సంచ‌ల‌న‌ మ‌ర్డ‌ర్ కేసుపై వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేనా?👉 ఏపీలో బర్డ్ ప్లూ పంజా..‼️ కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్. రాప్తాడు సభలో జర్నలిస్టుపై దాడి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతి .

♦ముంబై కోర్టులో నెట్ ప్లిక్స్ పై సీబీఐ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఓ హ‌త్య కేసు ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ విడుద‌ల‌ ఆపాల‌ని కోర్టుని సీబీఐ కోరింది. ముంబై కోర్టులో నెట్ ప్లిక్స్ పై సీబీఐ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఓ హ‌త్య కేసు ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ విడుద‌ల‌ ఆపాల‌ని కోర్టుని సీబీఐ కోరింది. దీంతో నెట్ ప్లిక్స్ తో పాటు మ‌రికొంద‌ర‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసుపై ఈనెల 20 విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అనంత‌రమే ఆ సిరీస్ రిలీజ్ అవ్వాలా? లేదా? అన్న‌ది క్లారిటీ వ‌స్తుంది. ఆ పూర్తి వివ‌రాలు తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. షీనాబోరా హ‌త్య కేసు అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఈ క‌థ ఆధారంగా `ది ఇంద్రానీ ముఖ‌ర్జీ స్టోరీ: బ‌రీడ్ ట్రూత్` పేరుతో వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి 23న నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సిరీస్ పై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. సంచ‌ల‌న అంశం కావ‌డంతో ప్రేక్ష‌కులు రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో సీబీఐ విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ రిలీజ్ చేయ‌కూడ‌దంటూ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో కోర్టు నోటీసులు పంపించ‌డం..విచార‌ణ 20వ తేదికి వేయ‌డంతో రిలీజ్ అవు తుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పును బ‌ట్టే రిలీజ్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంద్రాణీ త‌న కుమార్తె షీనా బోరాని డ్రైవ‌ర్ స‌హాయంతో హ‌త‌మార్చి దాచి పెట్ట‌డానికి ఎలాంటి ప్ర‌యత్నాలు చేసిందో? ఆ మె జైలు జీవితాన్ని చూపిస్తూ నెట్ ప్లిక్స్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వ ఘ‌ట‌న‌లో ఇంద్రాణీ..ఆమె డ్రైవ‌ర్ శ్యాంవ‌ర్ రాయ్ మాజీ భ‌ర్త సంజీవ్ ఖ‌న్నా క‌లిసి షీనాని కారులో గొంతుకోసి చంపిన‌ట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప‌దేళ్ల‌గా ఈ కేసు కోర్టులో న‌లుగుతోంది. ఈ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ రిలీజ్ పై ఎలాంటి తీర్పు ఇస్తుంద‌న్న‌ది స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

*ఏపీలో బర్డ్ ప్లూ పంజా..‼️
*కృష్ణ, గోదావరి, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..‼️*

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. విజయవాడలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కృష్ణ, గోదావరి, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు అధికారులు. కోళ్లు మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీ పశువర్ధన శాఖకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ఫిబ్రవరి 7 న ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 10,000 పౌల్ట్రీలలో పక్షులు మరణించినట్లు భావిస్తున్నారు.భోపాల్‌లోని ల్యాబ్‌కు పక్షుల నమూనాలను పంపిన తర్వాత, వారు H5N1 వైరస్ వేరియంట్ ఉనికిని నిర్ధారించారు. నిర్థారణ కావడంతో జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ పశుసంవర్థక శాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ షాపులను మూసివేయడంతోపాటు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి 37 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిపారు.

మూడు నెలల పాటు ప్రజలు చికెన్ తినకపోవడమే మంచిదని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చికెన్ షాపులను మూసివేయలని భావిస్తున్నారు అధికారులు. వైరస్‎ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరాలని సూచించారు.

👉* కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్*

అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాల్వలో దూకి కారు డోర్లు తెరిచి లోపలున్న వారిని బయటకు తెచ్చి కాపాడారు.

👉రాప్తాడు సభలో జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మల్లిక గార్గ్ ని  కలిసి, దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటివి మరల పునరావృతం కాకుండా చూడాలని  వినతి పత్రం సమర్పించారు.కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి, బొమ్మజి కిషోర్, వేణు గుండ్లూరి, మునికృష్ణ, కల్లూరి హేమాద్రి, రమేష్ పాల్గొన్నారు

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…