ప్రజాసమస్యలే ఎన్నికల ఎజెండాకావాలని,మతతత్వ వాదులకు మద్దతు ఇవ్వరాదని పలువురు వక్తలు పేర్కొన్నారు..యునైటెడ్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సదస్సులో జనాబ్ మలిక్ మొఅతసిమ్ ఖాన్ (ఢిల్లీ) పాల్గొని ప్రసంగించారు.నేడు పరిపాలకులు విద్వేషాన్ని నింపడం,వ్యవస్థల విధ్వంసం,దుర్వినియోగ పరచడం లాంటి విధానాలు,ఏకపార్టీ పాలన వచ్చే పరిస్థితులు ఉన్నాయి.ఈపరిస్థితుల్లో సామాజిక,రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని పిలుపు ఇచ్చారు.ఎన్నికలలో అందరూ ఓటువేయాలని,మనం ఓటు వేయకపోవడం వలన మతతత్వ శక్తులు బలపడతాయని అన్నారు.ఓటును విడిపోకుండా ప్రయత్నం చేయాలని అన్నారు.కార్యక్రమంలో హైకోర్ట్ అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ అడ్వకేట్ మతీన్ ,అడ్వకేట్ రిజ్వాన్,రమేష్ పట్నాయక్,పాస్టర్ శ్రీనివాస్,హాఫిజ్ మస్తాన్ షరీఫ్,సమిఉజ్జమా మొదలైన వారు ప్రసంగించారు.ఈ దేశాన్ని,రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.రాబోయే ఎన్నికలలో ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండా కావాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు.గత ఏడు దశాబ్దాలుగా మనదేశం అభివృధ్ధి చెందకపోవడం శోచనీయమని అన్నారు.నేటికీ పేదల ప్రాధమిక అవసరాలు తీరడం లేదన్నారు.ఈ సందర్భంగా ఫోరమ్ తరపున ప్రజామేనిఫెస్టో విడుదల చేయడమైనది.నేటి రాజకీయాలు,ఎన్నికల ప్రచారాలూ వెగటు కలిగిస్తున్నాయని అన్నారు.గత ఏడుదశాబ్దాలుగా కులం,మతం,ప్రాంతం ప్రాతిపదికపై ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడం దుర్మార్గమని అని అన్నారు.కార్యక్రంలో జమాత్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీఖ్ పాల్గొని ప్రసంగించారు.నేటి రాజకీయాల్లో స్వార్ధచింతన పెరిగిపోయి ప్రజాసమస్యలు గాలికి వదిలేస్తున్నారన్నారు.రాజకీయపార్టీలు తమ ప్రయోజనాల కోసం విభజన రాజకీయాలు,మతరాజకీయాలు చేయడం దారుణమని అన్నారు.ప్రజలలో ప్రశ్నించే తత్వం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని,మతం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నంత సేపూ దేశం అభివృధ్ధి చెందదన్నారు.ఈ పరిస్థితుల్లో దేశాన్ని,రాజ్యాంగాన్ని రక్షించుకోవల్సిన అవసరం ఉందని.రాజకీయ పార్టీలు ఈ ప్రజామేనిఫెస్టోలోని అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు…ఈ సందర్భంగా ప్రజామేనిఫెస్టో విడుదల చేశారు .కార్యక్రమంలో అహ్లె హదీస్,తబ్లీగీ జమాత్,అహ్లె సున్నత్ వల్ జమాత్, ఇతర సామాజిక సంస్థల బాధ్యులు పాల్గొన్నారు…
*సింగరాయకొండ బస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రివర్యులు మరియు కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపుసురేష్
ఒంగోలు పట్టణంలో ఆరోగ్య కేంద్రంలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్.. కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జిల్లా ఆరోగ్యవైద్య శాఖ అధికారి వారి సిబ్బంది పాల్గోన్నారు.
👉…ఆర్యవైశ్యులు వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలి..ఎమ్మెల్యేలు అన్నా, కుందూరు*
*రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు ,గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మార్కాపురం ఎమ్మెల్యే అన్నారాంబాబు కోరారు. ఆదివారం గిద్దలూరు లోని ఎస్.ఎస్.ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేలు అన్నా, కుందూరు లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగిందన్నారు. అనంతరం 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రములో రెండవ మెజారిటీ అందించిన గిద్దలూరు ప్రజల అభిమానం మరువలేనిదన్నారు.రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నుండి పోటీ చేస్తున్న కుందూరును అత్యధిక మెజార్టీ తో గెలిపించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుందూరు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి మా కుటుంబం మార్కాపురం ప్రజలకు అండగా ఉండి మంచి చేయడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో నేను మార్కాపురం అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ఉంటానని, వారి వ్యాపారం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, వ్యాపారస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం తో
తిరుపతి నగరంలో జరిగిన న్యాయ సాదన సదస్సు లో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ , ఎపిసిసి అధ్యక్షులు వై యస్ షర్మిళారెడ్డిలను కాంగ్రెస్ బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువలతో సన్మానం చేసి పుష్పగుచ్చములు అంద జేసారు.
*కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ ఫొటో షూట్ అని పిలిచి చంపేశారు..*
విశాఖకు చెందిన ఫొటో గ్రాఫర్ సాయి కుమార్ (23) రావులపాలెంలో దారుణ హత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి… సాయి కుమార్‌ను హత్య చేశారు.సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రి కోసం షణ్ముఖ తేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసి పిలిచి అతని స్నేహితుడితో కలిసి సాయి కుమార్‌ను హత్య చేశారు.