- 👉పేదల ఆకలికి మతంతో సంబంధం లేదు అని ముస్లింలతో పాటు హిందువులకు సైతం రంజాన్ కిట్లు పంపిణీ: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ..
- పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం పేద వారు ఉపవాసాలు ఉండటానికి ఇబ్బంది పడకుండా వారి పేదరికం అడ్డురాకుండ ఉండేందుకు ఈ రోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయం నందు ఇద్దరికీ సరిపడా సరుకుల కిట్లు పంపిణీ చెయ్యటం జరుగుతుంది. ఇందులో భాగంగా పేదరికానికి మతంతో సంబంధం లేదు కాబట్టి మాతోటి పేద హిందూ సోదరులు కూడా కడుపు నిండా భుజించాలి అనే సంకల్పంతో 25 పేద హిందూ కుటుంబాలకు కూడా రంజాన్ సరుకుల కిట్లు పంపిణీ చెయ్యటం జరిగిందని సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ తెలియచేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మన దేశం ఇటువంటి మన ప్రాంతంలో పేదరికం అనేది కేవలం ముస్లిం సమాజంలోనే కాదు అన్ని వర్గాల్లో కూడా పేద వారు ఉంటారని వారిని కూడా ఈ రంజాన్ సందర్భంగా ఆదుకోవటమే ఇస్లాం నేర్పిస్తుంది, ఆకలికి మతంతో సంబంధం లేదని బోధిస్తుందన్నారు.కార్యక్రమంలో MHPS రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ షబానా,రాష్ట్ర కార్యదర్శి మెహ్పార, ఫాతిమా,జలాల్, ఆఫ్రొజ్, శమ్మి తదితరులు పాల్గొన్నారు.
👉*వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా కందుకూరు రోడ్ లో ఏర్పాటు
చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
👉సిఏఏ అమలు ఓటు రాజకీయమే.. ఓట్ల కోసం పదవి కోసం కులమతాల చిచ్చు.. శ్రీరాముడు హర్షిస్తాడా.???ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎంఎస్ బేగ్.. ఎన్నికల ముందు సిఏఏ అమలు ఓటు రాజకీయమే అని ఆవాజ్ కమిటీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎం ఎస్ బేగ్ ఆరోపించారు .ఎన్నికల ముందు ఓటు రాజకీయాలు చేస్తూ, మతం పేరుతో మారణ హోమాలు చేస్తూ,తాము చేస్తున్న అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి బిజెపి ఆడుతున్న నాటకం అన్నారు. ఓవైపు ధరలు పెరిగిపోతూ నిరుద్యోగం పెరిగిపోతు, దేశం దారిద్రరేఖ దిగువకు దిగజారి పోతుంటే బిజెపి మాత్రం తాము ఎన్నికలలో గెలిచేందుకు ఎన్నో కపట నాటకాలు ఆడుతుందని ఆరోపించారు.దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన నోరు విప్పక పోవడం , మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులపై మౌనం వహించడం చూస్తుంటే ఇది రామరాజ్యమో,రావణ రాజ్యమో అర్థం కావడం లేదున్నారు . ఇటువంటి అవినీతిపరులను మోసగాళ్ళు శ్రీరాముని పేరును సైతం ఉచ్చరించడానికి అర్హత లేదని అన్నారు. మోసాలను ఏ దేవుడు హర్శించడన్నారు.అంబానీ అదానీ లాంటి శత కోటీశ్వరులకు కోట్ల లక్షల కోట్ల బ్యాంకు బకాయిలు రద్దు చేస్తూ, పేద ప్రజల సంక్షేమ పథకాలకు కోత పెడుతూ ప్రజలు ఇటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా సోదరభావంతో కలిసిమెలిసి ఐకమత్యంతో జీవిస్తున్న ప్రజల మధ్య కులమతాల పేరుతో చిచ్చులు పెట్టి బిజెపి పబ్బం గడుపుకుంటుందన్నారు. ఇప్పటికైనా ఇటువంటి కుటిల రాజకీయాలను మాను కోకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు.
👉మతప్రాతి ప్రాతిపదికగా ఒక మతాన్ని మినహాయించి పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగం ఆశయాలకు భిన్నంగా వ్యవహరించడమే
అని జామియా మసీదు కమిటీ ట్రెజరర్ షేక్ అబ్దుల్ రజాక్ బాషా, నూరుల్ హుదా మసీదు కమిటీ షేక్ హబీబుల్లా తో పాటు పలువురు ముస్లిం పెద్దలు తీవ్రంగా ఖండించారు. కులం మతం ఇత్యాది భావనలతో వ్యక్తిగత నమ్మకాలతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో నివసించే వారందరూ భారత ప్రవచిస్తుంటే కొందరిని ప్రత్యేకించి ఒక మతం వారిని వేరు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని వారు ఖండించారు. బిజెపి ప్రభుత్వం తాము చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి కుట్రలు పన్నుతుందని వారు ఆరోపించారు.
👉 సి ఏ ఏ ను కేరళ ప్రభుత్వము అమలు చేయమని ముఖ్యమంత్రి తెలిపారని అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియజేయాలని నంద్యాల ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి తెలిపారు.లేనిపక్షంలో సి ఎ ఏ అమలు చేస్తున్న బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి జనసేన పార్టీలు ఈ రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించాలని లేనియెడల నిజాయితీ ఉన్న ముస్లిం సోదరులందరూ ఆ పార్టీలను ఓడించాలన్నారు
👉 మార్కాపురం గిద్దలూరులో ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
*- దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులు.. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ నాయకులు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో సంక్షేమ పథకాలు పరుగులు పెట్టేందుకు మరోసారి ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బవించి 13 వసంతాలు పూర్తి చేసుకొని 14 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా మార్కాపురం, గిద్దలూరు పట్టణాలలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిర్బవ దినోత్సవ వేడుకలు ముందుగా దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహనికి పార్టీ నాయకులతో కలిసి వారు నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగనన్న గడచిన 13 ఏళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను అమలు చేయడమే కాక, చెప్పని హామీలతోపాటు, అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలోలేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. జగనన్న అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత,వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా, వైయస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ కాపు నేస్తం,ఈ బీసీ నేస్తం తదితర సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని , మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
*వైసీపీలో చేరిన ముండ్లపాడు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు.*..ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మంగళవారం వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.