అస్వస్థకు గురైన గవర్నర్ నజీర్..టిడిపి ఎన్నికల వ్యూహం వర్క్ షాప్ లో ప్రకాశం జిల్లా నాయకులు..వైకాపా స్టిక్కర్లతో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్లు స్వాధీనం..ఎమ్మెల్యే కేపీ ఉధృత ప్రచారం..

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్*

(విజయవాడ)గవర్నర్అబ్దుల్ నజీర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యులు గవర్నర్ కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

👉 విజయవాడ ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల వ్యూహం వర్క్ షాప్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రావు.

👉ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వైకాపా ఎమ్మెల్యేపై కేసు నమోదు…..గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం వైకాపా ఇన్చార్జి అన్నా రాంబాబుపై కేసు నమోదు చేశారు .ఆయనతో పాటు షంషీర్ అలీభేగ్, కౌన్సిలర్ సలీంపై కేసు నమోదు…ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న వైకాపా నాయకులు.దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా.మున్సిపల్ కమిషనర్ కిరణ్ పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.

👉గిద్దలూరు లో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలు..

వైకాపా అభ్యర్థుల బొమ్మలతో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్లు, డిన్నర్ సెట్లు స్వాధీనం…గిద్దలూరు- ఒంగోలు హైవే లోని మిస్టర్ చాయ్ దుకాణం సమీపంలో ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారులు చెక్ చేస్తున్న తరుణంలో AP16DK5099 కార్ లో ఓటర్లకు ఇవ్వడానికి డిన్నర్ సేట్లు వాటితో పాటు వైసిపి స్టిక్కర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించినారు. అలాగే ఓ కారులో వాలంటరీలకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న గిఫ్ట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు..గిఫ్ట్ ప్యాకెట్లపై జగన్ బొమ్మ తో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి బొమ్మలు..గిఫ్ట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని గిఫ్ట్ ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తిని విచారిస్తున్న అధికారులు.

👉రెండవ రోజు బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లె గ్రామంలో ఎన్నికల పరిచయ కార్యక్రమం నిర్వహించిన గిద్దలూరు ఇంచార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి   *👉 ఎన్నికల ప్రచారంలో బాగంగా నేకునాంబాదు గ్రామంలో నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిదిగా  పాల్గొన్నారు.కార్యక్రమంలో మండల వైయస్సార్శీపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..👉*సొంత గూటికి బి.పేట మండలం జేసీ అగ్రహారం గ్రామ వైసీపీ మద్దతుదారులు*….

జేసీ అగ్రహారం గ్రామంలో తెలుగు దేశం పార్టీ వీడి 25 కుటుంబాలు నిన్న సర్పంచ్ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జీ కుందురు నాగార్జునరెడ్డి సమక్షమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..

సీఎం సమక్షంలో వైకాపాలో చేరిన కీలక నేతలు..ప్రచారంలో మాగుంట చందన..జగన్ సర్కారు పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైకాపాలో చేరికలు..ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఎస్ఐఓ..రాష్ట్రస్థాయిలో కంభం వాసవి విద్యార్థుల ప్రతిభ.

బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స