బీజేపీ కొత్త బేరం..బాబుకు ఓకేనా…!? గిద్దలూరు వైసీపీకి భారీ షాక్..!!! పోలీసుల ప్రవర్తనావళి మారాలి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..!!!

  •  భారతీయ జనతా పార్టీతో పొత్తు టీడీపీకి ప్రాణ సంకటంగా మారుతోంది. ఒక విధంగా పులి మీద స్వారీగా ఉంది అంటున్నారు. పొత్తు ఉన్నా లేకపోయినా రెండూ ఇబ్బందిగానే ఉన్నాయి. పైగా కేంద్రంలో మూడవసారి బీజేపీ వస్తే టిడిపికి తిప్పలు తప్పవు.. బిజెపితో దోస్తీ తప్పనిసరి అని టిడిపి భావిస్తుంది.ఏపీలో టీడీపీ గెలవాలన్నా గెలిచి అయిదేళ్లు రాజ్యం చేయాలన్నా ఇపుడు బీజేపీ సాయం అవసరం అని అంటున్నారు. అందుకే బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారు. అమిత్ షాతో చర్చించిన తరువాత కూడా పది రోజులు ఇట్టే గడచిపోయాయి. కానీ అఫీషియల్ గా ఏమీ తేలలేదు, ఏ ప్రకటనా రాలేదు. దాంతో ఏమి జరుగుతోంది అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే తమ పార్టీ ముఖ్యులతో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు విషయంలో సానుకూలంగా మాట్లాడారు అని అంటున్నారు. అంటే బీజేపీతో పొత్తు ఇష్టమే కానీ ఆ పార్టీ పెడుతున్న ప్రతిపాదనలే కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నారు. అదే టైం లో ఏపీలో ఉన్న మొత్తం పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు సీట్లలో టీడీపీకి నాలుగు జనసేనకు రెండు బీజేపీకి ఒక సీటు అన్న ఫార్ములాతో అమిత్ షా బాబు వద్ద బేరం పెట్టారు అని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదన ప్రకారం చూస్తే టీడీపీ వంద సీట్లలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనసేనకు యాభై బీజేపీకి పాతిక సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోనే టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది అని అంటున్నారు. ఈ పొత్తు ప్రతిపాదన ఇలా ఉండగానే బహుశా టీడీపీ ఆలోచనలు పసిగట్టారో లేక ఎవరైనా చెప్పారో తెలియదు కానీ మరో ప్రతిపాదన బీజేపీ నుంచి లేటెస్ట్ గా వచ్చింది అని అంటున్నారు. ఆ ప్రతిపాదన ప్రకారం చూస్తే ఎమ్మెల్యే సీట్లు అయిదు బీజేపీ తగ్గించుకుంది అని అంటున్నారు. అంటే ఇరవై ఎమ్మెల్యే సీట్లు ఆరు దాకా ఎంపీ సీట్లు ఇస్తే పొత్తు ముందుకు వెళుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో కూడా పితలాటకం ఉందని అంటున్నారు. అదెలా అంటే బీజేపీ కోరుతున్న ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ టీడీపీ బలంగా ఉండే ప్రాంతాలలోనే అంటున్నారు. అదెలా ఉన్నాయంటే ఎంపీ స్థానాల్లో విశాఖపట్నం, నర్సాపురం, రాజమండ్రి, విజయవాడ, హిందూపురం, రాజంపేట లేదా తిరుపతి కోరుతున్నారు. అదే విధంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను ప్రతిపాదించారు. అందులో రాజమండ్రి సిటీ, పి గన్నవరం (ఎస్సీ), కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ వంటి టీడీపీ కీలక స్థానాలు కూడా ఉన్నాయి. అలాగే తిరుపతి లేదా శ్రీకాళహస్తి, మదనపల్లె, విశాఖ ఉత్తరం, అరకు, శ్రీకాకుళం, నెల్లూరు సిటీ లేదా రూరల్, ఒంగోలు, నర్సరావుపేట, ప్రత్తిపాడు, బాపట్ల, కాకినాడ సిటీ, ఏలూరు, జమ్మలమడుగు, ధర్మవరం ఇవ్వాలనేది బీజేపీ తాజా ప్రతిపాదనగా ఉంది. అయితే బీజేపీ ప్రతిపాదన ఎలా ఉంది అంటే అయిదూళ్ళు చాలు అని కీలక స్థావరాలనే కోరినట్లుగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇప్పటికే చంద్రబాబు జనసేన బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. దానిని బట్టి చూస్తే కనుక జనసేనకు 25 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలు అని అంటున్నారు. అలాగే బీజేపీకి పది ఎమ్మెల్యే, నాలుగు దాకా ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఓకేగా ఉంది అని అంటున్నారు. ఇవి కూడా టీడీపీ తాను సూచించిన సీట్లనే ఇచ్చేందుకే సిద్ధం అంటున్నారు. అంటే టీడీపీ చెప్పిన నంబర్ కి చూపించే సీట్లకు బీజేపీ అయినా జనసేన అయినా ఒప్పుకోవాలి అన్న మాట. మరి బీజేపీ అలా కాదూ కూడదు అంటే ఈ పొత్తు ఏమవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనతో కొంత బాగానే ఉన్నా ఈసారి బీజేపీ నుంచే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో బీజేపీని ఒప్పించే పనిలో పవన్ తొందరలో ఢిల్లీ టూర్ వేయనున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది.

👉పోలీసులు ఉన్నదే ప్రజల కోసం… పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారు.. తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందన్న హైకోర్టు..ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వ్యాఖ్య..పోలీస్ విధులను గుర్తుచేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు..

పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమని గుర్తించాలని పేర్కొంది. పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని చురక అంటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

👉ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపిలో చేరిన 100 కుటుంబాలు..

గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి స్వంత పార్టీ నాయకులే దెబ్బ మీద దెబ్బ కొడుతూ భారీ షాక్ లు ఇస్తున్నారు. నియోజకవర్గంలో వైసిపిని వీడుతూ తెలుగుదేశం పార్టీలోకి క్యూలు కడుతున్నారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం, వెంగళరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పార్శ రామలింగస్వామి  ఆధ్వర్యంలో గ్రామంలోని కాపు సోదరులు, వడ్డెర సోదరులు, మైనార్టీ సోదరులు, రజక సోదరులు, రెడ్డి సోదరులు మొత్తం 100 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు