👉 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ, టీడీపీ, జనసేన
నారా చంద్రబాబు నాయుడు, అమిత్ షా తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ,“మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌లు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాతో సమావేశమయ్యారు.చర్చల్లో మూడు పార్టీలకు పొత్తు కుదిరింది.ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.” అని చెప్పారు…
👉 దిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారిని ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు మీద చాలా మంది నమాజ్ చేస్తుండగా, ఒక పోలీస్ వచ్చి కాలితో తన్నుతూ వారిని అక్కడ నుంచి వెళ్లమనడం వీడియోలో కనిపిస్తుంది.పోలీస్ అధికారి తీరును నిరసిస్తూ వెంటనే అక్కడ ఉన్న పలువురు స్థానికులు వాదనకు దిగడం కూడా వీడియోలో చూడొచ్చు.సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విటర్)లో అనేక మంది ఈ ఘటనను ఖండించారు. నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన తర్వాత మెట్రో స్టేషన్ పరిసరాల్లో ప్రజలు గుమిగూడారు. నిరసనలు చేపట్టారు.ఇంద్రలోక్ మెట్రో స్టేషన్ బయట సాయంత్రం 6 గంటల తర్వాత క్రమంగా నిరసనలు తగ్గాయి.
👉ఎస్‌ఐ సస్పెన్షన్.. నమాజ్ చేస్తున్న వారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన దిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ తోమర్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు.ఉత్తర దిల్లీ డీసీపీ మనోజ్ కుమార్ మీణా, వార్తాసంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ‘‘ఆ వీడియోను ప్రజలంతా చూశారు.అది వైరల్ అయింది.అందులో కనిపిస్తున్న పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నాం. సస్పెండ్ చేశాం.క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు .
👉నిర్మామహేశ్వర స్వామి రథోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా*..
*పొదిలి మండలం పొదిలిలో వెలసిన శ్రీ నిర్మామహేశ్వర స్వామి రథోత్సవ వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.ముందుగా ఆలయంలో స్వామి వారికీ ఎమ్మెల్యే అన్నా ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్బంగా విశ్వనాధపురంలో దాతలు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నా ప్రారంభించారు.ముందుగా ఆలయ కమిటీ సభ్యులు,నిర్వాహాకులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి,ఆహ్వానించారు.
👉*చలో… మేదరమెట్ల…సిద్ధం సభకు మార్కాపురం నియోజకవర్గం నుండి భారీగా వైసీపీ నాయకులు తరలిరావాలి..పిలుపునిచ్చిన మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అన్నా
రేపు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం, మేదరమెట్ల మండలంలోని పి.గుడిపాడు వద్ద ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సిద్ధం సభకు మార్కాపురం నియోజకవర్గం నుండి వైసీపీ కుటుంబ సభ్యులందరూ భారీగా తరలిరావాలని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు శనివారం పిలుపునిచ్చారు.