వైఎస్ జగన్ ‘ఆపరేషన్ కాపు’వైసీపీలోకి మరో కాపునేత!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో ఎన్నికలకు ప్రకటన వెలువడటంతో రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వెలువడటంతో రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి.అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది.కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘ఆపరేషన్ కాపు’కు శ్రీకారం చుట్టారని టాక్ నడుస్తోంది.ఇప్పటికే కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ హోం మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ ను వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆయన వైసీపీలో చేరారు.అలాగే మరో కాపు నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి,కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పంపి ఆయనను కూడా వైసీపీలోకి ఆహ్వానించడంతో ముద్రగడ సైతం వైసీపీలో చేరారు.ఇప్పుడు తాజాగా దివంగతనేత వంగవీటి మోహన్ రంగా అన్నయ్య వంగవీటి నారాయణరావు కుమారుడు వంగవీటి నరేంద్ర వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.గతంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన వంగవీటి నరేంద్ర ప్రస్తుతం రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతుండగా ‘ఆపరేషన్ కాపు’లో భాగంగా నరేంద్రను కూడా వైసీపీలోకి ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో నరేంద్ర..జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పటివరకు వైసీపీలో చేరిన ముగ్గురు కాపు నేతలు.. చేగొండ,ముద్రగడ,వంగవీటి నరేంద్ర.. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు.వంగవీటి రంగాను చంపిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని నరేంద్ర మండిపడ్డారు.తాను ఉన్న బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తట్టుకోలేకే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంప్రదించారని..వైసీపీలో చేరాలని ఆహ్వానం పలికారని వెల్లడించారు.వంగవీటి రంగాను అభిమానిస్తున్నానని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని వంగవీటి నరేంద్ర నిలదీశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు ఎంతో లబ్ధి కలుగుతుందని నరేంద్ర కొనియాడారు. పేదల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని ప్రశంసించారు.
👉 డబ్బులతో పవన్ రాజకీయాలు..వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత..పవన్ కు రాజకీయాలపై క్లారిటీ లేదు.. జనం డబ్బులకు అమ్ముడు పోతారని వ్యాఖ్యలు
చేయటం సరికాదు..ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓట్లేయాలని కోరుతాం.కాపు మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది..నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం..ఆయన్ను కూడా నేను మా పార్టీలోకి రమ్మంటే బాగుంటుందా? అని ప్రశ్నించారు.
👉*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి..మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి..
*రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించి జగనన్న ను మరలా ముఖ్య మంత్రి చేసుకుందామని మార్కాపురం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. బుధవారం మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ కల్యాణ మండపంలో మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమం లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిని బారి గజ మాలతో ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీ నాయకులకు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిని పరిచయం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మార్కాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని గెలిపించి రాబోయే రోజుల్లో మార్కాపురం నియోజకవర్గమును అభివృద్ధి పధంలో నడిపిద్దామన్నారు.వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ శ్రేణులందరూ కలిసి కట్టుగా పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*
👉 *మార్కాపురం శాసనసభ్యులు గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేపి.నాగార్జున రెడ్డి తండ్రి కేపి.కొండారెడ్డిని
ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ,గిద్దలూరు శాసన సభ్యులు,మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు,ఎర్రగొండపాలెం ఇంచార్చ్ తాడిపత్రి చంద్రశేఖర్,రాష్ట్ర ఏపి ఐసిసి అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, వెన్న హనుమారెడ్డి,కౌన్సిలర్లు, వైయస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు..*
*అర్ధవీడు మండలం మొయిద్దిన్ పురం గ్రామం లో రెండవ రోజు సుడిగాలి పర్యటన చేసిన గిద్దలూరు ఇన్చార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి మామ కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాస రెడ్డి, మండల వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు..
*టీడీపీని వీడి వైసీపీలో చేరిన షేక్ ఖాదర్ బాషా కుటుంబం*..
మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు తనయుడు సమక్షంలో పొదిలి పట్టణంలోని 7వ వార్డు లో నివాసం ఉంటున్న షేక్.ఖాదర్ బాషా(పల్లిబాషా)కుటుంబానికి చెందిన పలువురు టీడీపీ మద్దతుదారులు షేక్.సందని,సాధిక్, గౌసియ వైస్సార్సీపీ లో చేరారు.బుధవారం పొదిలి పట్టణములోని 6వ వార్డులో ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా కృష్ణ చైతన్య పాల్గొనగా వైసీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాస్ రెడ్డి,గొలమరి చెన్నారెడ్డిల ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు తనయుడు చేరిన వారికీ పార్టీ కండువాలు వేసి అన్నా కృష్ణ చైతన్య పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.