ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో తనదైన శైలిని చూపించారన్నారు. మరిపూడి మండల టిడిపి నాయకులు రేగుల వీరనారాయణ మాట్లాడుతూ గ్రామ రైతులను ప్రైవేటు బస్సు యజమానులు అవమానించగా రైతులను ఐక్యం చేసి ఏడాది పాటు ఆ బస్సులు ఎక్కకుండా ప్రజలను చైతన్యవంతం చేయడంలో వెంకటస్వామి పాత్ర మరో లేనిదన్నారు. గ్రామంలో మౌలిక వసతులు పొలాలకు కచ్చా రోడ్లు నిర్మాణం, టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి రావడానికి వెంకటస్వామి కారణమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడంలో వెంకటస్వామి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జిల్లాలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీవ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాసు, సిఐటియు రాష్ట్ర నాయకురాలు కే సుబ్బారావమ్మ, సిపిఎం ఎన్టీఆర్, బాపట్ల జిల్లా కార్యదర్శులు డివి కృష్ణ, సిహెచ్ గంగయ్య, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లా నాయకులు పి అజయ్ కుమార్, జి వెంకటేశ్వర్లు, జి చలమయ్య, బి బావ న్నారాయణ, సిపిఎం తెలంగాణ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, ఆర్ వెంకట్ రాములు, ఎం శోభన్ నాయక్, కే రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, ఎస్.కె మాబు, ఊస వెంకటేశ్వర్లు, డి సోమయ్య, వి ఆంజనేయులు, ఐద్వా పల్నాడు జిల్లా నాయకురాలు జి ఉమాశ్రీ,ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, సిపిఎం జిల్లా నాయకులు జి. రమేష్, బి సుబ్బారావు,బి. రఘురాం, కె సుబ్బారావు, ప్రజాశక్తి ఒంగోలు ఎడిషన్ మేనేజర్ ఎమ్.యల్.వి. ప్రసాద్ రావు, బ్యూరో ఎస్ వి బ్రహ్మం, పొదిలి పెద్ద చెరువు సాగర్ నీటి స్ఫూర్తి ప్రదాత మాకినేని వెంకటరమణయ్య ,సీనియర్ జర్నలిస్టు శ్రీరామ కోటేశ్వరరావు, సిహెచ్ కృష్ణారావు,జె వి వి నాయకులు కావూరి రఘచంద్,పోస్టల్ శాఖ నాయకులు జి శ్రీనివాసమూర్తి, గ్రామ మాజీ సర్పంచి వంకాయలపాటి వెంకయ్య, వెంకటస్వామి కుటుంబ సభ్యులు వి ఆశాభారతి, బి ప్రసాద్, నక్షత్ర, సిపిఎం నాయకులు ఎం వెంకటేశ్వరెడ్డి, పి బాలనర్సయ్య, ఏ. శ్రీనివాసులు,ఎ.బాదుల్లా, జి. నరసింహారావు పాల్గొన్నారు.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..