👉అమరావతి..సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాఖ టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన సతీమణి సంధ్యా రాణి
.విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్ ఎలక్షన్ ఇంచార్జిగా పనిచేసిన రామచంద్ర రావు గతంలో ఏపీసీసీ జాయింట్ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్ర రావు (వాడబలిజ సామాజికవర్గం), సెన్సార్ బోర్డు మెంబర్‌గా, పోర్ట్ ట్రస్ట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
👉టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ.
సోమవారం ఉండవల్లి నివాసంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసి బీజేపీతో కలిసిన అనంతరం రాష్ట్రంలో వైసిపి టీడీపీ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఎలా త్రిప్పి కొట్టాలని అలాగే ముస్లింలలో వైసిపి సృష్టిస్తున్న అభద్రత భావం తదితర అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఫారుక్ షిప్లి తెలిపారు . తన మాటలను సావధానంగా ఆలకించిన చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడిన వీడియోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ ద్వారా మార్పు చేసి వైసిపి కుట్ర చేసిందని ఆ వీడియోలు తప్పు అని వివరించారన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో ముస్లిం డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు పూర్తి భరోసా కల్పిస్తామని,అలాగే బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలవటం జరిగింది కాబట్టి ముస్లిం సమాజం దూర దృష్టితో మమ్మల్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాసటగా ఉండాలన్నారు,అలాగే గతంలో కూడా టీడీపీ బీజేపీతో కలిసినప్పటికీ ముస్లింల ఆర్థిక,సామాజిక,విద్య,రాజకీయ,అంశాల్లో పూర్తిగా టీడీపీ ముస్లిం సమాజానికి వెన్ను దన్నుగా ఉందన్నారు.అంతేకాక మతపరమైన అంశాల్లో ఎక్కడ జోక్యం చేసుకోలేదు ఆన్న సంగతి ముస్లింలు గుర్తించాలన్నారు.
👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు వైకాపా ఇంచార్జ్ నాగార్జున రెడ్డి *సోమవారం గిద్దలూరు పట్టణంలోని చిన్న మసీద్ సెంటర్ లో ఎమ్మెల్యే కేపీ పలువురు వైసీపీ నాయకులను, ప్రజలను మార్నింగ్ కాఫీ సమయంలో కలిశారు. వారితో కలిసి కాఫీ తాగి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలనీ కోరారు. గిద్దలూరు అభ్యర్థి గా తనను ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 👉బేస్తవారిపేట లో కాపు సీనియర్ నాయకులు,బేస్తవారిపేట కళ్యాణ్ థియేటర్ యజమాని తుపాకుల వెంకటయ్య ప్రార్ధివ దేహానికి నివాళులు అర్పించారు …
గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి, వారి మామ కంభం మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి,.వైయస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు..*గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో వెలసిన పోలేరమ్మ దేవి మహా కుంభాబిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను పోలేరమ్మ దేవస్థాన కమిటీ.వారు ఆయనకు అందజేశారు..👉గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గిద్దలూరు టౌన్ శ్రీరామ్ నగర్ 7వ వార్డులో ఆయన సతీమణి కల్పనారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.