👉వైకాపా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటా.. గిద్దలూరు వైకాపా సమన్వయకర్త మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

వైకాపా నాయకులు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి పార్టీని అభివృద్ధి పదంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తానని గిద్దలూరు వైకాపా సమన్వయకర్త మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి  పేర్కొన్నారు. గిద్దలూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా ఆయనను నియమించిన సందర్భంగా ఆయన శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గంలోని  కంభం బేస్తవారి పేట గిద్దలూరులలో  ఆయన వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసేందుకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయనకు వైకాపా నాయకులు,పూల జల్లులు కురిపిస్తూ పూలమాలు వేసి ఘనంగా ఆహ్వానం పలికారు.. తోలుత ఆయన కందులాపురం సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బేస్తవారిపేట గిద్దలూరు పట్టణాలలో పర్యటించారు ఈ సందర్భంగా వైకాపా నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కంభం గిద్దలూరు ప్రాంతాలలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి ఉన్న పరిచయాల గురించి వివరించారు.తన తండ్రి హయాంలో, తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, ముఖ్యమంత్రి వైయస్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించిిి వివరించారు. గిద్దలూరులో  నివాసం ఉంటూ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథంలో రాష్ట్రం సర్వ విధాల అభివృద్ధి చెందుతోందని ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ఘనత వైసిపికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తాను ఈ నియోజకవర్గానికి వచ్చానని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. గతంలో పులివెందుల తర్వాత అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ నియోజకవర్గంలో తనకు ప్రజాసేవ చేసుకునేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల స్ఫూర్తితో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.పశ్చిమ ప్రాంతానికి వరప్రసాదమైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరో 10-15 రోజుల్లో టెన్నలును ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, వైకాపా నాయకులు చెగిరెడ్డి ఓబుల్ రెడ్డి, నెమిలిదిన్న చెన్నారెడ్డి, బి పేట జడ్పిటిసి బండ్లమూడి వెంకటరాజు, స్థానిక వైసీపీ నాయకులు ప్రేమానందం, మట్టా రమేష్, పెరుమారెడ్డి ఈశ్వర్ రెడ్డి, బాదం శివ,లతోపాటు  నియోజకవర్గంలోని పలు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

👉కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన..

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న  కార్మిక,కర్షక,ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కందుల పురం సెంటర్లోని పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తోట తిరుపతిరావు, మండల కన్వీనర్ అన్వర్ భాష కో కన్వీనర్ షేక్ ఖాజావలి, ఆటోల సంఘం నాయకులు ఏ బ్రహ్మం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రోశయ్య కమిటీ సభ్యులు మాబు సుభాని, కొత్తూరు, జిల్లా కమిటీ సభ్యులు టి దానం తదితరులు పాల్గొన్నారు.

👉ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్..

_హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్._.సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్.._లచ్చు నాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

👉ఎస్డీఐసి(SDIC) రెడ్ రాక్ పవర్ యాప్ బాగోతం …అన్నమయ్య జిల్లా సుండుపల్లి కేంద్రంగా ఎస్డీఐసి(SDIC)యాప్ పేరుతో కార్యకలాపాలు సాగించి బోర్డు తిప్పేసిన వైనం …

సర్వీస్ నుండీ తొలగిన పోలీసు అధికారి సోదరుడు సైమన్,సన్నిహితులు రెడ్ రాక్ యాప్ కార్యాలయాన్ని నడిపిన వైనం…రెడ్ రాక్ యాప్ నిర్వహురాలు జెన్నీ తో సంబంధాలు కొనసాగించిన సైమన్,సన్నిహితులు..కమిషన్ల కోసం భారీగా డిపాజిట్లు చేయించిన సైమన్,సన్నిహితులు…తమ సొమ్మును ఇవ్వమని సైమన్ కార్యాలయం వద్ద నిలదీసిన బాధితులు…బోర్డు తిప్పేసి చేతులెత్తేసిన సుండుపల్లె కార్యాలయ సిబ్బంది…అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన 30 మంది బాధితులు…

ఈ కేసును రాయచోటి రూరల్ సీఐ తులసీ రామ్ కు విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ…
రూరల్ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టిన బాధితులు…
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు చెబుతున్న భాదితులు…
రెట్టింపు సొమ్ము వస్తుందని ఆశ చూపి కోట్ల రూపాయలు స్వాహా…
బలహీనతను అవకాశంగా మార్చుకున్న ఎస్డీఐసి యాప్ నిర్వహులు..
ప్రవేట్ యాప్ ల పేరుతో ప్రజలను లూటీ చేస్తున్న కేటుగాళ్లు…
సైబర్ మాయ నమ్మి లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నిరుద్యోగులు, మహిళలు గుండెలు బాదు కుంటున్నారు

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…