వైయస్ షర్మిల అరెస్ట్.. LHMSసిస్టం సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి .. ముత్తుముల ఆధ్వర్యంలో వైకాపా నుండి టిడిపిలోకి చేరికలు… ఏసీబీ వలలో అవినీతి అధికారులు

*లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంతో తాళం వేసిన మీ ఇళ్ళు భద్రం:ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డ  తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు చెక్:ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి

“లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం”(LHMS)తో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు జరుగకుండా జిల్లాలో పోలీసులు ఉచిత సేవలు అందిస్తునారని, ఈ యాప్ సేవలు జిల్లా ప్రజలు విస్తృతంగా సద్వినియోగం చేసుకునేలా చేసి నేరాలకు అడ్డుకట్ట వేసేలా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు.

లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం”(LHMS) సేవలు వినియోగించుకునేందుకు ప్రజలు తమ అండ్రాయిడ్ మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి”లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం” యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని తమ వివరాలతో రిజిస్ట్రార్ అవ్వాలి. ఎప్పుడైనా ఊళ్లకు వెళ్లే సమయంలో LHMS యాప్ లో పోలీసు వాచ్ రిక్వెస్ట్ ను ఎంపిక చేసుకోవాలి. వారు ఏ రోజు ఏ సమయంలో ఇంటి నుండి ఊరికి వెళ్లనున్నారు, తిరిగి ఎప్పుడు రానున్నారో వంటి వివరాలను అందులో పూరించి సందేశం పంపాలి. ఆ తర్వాత జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడిచే కమాండ్ కంట్రోల్ రూం కు ఆ సందేశం వెళ్తుంది. అక్కడి నుండి సంబంధిత పోలీసులకు సమాచారం చేరుతుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ (ఐ.పి.) వై-పై కెమెరాలను ఆ ఇంట్లో సంబంధిత పోలీసులు వచ్చి ఉచితంగా అమర్చుతారు.ఇళ్లల్లో దొంగతనాల నియంత్రణకు పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టడుతున్నామని, జిల్లాలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వారా పోలీసు నిఘా ఉంచేందుకు అవసరమైన ఐ.పి.బేస్డ్ కెమెరాలు అందుబాటులో ఉంచామని కావున లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం (LHMS ) యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. LHMS పై ప్రజలకు అవగాహనతో పాటు ఉపయోగించడం వలన జరిగే ప్రయోజనాల గురించి తెలియపరచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో రిజిష్టర్ కావడం, రిక్వెస్ట్ పోలీస్ వాచ్ పంపడం తదితర విషయాల్లో ఏవైనా సందేహాల నివృత్తి కోసం స్ధానిక పోలీస్ స్టేషన్ లో మరియు జిల్లా కంట్రోల్ రూమ్ 9121102276 నంబర్ కు ఫోన్ లేదా వ్యాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా ప్రజలకు ఎస్పీ తెలియజేసారు.
*వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం.*ముత్తుముల*

ప్రకాశం జిల్లా కంభం ( బెస్తవారిపేట)..
*రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు తప్ప, ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం జరగలేదని గిద్దలూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బెస్తవారిపేట మండలం, పాపాయిపల్లె గ్రామంలో పర్యటించిన అశోక్ రెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరిగి మినీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. అనంతరం గ్రామ సభలో వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అరాచక పాలనకు, అభివృద్ధి పాలనకు మద్య జరిగే ఎన్నికలు అని, గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమని, నాడు తెలుగుదేశం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రతీ ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో “టీడీపీ జనసేన”ల ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తనకు సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సొరెడ్డి మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు పూనూరు భూపాల్ రెడ్డి, టీడీపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

👉ముత్తుముల సమక్షంలో 50 కుటుంబాలతో సహా టీడీపి తీర్ధం పుచ్చుకున్న మాజీ సర్పంచ్

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి గిద్దలూరు మండలం, కంచిపల్లె గ్రామంలో పర్యటిస్తున్న నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి అశోక్ రెడ్డి సమక్షంలో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దప్పిలి శ్రీనివాస రెడ్డి మరియు వారి సోదరుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు దప్పిలి రమణారెడ్డి వారి అనుచరులు 50 కుటుంబాలతో సహా వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ గోతం శేఖర్, వైస్ సర్పంచ్ షేక్ బికారి, కాకర్ల నారాయణ, కాకరాయల రంగనాయకులు, మరియు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూధన్ యాదవ్ యాదవ్, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలుగుళ్ళ ప్రతాప్ రెడ్డి, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, రామకృష్ణ యాదవ్, మహానంది, నంది శ్రీను, భూపాల్ యాదవ్, తదితరులు పాల్గోన్నారు.*
👉కృష్ణాజిల్లా…అవనిగడ్డ..ఏసీబీ వలలో అవనిగడ్డ పంచాయతి శానిటరీ ఇన్స్ పెక్టర్..

రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పవన్ కుమార్
👉 ధర్మవరంలో వైసీపీకి మరో భారీ షాక్..వైసిపి కీలక నేతలు టిడిపిలో చేరిక..కేతిరెడ్డి పతనం ఎప్పుడో ప్రారంభమైందన్న శ్రీరామ్..

ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మొన్నటికి మొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా.. తాజాగా 14వ వార్డుకు చెందిన కొందరు కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. శ్రీరామ్ వారందరికీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో కురుబ సంఘం రాష్ట్ర సెక్రటరీ బండి వెంకటేష్ అలాగే నగేష్, యశ్వంత్, బాలకృష్ణ, హరి, సుబ్బు, సుబ్రహ్మణ్యం, అభి, సూరి, చలపతి, రాము, నారాయణ స్వామి, సంతోష్, రాజేష్, అశోక్ తోపాటు మొత్తం 25కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీలో ఉన్న ఆధిపత్య పోకడలు.. అక్కడ నేతలు వ్యవహరిస్తున్న తీరు తమకు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
*ముత్తుముల సమక్షంలో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీతో పాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరిక*

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడితో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలనను ఖండిస్తూ బెస్తవారిపేట మండలం, జేబికే పురం గ్రామ మాజీ సర్పంచ్ చెట్లం రామకోటయ్య, మరియు అర్ధవీడు మండలం, మాగుటూరు తాండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బాలవర్ధి నాయక్ వారి అనుచరులతో, సహా వైసీపీని టీడీపి తీర్ధం పుచ్చుకున్నారు.వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాగుటూరు తాండా గ్రామస్థులు డుమావత్ తులేనాయర్, మొదలైన వారు పాల్గొన్నారు.

*వైఎస్ ష‌ర్మిల అరెస్ట్*

ఏపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మెగా డీఎస్సీ ప్రకటించా లంటూ, కాంగ్రెస్ చేపట్టిన ‘ఛలో సెక్రటేరియట్’ ఉద్రిక్తంగా మారిన నేప‌థ్యంలో ష‌ర్మిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో షర్మిల ర్యాలీగా సచివాల యానికి బయల్దేరగా.. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసు లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.చివరికి పోలీసులు షర్మిలను కొండవీటి ఎత్తిపోతల వద్ద అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు తరలించారు..

*ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..*

*15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్..*కర్నూలు జిల్లా:

కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు..మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

 

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..