చెలరేగిపోతున్న మట్టి మాఫియా..ఘనంగా ఉడుముల గృహప్రవేశం.. జగన్ పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఫ్లెక్సీలను తగలబెట్టిన బి.కె అభిమానులు.

👉100 కోట్ల మట్టి తరలించుకెళ్లారు .. దుమ్ము ధూళి కి పంటలు దెబ్బతింటున్నాయి.. గుంతలలో పశువులు చనిపోతున్నాయి..ఎర్రమట్టి కొండ తవ్వకాలను శాశ్వతంగా ఆపకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం..

బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని బొబ్బేపల్లి గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి కొండను పలుకుబడి కలిగిన రాజకీయనాయకులు గత 15 సంవత్సరాల నుండి గుత్తేదారులు, అధికారులు అండదండలతో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎర్రమట్టి కొండను అక్రమంగా తవ్వుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో తమ తాము వేసుకున్న ఫైర్లు దుమ్ము ధూళి వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి రైతులు లక్షలాది రూపాయలు నష్టం చవిచూస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా పొగాకు పత్తి మిర్చి కూరగాయల పంటలు పండిస్తుంటారు. గత 15 ఏళ్లుగా ఎర్ర మట్టి తవ్వకాలవల్ల,వాహనాల రాకపోకలు సాగిస్తున్నాడం వల్ల పైర్లపై దుమ్ము ధూళి పడి పసిడి రాశులు కురిపించే పూత కాయ దశల్లో సమూలంగా పీకి పారేస్తున్నామని రైతులు వాపోతున్నారు. గత 15 ఏళ్లుగా సుమారు 100 కోట్లకు పైగా మట్టిని అక్రమంగా తరలించారని అన్నారు. ఇక మేతకోసం వెళ్లే గేదెలు మేకలు వంటి పశువులు వర్షాకాలంలో గుంతలలో పడిపోయి చనిపోతున్నాయని పశుపోశకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గురువారం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన నాయకులు,ప్రజలు కొండ వద్దకు చేరుకొని ఎర్ర మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండను అక్రమంగా తొలిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని దాని వలన గ్రామానికి ఎటువంటి ఉపయోగం లేకపోగా ఎన్నో అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాక దొంగ బిల్లులతో సైతం అక్రమ రవాణా జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తమ మొరను వినిపించినా కూడా వారు కూడా అందిన కాడికి దండుకుంటున్నారే కానీ గ్రామ ప్రజానీకం ఆవేదనను పట్టించుకోవడంలేదని, అధికారుల సైతం తమ సమస్యను పరిష్కరించకపోగా తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తవ్వకాలను శాశ్వతంగా ఆపివేయాలని తద్వారా పర్యావరణాన్ని తమ పంట పొలాలను కాపాడాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు .ఈ సమస్యను ఎన్నికలలోపు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికలను తమ గ్రామంలోని ప్రజలంతా కలిసికట్టుగా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

*ఉడుముల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే లు అన్నా, కుందూరు

పొదిలికి చెందిన ఉడుముల గురువారెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే,గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందూరు నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారిని ఎమ్మెల్యే లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

👉జగన్ రెడ్డి మాట తప్పాడు, మడమతిప్పాడు..చంద్రబాబు 2సెంట్లు ఇంటి పట్టా ఇస్తే.. జగన్ రెడ్డి సెంటుకు కుదించాడు..మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా పశ్చిమ ప్రాంత వాసులకు వెన్నుపోటు పొడిచాడు..వెలుగొండ జలాలు అందించడంలో మాట తప్పాడు..కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి అయిన సబ్సిడీ ఋణం అందించాడా..?గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల..

రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అశోక్ రెడ్డి మాట్లాడుతూ 57నెలల పాలనా కాలంలో 14 లక్షల అసైన్మెంట్ భూములను కబ్జా చేసిన జగన్ రెడ్డి ముఠా ప్రజా ద్రోహులు కాదా అని ప్రశ్నించారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఆయువు పట్టు అయిన వెలుగొండ జలాలను నాడు తెలుగుదేశం హయాంలో యుద్ధప్రాతిపదికన 80% పనులను పూర్తి చేస్తే, 2023 డిసెంబర్ నాటికీ నీరు అందిస్తానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి వెలుగొండ జలాలను అందించకుండా జిల్లాలోకి ఎలా వచ్చాడన్నారు. జిల్లాల పునర్విభజనలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం కనిపించలేదా అన్నారు. గత తెలుగుదేశం హయాంలో పక్కా గృహలకు 2.50 లక్షలు మంజూరు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ.1.80 వేల రూపాయలతోనే చేతులు దులుపుకొని పేదల పై కపట ప్రేమ చూపించారన్నారు. కార్పొరేషన్ల ద్వారా ఒక్కరికైనా, ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఋణం అందించలేదన్నారు. అదే విధంగా జగనన్న లేఅవుట్ ల, పేరుతో పేదలకు లబ్ది చేకూర్చటం కంటే అధికారపార్టీ నాయకుల దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చాడని, ఆర్బాటాలతో మొదలు పెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఒక్క రూపాయి లబ్ది చేకూరలేదన్నారు. జగన్ పాలన అంతా అబద్దపు హామీలు, అరాచక పాలన తప్ప అభివృద్ధి శూన్యమని రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపటం ఖాయమన్నారు.

👉ప్రకాశం జిల్లా, కొత్తపట్నంలో ఆరవీటి సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ కార్యక్రమంలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి..

*👉తెదేపా టికెట్ బి.కె పార్థసారథి కి ఇవ్వనందుకు ఫ్లెక్సీలను తగలబెట్టిన బి.కె అభిమానులు. పెనుకొండ లోని బి.కె పార్థసారథి ఇంటి ముందు తెదేపా ఫ్లెక్సీలు తగలబెట్టి,రోడ్డుపై బైఠాయించిన బికే అభిమానులు.*

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…