👉అమరావతి..సీఎం క్యాంప్ కార్యాలయంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు).కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేసారు.కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమా (వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్) పాల్గొన్నారు.
👉*సొంత గూటికి ఓబులరెడ్డి పల్లె గ్రామ వైసీపీ మద్దతుదారులు*
*ఓబుల్ రెడ్డి పల్లె గ్రామం లో తెలుగు దేశం పార్టీ వీడి 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక*… రాచర్ల మండలం పాలక వీడు పంచాయతీ పరిధిలోని ఓబుల్ రెడ్డి పల్లె గ్రామంలో గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ వారు బలవంతంగా టిడిపిలో చేర్పిస్తే ఈరోజు వారు గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుందురు నాగార్జున రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కే అన్నారు.
👉టీడీపీని వీడి ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైసీపీ లో చేరిన 12 కుటుంబాలు..మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు సమక్షంలో మార్కాపురం పట్టణంలోని 17 వ వార్డు లో నివాసం ఉంటున్న 12 కుటుంబాలకు చెందిన టీడీపీ మద్దతుదారులు షేక్.సలామ్ వైస్సార్సీపీ లో చేరారు.బుధవారం మార్కాపురం పట్టణములోని 14వ వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నారాంబాబు పాల్గొనగా వైస్ చైర్మన్ షైక్.ఇస్మాయిల్, వైసీపీ నాయకులు కరీముల్లా,సయ్యద్ గఫుర్ల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నా చేరిన వారికీ పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే అన్నా పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబుని,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామన్నారు.*……..
*రాచర్ల మండలం, ఒద్దులవాగుపల్లె గ్రామంలో మదిరె శ్రీధర్ రెడ్డి కుమార్తె చి. చిదన్వి పుట్టినరోజు వేడుకల్లో గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
👉గిద్దలూరు పట్టణంలో సెయింట్ పాల్స్ విద్యా సంస్థల అధినేత గోనా ఆశీర్వాదం పుట్టినరోజు సందర్బంగాటీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
👉ముత్తుముల సమక్షంలో 250 మంది ఆర్యవైశ్యు లతో సహా టీడీపీలో చేరిన సచివాలయ కన్వీనర్*
గిద్దలూరు పట్టణంలోని డిఆర్ఆర్ ప్లాజా సమీపంలోని వాసవి నగర్ లో ఆర్యవైశ్య సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు వారి సతీమణి పుష్పలీల ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కారం చేశానని గుర్తు చేశారు. ఆర్యవైశ్య సోదరులంతా స్థానికంగా నివాసం ఉండే తనకు మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు.ఈ సందర్బంగా పట్టణానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు సచివాలయ కన్వీనర్ వాడకట్టు రామాంజనేయులు ఆధ్వర్యంలో 250 మంది ఆర్యవైశ్య సోదరులతో సహా వైసిపిని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈసందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరముగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులంతా కలిసికట్టుగా పనిచేసి గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ రెడ్డిని గెలిపిస్తామన్నారు.
👉మై జీవన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 60 మంది నిరుపేద ముస్లింలకు ఉచిత బియ్యం పంపిణీ*పవిత్ర రంజాన్ మాసంలో కంభం పట్టణానికి చెందినషేక్ మహబూబ్ బాషా జ్ఞాపకార్థం వారి కుమారులు షేక్ బాజీద్ భాష,డాక్టర్ లతీఫ్ ల ఆధ్వర్యంలో దాదాపు ఒక లక్ష రూపాయల విలువగల బియ్యం ప్యాకెట్లను 60 మంది నిరుపేద ముస్లింలకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ తండ్రి వర్ధంతి నాడు ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేయడం తమకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన పలువురు మహబూబ్ బాషా కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ సలీం, సయ్యద్ హుస్సేన్ బాషా, డిష్ మున్నా,మహబూబ్ బేగ్, పేర్లి గుండయ్య, కరీముల్లా బేగ్,షాకీర్ బేగ్,రసూల్ ఖాన్,రమేష్ బాబు, శివలక్ష్మి న్యామతుల్లా తదితరులు పాల్గొన్నారు .