- 👉ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఇన్ చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ సహాయ సహకారాలతో 24 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ ప్రజా వైద్యశాలను నిర్మించడం జరిగిందని ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో బాగా వెనుకబడి ప్రాంతంగా సీఎం జగన్ గుర్తించారన్నారు.గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పక్క జిల్లాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాల రూపుదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల సూపరిండెంట్ సూరిబాబు తో పాటు వైద్యశాల వైద్యులు సిబ్బంది పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
👉పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు వైకాపా సమన్వయకర్త నాగార్జున రెడ్డి
👉గిద్దలూరు మండలం సంజీవరావుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఎర్రంరెడ్డి వెంకట రెడ్డి కుమార్తె వర్షిత పుష్పాలంకరణ ఫంక్షన్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
👉 లాయర్ హిమ శేఖర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలోఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి,కృష్ణారెడ్డి ,రమణారెడ్డి వైఎస్ఆర్సిపి ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
👉 అర్ధవీడు మండలం అర్థవీటి సర్పంచ్ మునగాల వసంతమ్మ పక్షన్ లో గిద్దలూరు ఇంచార్జీ కుందూరు నాగర్జున రెడ్డి మామ కంభం మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి మండల వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు..
👉 వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైకాపా సమన్వయకర్త అన్నా..
పట్టణంలో ఆదివారం జరిగిన కొండవీటి వారి పెళ్లి మహోత్సవంలో మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
*అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు*♦♦
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జే.బి.కె పురం గ్రామంలో ఆదివారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఎం.ఎల్) మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు.