పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమనేత,జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు….సీఎం జగన్ యువతను మోసం చేసారు..టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష….మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు

♦టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు వచ్చినప్పటి నుంచి అటు రాజకీయాలలో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి.. టిడిపి జనసేన కూటమిలో 118 సీట్ల జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో టిడిపికి 94 జనసేనకి 24 సీట్లను కేటాయించారు.. ముఖ్యంగా ఇందులో జనసేన సీట్ల విషయంపై రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 175 సీట్లలో కేవలం 24 సీట్లు తీసుకోవడం ఏంటనే విషయంపై అటు అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఏకిపారేస్తున్నారు.అసలు పవన్ కళ్యాణ్ ఎలా 24 సీట్లను అంగీకరించారా అనే విషయంపై చర్చలు జరుగుతున్న సమయంలో  జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీట్లను చాలా తక్కువ తీసుకోవడం పైన తప్పు పడుతున్నారు.. ఈ కార్యక్రమంలోని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమ నేత జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కొన్ని వేల కోట్ల రూపాయలు అందుకున్నారని దీంతో కాపులను సైతం మోసం చేశారంటూ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశారని 2019 తర్వాత కూడా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొన్నారని కోట్లు పెట్టి కారు కొన్నారని అసలు పవన్ కళ్యాణ్ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా ఆయన తెలిపారు.. పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తానంటూ ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టి మరి కాపులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డును పడేస్తున్నారంటు  రామ్ సుధీర్ ఆరోపించారు.. పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేస్తున్నారని.. నమ్మిన వ్యక్తుల్ని మోసం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీ పేరుతో పలు రకాల సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేస్తున్నారని పార్టీ సభ్యత్వాల పేరుతోనే ఒక స్కాం జరుగుతోందంటూ తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన అభ్యర్థులను మోసం చేస్తున్నారంటూ రామ్ సుధీర్ ఆరోపించారు.

  • 👉ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేసాడని టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష ఆరోపించారు.
  •  సోమవారం పొదిలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అమ్మవడి పథకం అంతా మోసం అని ఆయన ఆరోపించారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను ఈ ముఖ్యమంత్రి పెడదారి పట్టిస్తున్నారని జాబ్ క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగ ప్రకటన చేస్తానని యువతకు హామీ ఇచ్చి మోసం చేసారని ఆరోపించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రలో డ్రగ్స్ మాఫియా వంటివి వాటికీ పొత్సాహం ఎక్కువగా ఇస్తున్నారని ఏద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం త్వరలో ఉందన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు.. కంభం:గిద్దలూరు లో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం నిర్వహించనున్న మైనారిటీ సమావేశానికి కంభం పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పలు వాహనాలలో కంభం పరిసర ప్రాంతాల నుండి తరలి వెళ్లారు.ఈసందర్భంగా..ముస్లింల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి అతార్ షేక్ హుస్సేన్(దాదా),మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

👉విద్యుత్ షాక్ తో బాలుడి మృతి*..చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్ కు చెందిన బాలుడు అబు బకర్ (11) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని విద్యుత్ మోటార్ (మంచి నీళ్ళ కోసం) వేయబోయి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు తెలిపారు..

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..